హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్ బస్సు మిత్రపక్షాలతో నిండుతుందా ?

కాంగ్రెస్ బస్సు మిత్రపక్షాలతో నిండుతుందా ?

మూడు రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ధీటుగా ఎదుర్కొంటున్న నమ్మకం మిత్రపక్షాల్లో కొంతమేర నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా రాహుల్ గాంధీని ఫోకస్ చేసే ప్రయత్నాలు చేయడం చాలామందికి నచ్చడం లేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ ఈ అంశంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని తమ వైపు తిప్పుకుని యూపీఏను బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంటోంది. ఈ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. ఇటీవల యూపీఏలోకి కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ టీడీపీ వచ్చి చేరింది. బీజేపీ తీరుతో విసిగిపోయి ఉన్న మరికొన్ని పార్టీలు సైతం ఈ కూటమిలోకి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని తమ పార్టీ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి తమ మిత్రపక్షాలను కూడా ఆహ్వానించింది. ఒకరకంగా చెప్పాలంటే... ఈ సభల్లో తమ కూటమి బలనిరూపణకు ప్రాధాన్యత ఇచ్చింది. కూటమి భాగస్వామ్యపక్షాల నేతలతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ కీలక నేతలు ప్రయాణించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయాణించిన బస్సుల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ, నేషనల్ కాన్ఫిరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, బీహార్‌కు చెందిన శరద్ యాదవ్ వంటి వారు ఉన్నారు. ఇక మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే. అయితే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఢిల్లీలో అధికార దక్కాలంటే...ఈ బస్సులో మరికొన్ని పార్టీలు కూడా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ, బీఎస్పీతో పాటు బెంగాల్‌కు చెందిన మమత బెనర్టీ ఈ బస్సులోకి ఎక్కితేనే... కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో హస్తిన పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు మెరుగుపడతాయన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ కలిసి వచ్చే ఎన్నికల్లో 80 లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.

  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో మమతా బెనర్జీ
  సోనియాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీ

  మూడు రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ధీటుగా ఎదుర్కొంటున్న నమ్మకం మిత్రపక్షాల్లో కొంతమేర నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా రాహుల్ గాంధీని ఫోకస్ చేసే ప్రయత్నాలు చేయడం చాలామందికి నచ్చడం లేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ ఈ అంశంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇస్తేనే తాము ఆ పార్టీకి మద్దతు ఇచ్చే యోచనలో ఈ మూడు పార్టీలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి... కాంగ్రెస్ పార్టీ బస్సులోకి మరిన్ని మిత్రపక్షాలు ఎక్కుతాయా లేక సొంత బస్సులో ప్రయాణం చేస్తాయా అన్న ప్రశ్నకు త్వరలోనే స్పష్టత రావొచ్చు.

  First published:

  Tags: Bjp, Congress, DMK, Mamata Banerjee, Mayawati, Pm modi, Rahul Gandhi, TDP

  ఉత్తమ కథలు