WILL CENTRE WILL BAN FLOUR EXPORTS AFTER TRADERS INCREASE IT DUE TO BAN OF WHEAT EXPORTS AK
Flour: కేంద్రం పిండి ఎగుమతులను కూడా నిషేధించనుందా ?.. ఎందుకంటే..
పిండి ఎగుమతులపై కేంద్రం ఫోకస్ (ఫైల్ ఫోటో)
Flour Exports: కొత్త నిబంధన ప్రకారం.. పిండి ఎగుమతిదారులందరూ తమ పరిమాణం, ధర, స్థలాన్ని ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కువ పిండిని ఎగుమతి చేస్తే చర్యలు తీసుకుంటారు.
దేశీయ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు పెరగకుండా ఉండేందుకు మే 13న గోధుమల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్రం(Centre) నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు, ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఈ విషయంలో ముందుకే సాగింది. అయితే ఇప్పుడు పిండి(Flour Exports) ఎగుమతులపై కేంద్రం దృష్టి పెట్టడంపై వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. నిజానికి గోధుమల ఎగుమతిపై నిషేధం తర్వాత వ్యాపారులు తప్పుడు మార్గంలో పిండి ఎగుమతి చేస్తుండడంతో ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. మే 13న గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన తర్వాత పిండి ఎగుమతులు ఒక్కసారిగా పుంజుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ(Ministry for Trade and Commerce) తెలిపింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను తుంగలో తొక్కేందుకు వ్యాపారులు కొత్త మార్గాలను అన్వేషిస్తుండగా ఇప్పుడు గోధుమలకు బదులు పిండిని ఎగుమతి చేసే ప్రక్రియ సాగుతోంది.
మే 13 తర్వాత పిండి ఎగుమతులు అకస్మాత్తుగా రెండింతలు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిషేధం తర్వాత ప్రతి నెలా సుమారు లక్ష టన్నుల పిండి ఎగుమతి అవుతుండగా, గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 5 లక్షల టన్నుల పిండి మాత్రమే ఎగుమతి అయింది. ఆంక్షలను ఉల్లంఘించేందుకు వ్యాపారులు నకిలీ లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఏప్రిల్ 1 నుండి జూన్ 14 వరకు, భారతదేశం యొక్క గోధుమ ఎగుమతులు 297 మిలియన్ టన్నులు కాగా, ఈ కాలంలో పిండి ఎగుమతి 2.59 లక్షల టన్నులుగా ఉంది. నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వం చాలా అవసరమైన దేశాలకు గోధుమలను ఎగుమతి చేసింది.
మే 13న నిషేధం తర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలకు 18 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి అయినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. పిండి ఎగుమతిని పర్యవేక్షించడానికి ప్రీ-షిప్మెంట్ నోటిఫికేషన్‌ను తప్పనిసరి చేయడాన్ని పరిశీలిస్తున్నామని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారి తెలిపారు. ఇది పిండి రవాణా ద్వారా గోధుమ ఎగుమతిపై పరిమితులను ఉల్లంఘించే వారిని కట్టడి చేస్తుందని అన్నారు.
కొత్త నిబంధన ప్రకారం.. పిండి ఎగుమతిదారులందరూ తమ పరిమాణం, ధర, స్థలాన్ని ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కువ పిండిని ఎగుమతి చేస్తే చర్యలు తీసుకుంటారు. గోధుమలపై నిషేధం ఉన్నప్పటికీ.. దాని నిల్వను వేగవంతం చేయడం లేదని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే హెచ్చరించారు. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా గోధుమల ధరలలో స్వల్ప తగ్గుదలని చూపుతున్నాయని అన్నారు. 50 వేల టన్నుల్లో 33 వేల టన్నుల గోధుమలు కేవలం మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్థాన్‌కు ఎగుమతి చేశామని తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.