సీబీఐ మాజీ బాస్ ఆలోక్ వర్మ బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తారా ?

ఉద్యోగానికి రాజీనామా చేసిన సీబీఐ మాజీ బాస్ ఆలోక్ వర్మ ఏం చేయబోతున్నారనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన బాహాటంగా స్పందిస్తే... బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: January 11, 2019, 5:21 PM IST
సీబీఐ మాజీ బాస్ ఆలోక్ వర్మ బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తారా ?
ఆలోక్ వర్మ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: January 11, 2019, 5:21 PM IST
సీబీఐ వివాదంలో ఓ ప్రధాన అంకం ముగిసిపోయింది. అనేక మలుపులు తిరిగిన సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ వ్యవహారం... చివరకు ప్రభుత్వం ఆయనను సంస్థ నుంచి తప్పించడంతో ముగిసిపోయింది. కోర్టు నుంచి మళ్లీ సీబీఐ బాస్ అయ్యేందుకు లైన్ క్లియర్ చేసుకున్న ఆలోక్ వర్మ... ప్రభుత్వంలో మరోసారి తనను సంస్థ నుంచి బయటకు పంపడంతో ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేశారు. తనను బదిలీ చేసిన ఫైర్ సర్వీసులు, హోంగార్డు సర్వీసుల డీజీ విధుల్లోకి హాజరుకాకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసిన సీబీఐ మాజీ బాస్... తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయారనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేశారు. సంస్థ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ఇంకా ఓ కేసు విషయంలో విచారణ ఎదుర్కొంటున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ


సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి కేంద్రం తనను తప్పించడంతో ఆలోక్ వర్మ ఏం చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు తమను బదిలీ చేసిన చోటికి వెళ్లి... ఆ పోస్టును స్వీకరిస్తారు. కానీ... ఆలోక్ వర్మ మాత్రం ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా చేశారు. దీంతో ఆయన ఈ వ్యవహారంపై బాహాటంగా స్పందించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాఫెల్ డీల్‌కు సంబంధించి ఆరా తీయడం వల్లే ఆలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ చేశారని కాంగ్రెస్ చాలాకాలం నుంచి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆలోక్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తారా ? అనే కోణంలో చర్చ మొదలైంది.

ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ (PTI)
ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ (File:PTI)
ఒకవేళ ఈ మొత్తం వ్యవహారంపై ఆలోక్ వర్మ స్పందిస్తే... అది కచ్చితంగా బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి ఇబ్బంది కలిగించే పరిణామం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే టాక్ ఉంది. అయితే ఆలోక్ వర్మ బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే... ఆయన కాంగ్రెస్ మనిషి అని బీజేపీ కూడా కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన సీబీఐ మాజీ బాస్ ఆలోక్ వర్మ ఏం చేస్తారనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...