ఇథియోపియా విమాన ప్రమాదంలో ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్ శిఖ గార్గ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి బోయింగ్ 737 మ్యాక్స్ విమానంలో నైరోబీ బయలుదేరిన ఆమె.. విమాన ప్రమాదంలో మృతి చెందారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకు ఆమె తన భర్తకు ఓ టెక్స్ట్ మెసేజ్ చేశారు. ఇప్పుడే విమానం ఎక్కానని, ల్యాండ్ అయ్యాక కాల్ చేస్తానని భర్త మొబైల్ ఫోన్‌కు మెసేజ్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు భర్త నుంచి రిప్లై వచ్చేలోపే ఆమె ప్రమాదంలో చనిపోయారు.
నిజానికి శిఖా భర్త భట్టాచార్య కూడా ఆమెతో కలిసి నైరోబీ వెళ్లాలనుకున్నాడు. కానీ ఏవో కారణాలతో చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. శిఖా తిరిగొచ్చాక ఆమెతో కలిసి వెకేషన్‌కు వెళ్లేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. కానీ ఇంతలోనే భార్య గురించి విషాద వార్త వినాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే, శిఖా గార్గ్ కుటుంబ సభ్యులను కనుక్కునేందుకు సహకరించాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా నెటిజెన్స్‌ను కోరిన సంగతి తెలిసిందే. శిఖా గార్గ్‌తో పాటు విమాన ప్రమాదంలో చనిపోయిన మరో ముగ్గురు భారతీయుల వివరాలను తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air India, India, Plane Crash, SpiceJet