Home /News /national /

WILL BJP HIGH COMMAND DENY TICKET TO MORE THAN 100 SITTING MLAS IN UTTAR PRADESH AK

Uttar Pradesh: బీజేపీ కీలక నిర్ణయం తీసుకోనుందా ?.. 100 మంది ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా ?

యోగి, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

యోగి, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

BJP: భారతీయ జనతా పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి తీరాలని అధికార బీజేపీ పట్టుదలగా ఉంది. ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం పట్ల కొంతమేర వ్యతిరేకత ఉంటుంది. దీన్ని అధిగమించడంపై ఫోకస్ చేసిన బీజేపీ.. పనితీరు సరిగ్గా లేని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 100 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లను నిరాకరించాలనే భావనలో ఉన్నట్టు సమాచారం. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడం కోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ వారంలో సమావేశం కానుంది. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సుమారు 100 మందికి టికెట్లు నిరాకరించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ యూపీలో తొలి రెండు దశల ఎన్నికలకు సంబంధించి తమ సిఫార్సులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రానికి చెందిన ఇతర నేతలు మంగళవారం ఢిల్లీకి చేరుకోనున్నారు.

    అంతకుముందు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో అభ్యర్థుల పేర్లపై చ‌ర్చ జ‌రిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల ముఖాల్లో దాదాపు 25 శాతం మారవచ్చని ఈ భేటీ అనంతరం సమాచారం బయటకు వచ్చింది. అయితే దీనిపై ఈ వారంలో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో మొదటి, రెండో, మూడో దశ అభ్యర్థుల పేర్లపై చర్చ జరగనుంది.

    ప్రస్తుతానికి లక్నో ఢిల్లీలో కేంద్ర నేతలు అంటే కోర్ గ్రూప్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల పేర్లపై తుది చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇందులో జెపి నడ్డా కూడా పాల్గొంటారని గతంలో వార్తలు వచ్చాయి, అయితే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో.. ఆయన ఈ భేటీలో పాల్గొంటారా ? లేదా ? అన్నది సందేహంగా మారింది. అయితే ఈ సమావేశానికి యూపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ సహా పలువురు నేతలు హాజరుకానున్నారు.

    UP Election 2022: బీజేపీకి భారీ షాక్ -మంత్రి పదవికి మౌర్య రాజీనామా.. ఆ వెంటనే..

    UP Election 2022: మాయావతి ఎక్కడ? పోటీకి దూరంగా BSP అధినేత్రి

    భారతీయ జనతా పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దాదాపు 100 మంది సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేల భవితవ్యం డైలమాలో ఉందని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు. వారి గురించి ప్రతికూల అభిప్రాయం రావడమే ఇందుకు కారణం. వివిధ రాష్ట్రాల నుంచి ఆఫీస్ బేరర్లను పిలిపించి... బీజేపీ నాయకత్వం ఒక్కో సీటుపై సొంతంగా సర్వే నిర్వహించింది. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ప్రజల నుంచి స్థానిక నేతలకు అభిప్రాయాన్ని కూడా తీసుకుంది. ప్రజాదరణ లేని ఎమ్మెల్యేలను తొలగించడం ద్వారా, యోగి ప్రభుత్వ పనిని మెచ్చుకోవడం ద్వారా పార్టీకి పూర్తి ప్రయోజనం లభిస్తుందని బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాలలో 2017 పనితీరు పునరావృతమవుతుందని బీజేపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అయితే ప్రతికూల పనితీరు ఉన్న 100 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Uttar Pradesh Assembly Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు