Home /News /national /

WILL APARNA YADAV GET THE CHANCE TO CONTEST IN UTTAR PRADESH ASSEMBLY ELECTIONS FROM LUCKNOW CANTONMENT SEAT AK

Aparna Yadav: అపర్ణ యాదవ్ విషయంలో బీజేపీ లెక్కేంటి ? ఎన్నికల్లో పోటీ చేస్తారా ?

యోగి, నడ్డాతో అపర్ణ యాదవ్

యోగి, నడ్డాతో అపర్ణ యాదవ్

Aparna Yadav: లక్నో కంటోన్మెంట్ కాకుండా ఆమె మరో సీటు నుంచి పోటీ చేయాలని కచ్చితంగా అనుకుంటే.. అప్పుడు బీజేపీ నాయకత్వం కూడా ఆమె విజ్ఞప్తిని పరిశీలించే అవకాశం లేకపోలేదనే వాదన వ్యక్తమవుతోంది.

    ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ లాంఛనంగా బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడు అపర్ణ యాదవ్ సేవలను బీజేపీ ఏ రకంగా వాడుకోనుందనే చర్చ ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే అపర్ణ యాదవ్ విషయంలో బీజేపీ వ్యూహం వేరుగా ఉందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో అపర్ణా యాదవ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అపర్ణ యాదవ్‌ను శాసన మండలికి పంపి.. భవిష్యత్తులో ఆమెకు పెద్ద బాధ్యతను ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. అపర్ణ యాదవ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

    ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మను లక్నో నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీకి దించవచ్చని చెబుతున్నారు. నిజానికి లక్నో కంటోన్మెంట్ స్థానంలో బ్రాహ్మణ ప్రాబల్యం ఎక్కువ. కాబట్టి ఈ స్థానంలో దినేష్ శర్మకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఎన్నికల సమయంలో సీట్ల సమీకరణ దృష్ట్యా అపర్ణ యాదవ్ లక్నో కంటోన్మెంట్ నుండి పోటీ చేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదనే భావనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. లక్నో కంటోన్మెంట్ కాకుండా ఆమె మరో సీటు నుంచి పోటీ చేయాలని కచ్చితంగా అనుకుంటే.. అప్పుడు బీజేపీ నాయకత్వం కూడా ఆమె విజ్ఞప్తిని పరిశీలించే అవకాశం లేకపోలేదనే వాదన వ్యక్తమవుతోంది.

    మరోవైపు అపర్ణ ద్వారా అఖిలేష్ యాదవ్‌ను టార్గెట్ చేయించడంపైనే బీజేపీ ఎక్కువగా దృష్టి పెట్టొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. అలా చేయడం వల్ల ఆమె ద్వారా బీజేపీకి కలిగే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని పార్టీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో అపర్ణ లేదా బీజేపీ ఆలోచనలు చివరి నిమిషంలో మారితే.. పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నది సస్పెన్సే. ఇక అపర్ణ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఆమెకు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.

    బావ అఖిలేశ్‌పై మరదలు పోటీ! -ఆమెది యోగి కులమే!! -ఎవరీ Aparna Yadav?

    Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో పొత్తులపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కీలక ప్రకటన..

    అపర్ణ యాదవ్ ద్వారా తమ పార్టీ భావజాలం బీజేపీలోకి కూడా వెళుతుందని తాను భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అదే జరిగితే బీజేపీలో ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుందని అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై అఖిలేష్ యాదవ్ నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆజంగఢ్ ప్రజలు అభిప్రాయం మేరకు తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. దీంతో ఆయన ఆజంగఢ్ జిల్లాలోని గోపాల్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లిన ములాయం సింగ్ యాదవ్ కోడలు.. తన బావ అయిన అఖిలేష్ యాదవ్‌ టార్గెట్ చేసేలా రాజకీయాలు చేస్తారా లేక కేవలం ఒక సీటులో గెలిచేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Uttar Pradesh Assembly Elections

    తదుపరి వార్తలు