హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Wild Elephants: ఈ వార్త చదివితే ఆశ్చర్యపోతారంతే.. వినాయకుడి విగ్రహాలను ఎత్తుకెళ్తున్న గజరాజులు.. ఎక్కడంటే..?

Wild Elephants: ఈ వార్త చదివితే ఆశ్చర్యపోతారంతే.. వినాయకుడి విగ్రహాలను ఎత్తుకెళ్తున్న గజరాజులు.. ఎక్కడంటే..?

కేరళలో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న గజరాజులు

కేరళలో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న గజరాజులు

కేరళలో కొన్ని అడవి ఏనుగులు మనుషులకు హాని చేయట్లేదు కానీ దేవుడి విగ్రహాలను దొంగిలిస్తున్నాయి. రాష్ట్రంలోని పతనంతిట్ట (Pathanamthitta) సమీపం గవి (Gavi) గ్రామస్థులకు ఏనుగుల నుంచి ఈ వింత సమస్య ఎదురవుతోంది.

అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలకు జంతువుల నుంచి వివిధ సమస్యలు ఎదురవుతుంటాయి. క్రూరమృగాలు గ్రామాల్లోకి చొరబడి పెంపుడు జంతువులపై దాడులు చేస్తుంటాయి. మనుషులపై దాడులు చేసిన ఘటనలూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏనుగులు (Wild Elephant) తరచూ గ్రామాల్లోకి చొరబడి పంటలు నాశనం చేస్తుంటాయి. కనిపించిన మనుషులను వెంబడించి దాడులు చేస్తుంటాయి. జంతువుల సంచారంపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తే.. అధికారులు వచ్చి జంతువులను పట్టుకొని బంధించి దూర ప్రాంతాల్లో విడిచి పెట్టడమో.. అటవీ ప్రాంతాల్లోకి తరిమేయడమో చేస్తుంటారు. ఇవన్నీ సాధారణంగా జరిగే ఘటనలు. కానీ కేరళలో కొన్ని అడవి ఏనుగులు మనుషులకు హాని చేయట్లేదు కానీ దేవుడి విగ్రహాలను దొంగిలిస్తున్నాయి. రాష్ట్రంలోని పతనంతిట్ట (Pathanamthitta) సమీపం గవి (Gavi) గ్రామస్థులకు ఏనుగుల నుంచి ఈ వింత సమస్య ఎదురవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. గవి గ్రామానికి చెందిన ప్రజలు సమీప అటవీ ప్రాంతంలోని వినాయకుడి గుడికి (Ganapathi Temple) వెళ్లి పూజలు చేస్తుంటారు. వారికి ఏనుగుల నుంచి వింత సమస్య ఎదురవుతోంది. గజరాజులు వినాయకుడి ఆలయం నుంచి విగ్రహాలను(Idols) తీసుకెళ్లిపోయి.. అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నాయి. ఎవరైనా దేవుడికి పూజలు చేసుకునేందుకు వెళ్తే విగ్రహాలు ఉండటం లేదని.. వాటి కోసం అటవీ ప్రాంతాల్లో వెతకాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ప్రతిసారీ వినాయకుడి విగ్రహాలు ఎక్కడున్నాయో వెతికి తీసుకొచ్చి, ఆలయంలో పెట్టి పూజలు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్థులు తెలిపారు.

 ఇదీ చదవండి: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!


గవిలోని గణపతి దేవాలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనదని గవి నివాసి ప్రవీణ్ రాజ్ చెప్పారు. ఆ ప్రాంతంలో ఆనకట్టలు నిర్మించక ముందే ఆలయం ఉందని ఆయన వివరించారు. పూజలు చేసుకోవడానికి గుడికి వెళ్లినప్పుడు వినాయకుడు, ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు కనిపించట్లేదని, ఏనుగులు విగ్రహాలను తీసుకెళ్లి అడవిలో వదిలేస్తున్నాయని ప్రవీణ్ తెలిపారు. పూజలు చేయడానికి ముందు విగ్రహాల కోసం వెతకాల్సిన పరిస్థితికి వచ్చామని పేర్కొన్నారు. ఇక్కడ గణపతి దేవాలయంతో పాటు కొచ్చు పంపా వద్ద శ్రీ ముత్తుమారియమ్మన్ ఆలయంలో కూడా గ్రామస్థులు పూజలు చేస్తుంటారు.

గత వారం వినాయకుడి గుడి పైకప్పు, ఇతర నిర్మాణాలను ఏనుగులు ధ్వంసం చేశాయని, అయితే అదృష్టవశాత్తూ విగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని మరో గ్రామస్థుడు యోగరాజన్ చెప్పారు. విగ్రహాలను తీసుకెళ్లినా, గుడి నిర్మాణాలను ధ్వంసం చేసినా, ఏనుగులు మనుషులపై దాడులు చేయవని ఆయన తెలిపారు. నీరు, ఆహారం కోసం ఏనుగులు గ్రామ సమీపం వరకు కూడా వస్తాయని అన్నారు. అడవి ఏనుగుల నుంచి తమకు ఉన్న ఒకే ఒక్క సమస్య వినాయకుడి విగ్రహాలను తీసుకెళ్లిపోవడమేనని అన్నారు. అయితే గజరాజులు మనుషులకు ఏమాత్రం హాని తలపెట్టకుండా ఇలా విగ్రహాలను మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తున్నాయో అర్థం కావట్లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Published by:Mahesh
First published:

Tags: Elephant, Forest, Kerala, Vinayaka chavathi

ఉత్తమ కథలు