భర్తను నడిరోడ్డు మీద నిలబెట్టి అమ్మేసిన భార్య.. తాళితో సహా..

వచ్చే నెల 17వ తేదీన రమ్య రూ.5లక్షలు ఆ మహిళకు ఇవ్వడం.. భర్తను కొనుక్కోవడానికి ఒప్పందం కుదిరింది. అదే రోజు తాళిబొట్టును కూడా తీసి ఇచ్చేయాలి.

news18-telugu
Updated: October 19, 2019, 3:07 PM IST
భర్తను నడిరోడ్డు మీద నిలబెట్టి అమ్మేసిన భార్య.. తాళితో సహా..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 19, 2019, 3:07 PM IST
ఓ మహిళ తనకు తాళికట్టిన భర్తను నడిరోడ్డు మీద నిలబెట్టి అమ్మేసింది. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ భర్త కొన్నాళ్లుగా రమ్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎప్పుడూ రమ్య వద్దే ఉంటూ కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు. దీంతో భార్య కడుపు మండింది. వారిద్దరి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయించింది. ఓ రోజు తన భర్త రమ్య ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తను, రమ్యను ఇద్దరినీ రోడ్డు మీదకు లాగి రచ్చ రచ్చ చేసింది. అయితే, రమ్య దీటుగా బదులిచ్చింది. ఆ వ్యక్తి తన వద్ద డబ్బులు అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు చెల్లించకపోవడం వల్ల తానే తన వద్ద అట్టిపెట్టుకున్నానని వాదించింది. దీంతో భార్యకు కోపం నషాళానికి ఎక్కింది. అయితే, ‘నా మొగుణ్ణి పర్మినెంట్‌గా నువ్వే ఉంచేసుకో. కానీ, నా జీవితం బాగుండాలి కాబట్టి, ఎంత ఇస్తావో చెప్పు’ అని ప్రతిపాదన తెచ్చింది. శుభలగ్నం సినిమా తరహాలో ఎంత ఇస్తావో చెప్పు అనగానే.. వెంటనే రూ.5లక్షలు ఇస్తే.. పర్మినెంట్‌గా ఆమె భర్తను తనకు ఇచ్చేయాలని చెప్పింది. వెంటనే ఇద్దరు మహిళల మధ్య డీల్ కుదిరింది.

వచ్చే నెల 17వ తేదీన రమ్య రూ.5లక్షలు ఆ మహిళకు ఇవ్వడం.. భర్తను కొనుక్కోవడం అనేది నోటిమాటగా చెప్పుకొన్న ఒప్పందం. అదే రోజు తాళిబొట్టును కూడా తీసి ఇచ్చేయాలనేది మరో కండిషన్. అందుకు భార్య కూడా ఓకే చెప్పింది. నడిరోడ్డు మీద భర్తను నిలబెట్టి ఇద్దరు మహిళలు డీల్ మాట్లాడుకుంటుంటే.. ఆ వ్యక్తి బిక్కచచ్చిపోయాడు.

జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకంFirst published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...