భర్తకు స్వయంగా మరో పెళ్లి చేసిన భార్య.. అదే కారణం..

పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే కుటుంబ పరువు పోతుందని.. దానికి బదులు పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అని భర్తకు సలహా ఇచ్చింది. ఆమె అత్త,మామ కూడా అందుకు ఒప్పుకోవడంతో బాధితురాలితో మాట్లాడి ఇద్దరికి పెళ్లి జరిపించింది.

news18-telugu
Updated: November 24, 2019, 2:56 PM IST
భర్తకు స్వయంగా మరో పెళ్లి చేసిన భార్య.. అదే కారణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యే దగ్గరుండి మరీ భర్తకు మరో పెళ్లి చేసిన ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలిలో చోటు చేసుకుంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతోనే అతని పెళ్లి జరిపించింది. నిజానికి అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతో అతని భార్యే ఆమెతో పెళ్లికి ఒప్పించింది. ప్రస్తుతం ఆ ముగ్గురు ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మత్తిలి పరిధిలోని కుమార్‌పల్లికి చెందిన రామ కావసీ-గాయత్రిలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు జీవనం సాగిస్తున్నారు. కూలీ పనులకు వెళ్లేచోట భర్తకు వేరే అమ్మాయితో పరిచయం ఏర్పడి సాన్నిహిత్యానికి దారితీసింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే కొన్నాళ్లుగా ఆ యువతి రామ కావసీని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తోంది.అందుకు అతను ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో స్వయంగా అతని భార్యే ఆమెతో పెళ్లికి ఒప్పించింది.

పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే కుటుంబ పరువు పోతుందని.. దానికి బదులు పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అని భర్తకు సలహా ఇచ్చింది. ఆమె అత్త,మామ కూడా అందుకు ఒప్పుకోవడంతో బాధితురాలితో మాట్లాడి ఇద్దరికి పెళ్లి జరిపించింది. ప్రస్తుతం ఆ ముగ్గురు ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు. పెళ్లి అనంతరం.. పెట్టిన కేసును ఆమె ఉపసంహరించుకున్నారు.

First published: November 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు