హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Marriage : కోడలికి మరొకరితో పెళ్లి చేసిన అత్తమామలు..కాళ్లు కడిగి కన్యాదానం..ఎందుకో తెలుసా

Marriage : కోడలికి మరొకరితో పెళ్లి చేసిన అత్తమామలు..కాళ్లు కడిగి కన్యాదానం..ఎందుకో తెలుసా

కోడలికి మరొకరితో పెళ్లి చేసిన అత్తమామలు

కోడలికి మరొకరితో పెళ్లి చేసిన అత్తమామలు

Widow Second Marriage : బీహార్‌(Bihar)లోని ఛప్రాలో వితంతువుగా మారిన కోడలికి పెళ్లి చేసి వార్తల్లో నిలిచారు అత్తమామలు. కన్నకూతరు మాదిరిగా కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అత్తమామలు చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంకా చదవండి ...

Widow Second Marriage : బీహార్‌(Bihar)లోని ఛప్రాలో వితంతువు(Widow)గా మారిన కోడలికి పెళ్లి(Marriage) చేసి వార్తల్లో నిలిచారు అత్తమామలు. కన్నకూతరు మాదిరిగా కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అత్తమామలు చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వితంతువుగా మారిన కోడలుకు అత్తమామలు పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే

డిసెంబర్ 2017 లో, గోలా బజార్‌లో నివసిస్తున్న అశోక్ సాహ్ కుమార్తె చాందినీ కుమారికి, పరమానందపూర్‌లోని శివపూర్ గ్రామానికి చెందిన సురేంద్ర ప్రసాద్ సాహ్ కుమారుడు చందన్ కుమార్‌తో హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. కానీ జూన్ 9, 2021న చందన్ చనిపోయాడు. భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టినందుకు చాందిని బాధపడటం మొదలుపెట్టింది. ఇది చూసిన అత్తమామలు ఆమెను సంతోషంగా ఉంచాలని ప్రయత్నించినా కుదరలేదు. చిన్నవయస్సులో ఉన్న కోడలు చాందినీ భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని..ఆమె మామ సురేంద్ర ప్రసాద్ సాహ్ ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సురేంద్ర ప్రసాద్ తన భర్యాకు చెప్పాడు. కోడలికి పెళ్లి చేసేందుకు ఆమె కూడా ఓకే చెప్పింది.

Skin Care Tips For Men : మెరిసిపోయే చర్మం కోసం..వర్షాకాలంలో పురుషులు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

దీంతో చాందినీ కోసం అబ్బాయిని వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌లోని జుంజును జిల్లాకు చెందిన రోషన్ లాల్ కుమారుడు నవీన్ కుమార్ షాతో చాందినీ వివాహం నిర్ణయించారు. బుధవారం సోన్‌పూర్ ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. పెళ్లిలో సురేంద్ర తండ్రిగా మారి తన కోడలిని.. కూతురిలా దానం చేశారు. చాందినీ వివాహంలో ఆమె బావఅత్తమామలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాందినీ బావ జెత్ రాజు..ఓ సోదరుడిలా వధువు వీడ్కోలు వేడుకను నిర్వహించాడు. చాందినీకి జెత్ రాజు సాహ్ సోదరిలాగా ఇంటి వస్తువులు, బహుమతులు ఇచ్చి పంపించాడు. వితంతువుగా మారిన కోడలుకు అత్తమామలు పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అత్తమామలు వేసిన ఈ చర్యకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

First published:

Tags: Bihar, Woman Marriage

ఉత్తమ కథలు