WI FI ACCESS TV AND POTTED PLANTS INSIDE MUMBAIS LARGEST PUBLIC TOILET GH SK
Largest Public toilet: అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్.. ఫ్రీ వైఫై, టీవీ సౌకర్యం.. ఎక్కడో తెలుసా?
ముంబైలో అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్మించిన వాటిలో ఇదే అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం. ముంబై స్లమ్‌లో ఉండే 60వేల మంది కోసం ఈ అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్‌ను బీఎంసీ నిర్మించింది.
ముంబైలో ఏర్పాటు చేసిన అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్.. అధునాతన సౌకర్యాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడి వెయిటింగ్ ఏరియాలో ఉచిత వైఫై, న్యూస్ పేపర్లు, టీవీ సెట్, చిన్న బొటానికల్ గార్డెన్ ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. ముంబై అంధేరీ ప్రాంతంలోని జుహు గల్లీలో ఉంది ఈ లేటెస్ట్ పబ్లిక్ టాయిలెట్. 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 60 టాయిలెట్లు, మొదటి ఫ్లోర్లో 28 ఉన్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్మించిన వాటిలో ఇదే అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం. ముంబై స్లమ్‌లో ఉండే 60వేల మంది కోసం ఈ అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్‌ను బీఎంసీ నిర్మించింది. ప్రతీ కుటుంబం నెలకు రూ.60లు చెల్లించి ఈ టాయిలెట్లను వినియోగించుకోవచ్చు. అలాగే ఈ కాంప్లెక్స్ దగ్గరే మొక్కలతో ఓ చిన్న బొటానికల్ గార్డెన్ కూడా ఉంది.
“ఇది నగరంలోనే అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్ మాత్రమే కాదు.. నిరంతరం సమర్థంగా క్లీనింగ్ చేసే వ్యవస్థ కూడా ఉంది. గ్రౌండ్‌ఫ్లోర్ మహిళలకు, పై ఫోర్ల్ పురుషులకు కేటాయించాం. శారీరక వైకల్యం ఉన్న వారి కోసం నాలుగు బ్లాక్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం” అని కార్పొరేటర్ మెహెర్ మొహ్సిన్ హైదర్ తెలిపారు. ముంబై రీజనల్ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్సీసీ) అధ్యక్షుడు భాయ్ జగ్తప్ ఈ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
“స్లమ్ శానిటేషన్ కార్యక్రమం (ఎస్ఎస్పీ) కింద రూ.1.5కోట్ల నిధులతో దీన్ని నిర్మించాం. వీటికి ఎలాంటి ఫీజు లేదు. అయితే వీటిని వాడుకునే ప్రతీ కుటుంబం నెలకు రూ.60ల కనీస రుసుము చెల్లించాలి. ఈ మొత్తం ఇస్తే కుటుంబం మొత్తానికి పాస్ ఇస్తాం. శుభ్రత కోసం కమ్యూనిటీ బెస్డ్ ఆర్గనైజేషన్‌ను నియమిస్తాం. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. ప్రతీ నెలా నిర్వహణ, ఆడిటింగ్‌ను నిర్వహిస్తాం” అని కార్పొరేటర్ హైదర్ చెప్పారు.
2018లో 55 టాయిలెట్లతో అతిపెద్ద కాంప్లెక్స్‌ను గిల్బెర్ట్ హిల్ వద్ద ఏర్పాటైంది. ఇప్పుడు మరికొన్ని ఎక్కువ టాయిలెట్లతో జుహు గల్లీలో కట్టారు. అధునాతన సౌకర్యాలు కల్పించారు. అలాగే 80 మల్టీ యుటిలిటీ కండీషన్డ్ మొబైల్ టాయ్‌లెట్ వ్యాన్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని బృహన్ ముంబై కార్పొరేషన్ ఆలోచిస్తున్నది. ముఖ్యంగా ట్రాఫిక్ అధికంగా ఉండే కూడళ్ల వద్ద, జనం ఎక్కువ ఉండే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అయితే కరోనా వైరస్ రావడంతో ఆ ప్రణాళికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.