Home /News /national /

WHY SOME PEOPLE NEVER GET INFECTED WITH COVID 19 UMG GH

Covid-19: కొంతమందికి కరోనా వైరస్ ఎందుకు సోకట్లేదు..? సైంటిస్ట్‌లు చెప్పిన షాకింగ్ విషయాలు ఇవే..!

కరోనా వైరస్

కరోనా వైరస్

అయితే కరోనా తీవ్రంగా విజృంభించిన సమయంలోనే ఈ వైరస్ బారిన పడని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇందుకు కొన్ని లక్షణాలు, జన్యు వైవిధ్యాలు కారణం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఒక అధ్యయనం సైతం నిర్వహిస్తున్నారు.

కరోనా మహమ్మారి తొలిసారిగా చైనాలో వెలుగుచూసింది. ఆ తరువాత ప్రపంచ‌వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకింది. మిలియన్ల కొద్ది ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. మరణాలు కూడా భారీగా సంభవించాయి. తల్లిదండ్రులను, ఆప్తులను పొగొట్టుకొని చాలా మంది పిల్లలు అనాథలుగా మిగిలారు. అయితే కరోనా తీవ్రంగా విజృంభించిన సమయంలోనే ఈ వైరస్ బారిన పడని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇందుకు కొన్ని లక్షణాలు, జన్యు వైవిధ్యాలు కారణం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఒక అధ్యయనం సైతం నిర్వహిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఓ పరిశోధన నివేదిక ఈ ఏడాది మేలో వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైంది. అధ్యయనంలో భాగంగా ఇప్పటివరకు కరోనా బారిన పడని వ్యక్తుల బాడీ సెల్స్‌ను నిపుణులు పరిశీలించారు. అంచనాలకు అందని కరోనా వైరస్ చాలా మంది ఆరోగ్య నిపుణులను ఆశ్చర్యపరిచింది. ఒకపక్క ప్రాణాంతక ఓమిక్రాన్ వేరియంట్ వల్ల పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, చాలా మందికి ఈ వైరస్ సోకలేదు. అందుకు గల కారణాలను విశ్లేషించే పనిలోపడ్డారు నిపుణులు.

వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన రిపోర్ట్ ప్రకారం.. వైరస్ సోకిన తరువాత కోలుకున్న వారి కంటే వైరస్ సోకనివారు వ్యాధి గురించి ఎక్కువ ఇన్‌సైట్స్ అందించారు. కరోనా వైరస్ సంక్రమణను నిరోధించే జన్యు మూలకాన్ని కనుగొనడానికి చేపట్టిన ఈ అంతర్జాతీయ అధ్యయనం ప్రస్తుతం పురోగతిలో ఉందని ఆ రిపోర్ట్ పేర్కొంది.

న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీకి చెందిన క్లినికల్ మైక్రోబయాలజిస్ట్ ఆండ్రాస్ స్పాన్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఈ స్టడీలో మరో 700 మంది శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న 5,000 మందికి పైగా వ్యక్తులను స్క్రీనింగ్ చేశారు. ఇన్ఫెక్షన్, యాంటీబాడీస్ కోసం వీరికి అనేకసార్లు కూడా టెస్ట్‌లు చేసినట్లు నివేదిక పేర్కొంది.

బెవిన్ స్ట్రిక్‌ల్యాండ్ అనే నర్సు అనస్థిషన్‌గా పనిచేస్తున్నారు. ఆమె స్టడీ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కోవిడ్-19 రోగులతో కలిసి పనిచేసినప్పటికీ ఆమెకు ఇన్‌ఫెక్షన్ సోకలేదు. ఆమె పనిచేసే ఆసుపత్రిలో అన్ని సమయాల్లో మాస్క్‌ను తీసివేసింది. మాస్క్ ధరించకపోయినా ఆమెకు ఇన్ఫెక్షన్ సోకలేదు. ఆమె చెప్పిన విషయాలు ఈ అధ్యయనానికి స్వచ్ఛందంగా ఉపయోగపడ్డాయి.

బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ జెన్నిఫర్ నజ్జో, వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. కరోనా వైరస్ సోకని వ్యక్తుల జన్యువులు, ఇతర జీవ లక్షణాలను అధ్యయనం చేయడం వల్ల, వైరస్ ఎలా అభివృద్ధి చెందుతుంది లేదా మానవ శరీరానికి ఎలా సోకుతుంది అనే దానిపై తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

HIV, క్షయ, ఫ్లూ వంటి సంక్రమిత వ్యాధులను మనుషుల్లోని కొన్ని జన్యువులు నిరోధిస్తాయని.. జన్యువులకు, ప్రజల రోగనిరోధక శక్తి మధ్య సంబంధం ఉందని గత అధ్యయనాల్లో తేలింది. తాజాగా కోవిడ్ -19 కోసం అటువంటి జన్యు మూలకం ఉనికిలో ఉందో లేదో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పరిశోధనను చేపట్టారు శాస్త్రవేత్తలు.
Published by:Mahesh
First published:

Tags: Corona, Corona virus, Covid, HIV

తదుపరి వార్తలు