2014లో రూ.108 కోట్ల ఆస్తి... ఇప్పుడున్నది రూ.2 కోట్లే... సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ ఆస్తులెందుకు కరిగిపోయాయి?

Lok Sabha Elections 2019 : రాజకీయ నేతల ఆస్తులు పెరగకపోతే వింత. తగ్గిపోతే మరింత ఆశ్చర్యమే. పూనం మహాజన్ విషయంలో ఏం జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: April 6, 2019, 7:45 AM IST
2014లో రూ.108 కోట్ల ఆస్తి... ఇప్పుడున్నది రూ.2 కోట్లే... సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ ఆస్తులెందుకు కరిగిపోయాయి?
పూనం మహాజన్
  • Share this:
బీజేపీ ఎంపీ పూనం మహాజన్... తన నామినేషన్ పత్రాలతో ఇచ్చిన అఫిడవిట్‌ ఎన్నికల అధికారులను ఆశ్చర్యపరిచింది. ఐదేళ్లలో ఆమెకు సంబంధించి రూ.106 కోట్ల ఆస్తులు కరిగిపోయాయట. ముంబై నార్త్ సెంట్రల్ సీట్‌కి పోటీ చేస్తున్న ఆమె... సబర్బన్ కలెక్టర్ ఆఫీస్‌లో తన నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. 2014లో ఆమె ఇచ్చిన నామినేషన్ పత్రాల్ని పరిశీలిస్తే... ఆమెకూ, ఆమె భర్తకూ కలిపి రూ.108 కోట్ల ఆస్తులున్నాయి. తాజాగా ఆమె ఇచ్చిన అఫిడవిట్‌ను చూస్తే... అందులో ఆస్తులు రూ.2.21 కోట్లే ఉన్నట్లు రాశారు. నగదు, బాండ్లు, డిపాజిట్లు, సేవింగ్స్ అన్నీ కలిపి చెప్పిన లెక్క ఇది. పూనం కొడుకు ఆద్యాకి రూ.1.4 లక్షలుండగా... కూతురు అవికాకు ఎలాంటి ఆస్తులూ లేవు.

పూనం మహాజన్‌ అఫిడవిట్ ప్రకారం ఆమెకు ఎలాంటి వ్యవసాయ భూమీ లేదు. వ్యవసాయేతర భూమీ, వాణిజ్య భవనాలు, ఇల్లు ఏవీ లేవు. 2014లో స్థిరాస్థుల్ని చూస్తే... ఆమె భర్తకు వర్లీలో ఓ ఫ్లాట్ ఉండేది. అప్పట్లో దాని విలువ రూ.4.5 కోట్లు. అదే వర్లీలో దంపతులిద్దరికీ కలిపి... మరో ఫ్లాట్ ఉండేది. దాని విలువ రూ.22.5 కోట్లు. అంతేకాదు అప్పట్లో ఆమె భర్తకు వ్యవసాయ భూమి ఉంది. వర్లీలో మరో ఫ్లాట్ కూడా ఉంది.

ఆస్తులెందుకు తరిగిపోయాయి : పూనం 2014లో రూ.108 కోట్ల ఆస్తులున్నట్లు చెప్పగా... అప్పట్లో అప్పులు రూ.41.4 కోట్లుగా చూపించారు. ఆమె భర్త ఆటోమొబైల్ డీలర్‌షిప్ నడుపుతున్నారు. ఆ బిజినెస్ కుప్పకూలిందంటున్నారు పూనం. అప్పులు చెల్లించడం కోసం తాము ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటున్నారు పూనం. చివరకు తన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం మాత్రమే మిగిలిందంటున్నారు.

ప్రస్తుతం ఈ సిట్టింగ్ ఎంపీకి కాంగ్రెస్ నుంచీ ప్రియాదత్ గట్టి పోటీ ఇస్తున్నారు. తాను సిన్సియర్ సిటిజన్ అంటున్న పూనం... అందుకే అప్పులన్నీ చెల్లించామని చెబుతున్నారు. ఓ ఎంపీగా ఉంటూ కూడా... తన వ్యక్తిగత అవసరాలకు ఎంపీ పదవిని వాడుకోలేదని ఆమె అంటున్నారు. మరి ప్రజలెలా స్పందిస్తారో, ఆమెపై జాలిపడతారో, ఆ అఫిడవిట్‌ను అబద్ధమంటారో ఎన్నికల ఫలితాలొచ్చాకే తెలుస్తుంది.

 

ఇవి కూడా చదవండి :

ఎన్నికల సభలకు వస్తున్న ప్రజల్లో నాలుగు రకాలు... మీరు ఏ టైపో తెలుసుకోండి...వైసీపీ మద్యపాన నిషేధం హామీ టీడీపీకి కలిసొస్తుందా... మద్యాన్ని నిషేధిస్తామనడం ప్రజలకు నచ్చట్లేదా...

రేపటి నుంచీ ఐదు రోజులు టీడీపీ నిరసన కార్యక్రమాలు... ఎన్నికలు జరిగే రోజున కూడా...
First published: April 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading