సార్వత్రిక ఎన్నికలు ఆరో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, వారి కుమారుడు రెహాన్ వాద్రా (19) మాత్రం ఓటు వేయలేదు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన కుమారుడు ఎన్నికల్లో ఓటు వేయకపోవడంతో చాలా మందిలో సందేహం వచ్చింది. అయితే, ఆ ప్రశ్నలకు ప్రియాంకా గాంధీ వాద్రా సమాధానం ఇచ్చారు. పరీక్షల కోసం లండన్ వెళ్లడం వల్లే రేహాన్ వాద్రా ఓటు వేయలేకపోయినట్టు తెలిపారు. రేహాన్ వాద్రా అప్పుడప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా కనిపిస్తూ ఉంటాడు. తన సోదరి మిరయాతో కలసి మామయ్య ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటాడు. ఇటీవల రాహుల్ గాంధీ తిరుమల వచ్చిన సందర్భంగా రేహాన్ కూడా ఆయనతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. తన తల్లి ప్రియాంకా గాంధీ యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో కూడా పలుమార్లు ఆమె వెంట ఉన్నాడు. రేహాన్ వాద్రా ఆరో తరగతి వరకు టెన్ జెన్ పథ్లోనే ఇంటి వద్ద చదువుకున్నాడు. ఆ తర్వాత డెహ్రాడూన్లోని డూన్ స్కూల్లో చదువుకున్నాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.