HOME »NEWS »NATIONAL »why rahul gandhi choose wayanad to contest will he stay there if he wins nk

వాయనాడ్‌లో వేడెక్కిన రాజకీయాలు... రాహుల్ గాంధీ అక్కడ గెలుస్తారా? ఏంటి దాని ప్రత్యేకతలు...

వాయనాడ్‌లో వేడెక్కిన రాజకీయాలు... రాహుల్ గాంధీ అక్కడ గెలుస్తారా? ఏంటి దాని ప్రత్యేకతలు...
రాహుల్ గాంధీ

Lok Sabha Elections 2019 : రాహుల్ అది సేఫ్ ప్లేస్ అనుకుంటుంటే, తడాఖా చూపిస్తామని ప్రత్యర్థులు అప్పుడే స్వరం పెంచారు.

  • Share this:
    మనం అందరం ఊహించుకుంటున్నదీ, చర్చించుకుంటున్నదీ నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. యూపీలోని అమేథీతోపాటూ... కేరళ లోని వాయనాడ్ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ ఈసారి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. అసలు రాహుల్ రెండుచోట్ల పోటీ చెయ్యాల్సిన అవసరం ఏముందన్నది మొదటి ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం ఆ అవకాశం ఉన్నా... రాహుల్ బదులు... రెండో స్థానంలో మరో అభ్యర్థిని నిలబెడితే... ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినట్లవుతుందన్నది విశ్లేషకుల మాట. ప్రధాని నరేంద్ర మోదీ లాగే... రాహుల్ కూడా రెండు చోట్ల పోటీ చెయ్యాలనుకోవడం ఎంతవరకూ సమంజసమన్న వాదనపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

    m-3 evms,m 3 evms,mega evem,rahul gandhi,kcr,ktr,trs,pawan kalyan,rahul gandhi,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,ap elections 2019,ap politics,ap assembly elections 2019,ap elections,ap news,ap assembly elections,ap assembly election,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly election schedule 2019,assembly elections,assembly elections 2019,2019 assembly elections,elections,assembly election 2019,andhra pradesh assembly elections 2019,elections 2019,ap assembly counting updates,ap assembly seats,రాహుల్ గాంధీ,రాహుల్,ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,నరేంద్రమోదీ,చంద్రబాబు,జగన్,పవన్ కల్యాణ్,కేసీఆర్,కేటీఆర్,కేసీఆర్,కేటీఆర్,టీఆర్ఎస్,ఈవీఎంలు,నిజామాబాద్,ఎం 3 ఈవీఎంలు,మెగా ఈవీఎంలు,
    వాయనాడ్ (Image : Google Maps)




    రాహుల్ అమేథీలో ఈసారి ఓడిపోతారనీ, అక్కడ రెండోసారి బరిలో దిగిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈసారి కచ్చితంగా గెలుస్తారనీ, అందుకే రాహుల్ ఆల్టర్నేట్‌గా వాయనాడ్‌ను ఎంచుకున్నారని ప్రత్యర్థి పార్టీలు ఉతికారేస్తున్నాయి. అఫ్‌కోర్స్ కాంగ్రెస్ నేతలు ఆ విమర్శలు అంతే ఫోర్స్‌తో తిప్పికొడుతున్నారు కూడా. మోదీ... గుజరాత్‌ వదిలి వారణాసిలో కూడా ఎందుకు పోటీ చేశారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

    m-3 evms,m 3 evms,mega evem,rahul gandhi,kcr,ktr,trs,pawan kalyan,rahul gandhi,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,ap elections 2019,ap politics,ap assembly elections 2019,ap elections,ap news,ap assembly elections,ap assembly election,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly election schedule 2019,assembly elections,assembly elections 2019,2019 assembly elections,elections,assembly election 2019,andhra pradesh assembly elections 2019,elections 2019,ap assembly counting updates,ap assembly seats,రాహుల్ గాంధీ,రాహుల్,ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,నరేంద్రమోదీ,చంద్రబాబు,జగన్,పవన్ కల్యాణ్,కేసీఆర్,కేటీఆర్,కేసీఆర్,కేటీఆర్,టీఆర్ఎస్,ఈవీఎంలు,నిజామాబాద్,ఎం 3 ఈవీఎంలు,మెగా ఈవీఎంలు,
    వాయనాడ్ (Image : Google Maps)


    వాయనాడ్ ప్రత్యేకతలు ఇవీ :
    * 2008లో నియోజక వర్గాల పునర్విభజనలో ఏర్పడింది.
    * 30 శాతం అడవే. జనాభా తక్కువే
    * హిందువుల మొత్తం జనాభా 49.7 శాతం. ఎస్సీలు 35.4 శాతం, ఎస్టీలు 7.6 శాతం.
    * క్రిస్టియన్లు 21.5 శాతం, ముస్లిం మైనార్టీలు 28.8 శాతం.
    * 7 అసెంబ్లీ సెగ్మెంట్లు 3 జిల్లాల్లో - వాయనాడ్, కోజికోడ్, మళప్పురంలో ఉన్నాయి.
    * 2009, 2014లో కాంగ్రెస్ నుంచీ ఎంఐ షానవాజ్ గెలిచారు. 2009లో 1.53 లక్షల ఓట్ల తేడాతో.... 2014లో 20,000 మెజార్టీతో గెలుపొందారు.
    * మావోయిస్టుల ప్రభావం ఎక్కువ. గిరిజన గ్రామాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది.
    * రాజకీయంగా ప్రస్తుతం వాయనాడ్ కాంగ్రెస్‌కి కంచుకోట అనుకోవచ్చు.
    * వాయనాడ్‌లోని ఏడు లోక్ సభ నియోజక వర్గాల్లో... 4 చోట్ల ముస్లింల ఆధిపత్యం ఉంది. వాళ్లు కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నారు.
    * ఇక్కడి ఓటర్లలో ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కూలీలు, ప్లాంటేషన్ శ్రామికులే. కాంగ్రెస్ పథకాలపై వాళ్లు పాజిటివ్‌గా ఉన్నారు.
    * మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతో రాహుల్ ఈజీగా గెలిచేస్తారన్నది కాంగ్రెస్ విశ్లేషణ.

    రాహుల్‌ని ఓడిస్తామంటున్న లెఫ్ట్ : రాహుల్ ప్రకటనపై మనందరికంటే ఎక్కువగా రియాక్టైనది ఎవరో కాదు కేరళలోని వామపక్షాలు. రాహుల్‌ని కచ్చితంగా ఓడిస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ ప్రకాష్ కారత్ ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలను దెబ్బ తీసేందుకే రాహుల్‌ను బరిలో దింపారని ఆయన ఫైర్ అయ్యారు. ఆ మాత్రం కోపం ఉండటం సమంజసమే.

    రాహుల్ నిర్ణయంపై వాయనాడ్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే... అమేథీలో కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రాహుల్ తమకు దూరమైపోయినట్లు ఫీలవుతున్నారు. ఆయన్ని కాపాడుకుంటామని సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతున్నారు. ఒకవేళ... రాహుల్ రెండు స్థానాల్లోనూ గెలిస్తే... కచ్చితంగా వాయనాడ్‌ను వదిలేసే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే... ఆ స్థానంలో మరో కాంగ్రెస్ నేతను నిలబెట్టి... తిరిగి గెలిపించుకునే ఛాన్స్ ఉంటుంది.



    ఇవి కూడా చదవండి :

    April 1st : ఏప్రిల్ 1న ఫూల్స్ డే అనడానికి కారణం ఇదే..

    నిజామాబాద్‌లో M-3 EVMలతో పోలింగ్... ఏంటి ఎం-3 ప్రత్యేకత... మామూలు ఈవీఎంలకూ వాటికీ తేడా ఉందా?

    నిజామాబాద్‌లో బ్యాలెట్ కాదు.. ఈవీఎంలతోనే పోలింగ్

    Pics : రాకెట్ల ప్రయోగాన్ని కళ్లారా చూసే ఛాన్స్... ఇస్రో కల్పిస్తున్న అద్భుత అవకాశం

    Published by:Krishna Kumar N
    First published:April 01, 2019, 07:50 IST

    टॉप स्टोरीज