హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Popcorn In Multiflex : మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం ఇదే!

Popcorn In Multiflex : మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Why Popcorn Is Expensive In Multiplex  : ప్రజలు... తమ కుటుంబ సభ్యులతో సినిమా థియేటర్(Movie Theatre) లో కూర్చొని సినిమా చూడటానికి ఇష్టపడతారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమా టిక్కెట్లు, స్నాక్స్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ముఖ్యంగా వారాంతంలో ఇది ఖరీదైన వ్యవహారంగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Why Popcorn Is Expensive In Multiplex  : ప్రజలు... తమ కుటుంబ సభ్యులతో సినిమా థియేటర్(Movie Theatre) లో కూర్చొని సినిమా చూడటానికి ఇష్టపడతారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమా టిక్కెట్లు, స్నాక్స్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ముఖ్యంగా వారాంతంలో ఇది ఖరీదైన వ్యవహారంగా మారింది. మరీ ముఖ్యంగా మ‌ల్టీప్లెక్స్(Multiflex) ల‌కి వెళ్లి సినిమాలు చూడడం అనేది ఎంత ఖ‌ర్చుతో కూడుకున్న వ్యవహారమైంది. ఒక వ్య‌క్తి మాల్ కి వెళ్లి హాయిగా పాప్ కార్న్(Popcorn) తింటూ సినిమా చూసి బ‌య‌టికి వ‌చ్చాక కానీ అస‌లు విష‌యం తెలియ‌దు. టికెట్ రేట్ కి 2-3 రెట్లు అధికంగా పాప్ కార్న్ తిన‌డానికే ఖ‌ర్చు చేయాల్సివస్తోంది మరి.

దాదాపు ప్రతి సినీ ప్రేక్షకుడు ఆనందించే ప్రసిద్ధ చిరుతిళ్లలో ఒకటి పాప్‌కార్న్. అయితే ప్రతి కొన్ని వారాలకు దీని ధర పెరుగుతుండడంతో అది కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోంది. బయ‌ట రూ.10-20 కి దొరికే పాప్ కార్న్ మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ.200-500 వ‌ర‌కు ఉంటుంది. ఇది పలు విమర్శలను దారితీసింది.

ఈ నేపథ్యంలో PVR ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ ఈ సమస్య గురించి మాట్లాడారు, సినిమా థియేటర్లలో స్నాక్స్‌ల అధిక ధరలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు వినియోగదారులను నిందించలేమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అజయ్ అంగీకరించారు. ప్రేక్ష‌కుల‌కు మాల్స్ అనుభూతిని ఇవ్వ‌డం, ర‌వాణా ఖ‌ర్చులు, థియేట‌ర్ల‌లో ఎయిర్ కండిష‌నింగ్‌, నిర్వ‌హ‌ణ‌ ఖ‌ర్చులు, ఉద్యోగుల జీతాలు, మాల్ స్థ‌లానికి అద్దెలు త‌దిత‌ర అంశాల‌పై పాప్ కార్న్ సహా మిగిలిన ఆహార పదార్థాలు,పానీయాల ధర ఆధారపడి ఉంటుందన్నారు. ఈ ధ‌ర‌ని పాప్ కార్న్ అస‌లు విలువ‌తో పోల్చ‌డం స‌రికాద‌ని అన్నారు. ప్రేక్ష‌కుల‌కి బిగ్ స్క్రీన్ పై తాము అందించే అనుభూతిని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని అన్నారు. భారతదేశం ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల నుండి మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌కి మారుతుంద‌ని, ప్రేక్ష‌కులు కూడా నెమ్మ‌దిగా ఈ క‌ల్చ‌ర్ కి అల‌వాటు ప‌డుతున్నార‌న్నారు. పెద్ద తెర‌ల‌పై సినిమా చూడాలంటే ఈ ధ‌ర‌ని భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని చెప్పారు. మల్టీప్లెక్స్ లలో ఆహారం- పానీయాల (Food&Beverages)ధరలలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పారు. నిర్వహణ ఖర్చుల కోసం మల్టీప్లెక్స్‌లోని స్నాక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తామని ఆయన చెప్పారు.

Harmful Fruits for Diabetic : డయాబెటిక్ పేషెంట్స్ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ప్రమాదం!

కాగా,ప్రముఖ చలనచిత్ర ప్రదర్శన సంస్థలైన పీవీఆర్‌ లిమిటెడ్‌- ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ విలీనం కాబోతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో దేశంలోని రెండు ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన్‌లు PVR-INOX తమ విలీనాన్ని ప్రకటించాయి. మల్టీప్లెక్స్‌ వరకు చూస్తే పీవీఆర్‌-ఐనాక్స్‌, సినీ పొలిస్‌లు కలిసి బాక్సాఫీసు ఆదాయంలో 50 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. విలీనం అనంతరం భారత మల్టీప్లెక్స్‌ వ్యవస్థలో ఈ సంస్థ ఆధిపత్యం కొనసాగనుంది. విలీనం పూర్తైన తర్వాత ఉమ్మడి సంస్థకు పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌గా నామకరణం చేయనున్నారు. తద్వారా 1,500కు పైగా స్క్రీన్లతో దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్‌ చైన్‌గా ఆవిర్భవిస్తుంది. విలీనానంతర సంస్థకు..ప్రస్తుత పీవీఆర్‌ సీఎండీ అజయ్‌ బిజ్లీ ఎండీగా, ప్రస్తుత ఐనాక్స్ గ్రూప్ చైర్మన్ సంజీవ్‌ కుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా వ్యవహరించనున్నారు.

కొత్తగా ఏర్పడనున్న సంస్థలో పీవీఆర్‌ ప్రమోటర్లకు 10.62 శాతం, ఐనాక్స్‌ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభిస్తుంది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీవీఆర్‌కు 73 పట్టణాల్లోని 181 ప్రాంతాల్లో 871 స్క్రీన్లు ఉన్నాయి. ఐనాక్స్‌ కు 72 పట్టణాల్లో 675 స్క్రీన్లు ఉన్నాయి.

First published:

Tags: Multiplex