పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతోంది. మార్చి 24 నుంచి రంజాన్ నెల ప్రారంభం అయ్యింది. ముస్లీంలు పాటించే ఉపవాసాన్ని ‘రోజా’ అంటారు. ఈ నెలలో, ముస్లిం ప్రజలు ఉదయం సెహ్రీ సమయంలో ఆహారం తీసుకున్న తర్వాత రోజంతా ఆకలితో, దాహంతో ఉంటారు. దీని తరువాత, సాయంత్రం ఉపవాసం విరమిస్తారు. ఉపవాసం విరమించే సమయంలో ముస్లీం సోదరులు కొన్ని ఆచారాలు కూడా పాటిస్తారు. ఖర్జూరం తినడం ద్వారా మాత్రమే ఉపవాసం విరమిస్తారు. ఆ తర్వాత ఇతర ఏ పదార్థాలైన తింటారు. ఖర్జూరం తిన్న తర్వాతే ఎందుకు రోజా విరమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాస సమయంలో ఏదైనా తినడం లేదా త్రాగడం నిషేధించబడింది. సాయంత్రం ఉపవాసం విరమించేటప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఈ కారణంగా, ఉపవాసం విరమించేటప్పుడు ఖర్జూరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఖర్జూరం శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేస్తుంది. దీనితో పాటు, ఖర్జూరం తినడం వల్ల శరీరానికి చాలా శక్తి లభిస్తుంది, ఇది రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది.
రంజాన్‌లో ఖర్జూరం తిని ఉపవాస దీక్ష విరమిస్తారు.. ఇది ఇస్లాంలో సున్నత్‌గా పరిగణిస్తారని AMU మాజీ థియాలజీ ప్రెసిడెంట్ ముఫ్తీ జాహిద్ అలీ చెప్పారు. ఖర్జూరం హజ్రత్ మొహమ్మద్ ప్రవక్తకు ఇష్టమైన పండు. ఆయన ఖర్జూరం తిని ఉపవాసం విరమించేవాడు. అందుకే నేటికీ ముస్లీం సోదరులంతా .. ఖర్జూరం తిని ఉపవాసం విరమిస్తారు.
రోజంతా ఉపవాసం చేయడం వల్ల శక్తి స్థాయి తగ్గుతుందని అలీఘర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిని నడుపుతున్న డాక్టర్ మదానీ చెప్పారు. అటువంటి పరిస్థితిలో, ఉపవాసం విరమించిన వెంటనే ఖర్జూరం తినడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ఖర్జూరం ఇఫ్తార్ సమయంలో తిన్న ఇతర పదార్థాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.ఖర్జూరం తినడం ద్వారానే శరీరానికి ఒక రోజుకు అవసరమైన పీచుపదార్థాలు లభిస్తాయి. ఫైబర్స్ మాత్రమే కాదు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఖర్జూరంలో అవసరమైన పోషకాలు ఉన్నందున, ప్రజలు రంజాన్‌లో ఖర్జూరాలను తినడం ద్వారా ఉపవాసాన్ని విరమిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dates, Hyderabad, Ramzan, Ramzan 2023