Home /News /national /

WHY IS KANYAKUMARIS MANDAIKADU BHAGAVATHI AMMAN TEMPLE CALLED WOMENS SABARIMALA HERES THE HISTORY GH VB

Women’s Shabarimala: ఈ టెంపుల్ మహిళల శబరిమల.. ఆడవాళ్లు ఇరుముడితో వెళ్లే ఈ ఆలయం ప్రత్యేకతలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడులో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఘనమైన ప్రాశస్త్యమున్న ఈ ఆలయాలు చారిత్రక ప్రత్యేకతలనూ కలిగిఉన్నాయి. ఆ కోవలోకే చెందుతుంది మండైకాడు భగవతి అమ్మాన్ దేవాలయం.

తమిళనాడు(Tamilanadu)లో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఘనమైన ప్రాశస్త్యమున్న ఈ ఆలయాలు చారిత్రక ప్రత్యేకతలనూ కలిగిఉన్నాయి. ఆ కోవలోకే చెందుతుంది మండైకాడు భగవతి అమ్మాన్ దేవాలయం(Amman Temple). కన్యాకుమారి(Kanyakumari) జిల్లా కొలచెల్ సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని 'మహిళల శబరిమల'గా(Women’s Shabarimala) చెబుతుంటారు. ఇక్కడి అమ్మవారు గర్భగుడిలో కాకుండా గుహలో దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఆలయ ప్రత్యేకతలివే.. మాలాధారణ చేసిన మహిళలు 'ఇరుముడి'ని తలపై పెట్టుకుని మండైకాడు(Mandaikadu Temple) భగవతి అమ్మాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ః

పురుష అయ్యప్ప(Ayyappa Devotees) భక్తులు 41 రోజులు ఉపవాసం ఉండి శబరిమల యాత్ర చేపట్టినట్లే.. మహిళలు సైతం ఫిబ్రవరిలో జరిగే మాస పండుగ సందర్భంగా 41 రోజుల ఉపవాసం అనంతరం మండైకాడు భగవతి అమ్మాన్ ఆలయాన్ని దర్శిస్తారు. అందుకే దీనికి 'మహిళల శబరిమల' అని పేరు వచ్చింది. ఇక ఈ ఆలయం నిర్మాణం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని పోలి ఉండటం విశేషం.

Buy Now-Pay Later: Buy now pay later ఆప్షన్‌తో కొనుగోళ్లు చేస్తున్నారా..? అయితే వీటిపై దృష్టి పెట్టాల్సిందే..


మండైకాడు చరిత్ర..
వందల సంవత్సరాల క్రితం కన్యాకుమారి జిల్లాలోని 'మండైకాడు' దట్టమైన(Mandaikadu Forest) అటవీప్రాంతంగా ఉండేది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పశువులను మేపేవారు. గొర్రెలు, ఆవుల మందలు చాలా ఉండటంతో 'మంటైకాడు' అని.. కాలక్రమంలో 'మండాయికాడు', మండైకాడుగా స్థిరపడిపోయిందని స్థానికంగా ప్రతీతి.

అప్పట్లో సమీప గ్రామాల్లో కలరా, మశూచి ప్రబలాయి. సరైన వైద్య సదుపాయాలు లేక మహమ్మారులు నయమయ్యేవి కావు. దీనితో గ్రామస్థులు మండైకాడును ఖాళీ చేయడం ప్రారంభించారు. ఇది గమనించిన ఆదిశంకరుని శిష్యుడు చేతిలో 'చక్రం'తో ఆ గ్రామాన్ని సందర్శించాడు. మొత్తం 63 కోణాలతో ఓ చక్రాన్ని గీసి.. ప్రతిరోజూ ప్రార్థన చేయసాగాడు. తనకు లభించిన దైవశక్తి ద్వారా ప్రజల వ్యాధులను నయం చేశాడు. దీనితో తమకు సహాయం చేసేందుకు 'సాధు' రూపంలో వచ్చిన శిష్యుడిని ఆరాధించసాగారు. చాలా కాలం పాటు అక్కడే ఉన్న ఈ సాధువు ప్రజల రోగాలను నయం చేస్తుండేవాడు.

ఈ క్రమంలో సాధువు తనతో పాటు తీసుకొచ్చిన శ్రీ చక్రం ఉంచిన స్థలం చుట్టూ పూజలు చేస్తుండటంతో అది భూమి లోపలికి చొచ్చుకుపోయి క్రమంగా దాని చుట్టూ ఒక బొరియ ఏర్పడింది. అదే బొరియలో ఆ సాధువు 'జీవ సమాధి' అయినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మార్తాండవర్మ అనే రాజు ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాడు. దీనినే మండైకాడు భగవతి అమ్మాన్ ఆలయ చరిత్రగా చెబుతుంటారు. ఇక్కడ అందించే 'మండయప్పం' చాలా ప్రసిద్ధి చెందింది.

HQ-17 Missile: ఆర్మీ ఆధునీకరణలో చైనా దూకుడు.. మిలిటరీ వ్యవస్థలోకి సరికొత్త మిస్సైల్.. అది ఎలా పనిచేస్తుందంటే..


మహిళల ఇరుముడి ఎందుకు..?
మండైకాడు భగవతి అమ్మన్ ఆలయానికి కేరళకు చెందిన మహిళా భక్తులు 'ఇరుముడి'ని(Irumudi kettu) నెత్తిన పెట్టుకుని పాదయాత్ర చేసి వస్తారు. దీని వెనుక ఓ చారిత్రక నేపథ్యం ప్రచారంలో ఉంది. శతాబ్దాల క్రితం కేరళకు చెందిన ఓ వ్యక్తి మండైకాడు అడవిలో నుంచి వెళుతున్నాడు. విపరీతమైన ఆకలి బాధతో ఉన్న ఆ వ్యాపారికి భగవతి అమ్మాన్ దేవత వృద్ధురాలి రూపంలో వచ్చి ఆకలి తీర్చిందని చెబుతారు. ఆకలిని తీర్చేందుకు వృద్ధురాలి రూపంలో వచ్చింది భగవతీ దేవి అని తెలుసుకున్న ఆ వ్యక్తి తన వ్యాపారంలో వచ్చిన డబ్బులో కొంత భాగం ముడుపు కట్టి ఆలయానికి విరాళంగా ఇచ్చాడు.

అనంతరం మండైకాడు అడవిలో జరిగిన అద్భుతాన్ని కేరళ కొల్లాంలోని తన స్వగ్రామంలో ప్రచారం చేశాడు. దీనితో తమ శ్రేయోభిలాషిని ఆకలి బాధ నుంచి విముక్తి చేసిన భగవతి అమ్మాన్‌కు పొంగల్​ వండి 'ఇరుముడి'తో మండైకాడుకు రావడం ప్రారంభించారు. దీనిని ఆకలితో ఉన్నవారికి వడ్డిస్తుంటారు. ఈ ప్రాంతంలోని వారందరినీ రక్షించేందుకు భగవతి అమ్మాన్ దేవి ఓ బొరియలో/గుహలో వెలిసిందని.. వారిని రక్షిస్తూ భక్తులకు దర్శనమిస్తోందని చెబుతారు. ఇ

ప్పటికీ 15 అడుగుల ఎత్తైన ఎర్రచందనం స్థూపంపై భగవతీ దేవి ముఖంతో పాటు.. చరిత్రను తెలిపే శాసనాలు ఉన్నాయి. శబరిమల అయ్యప్ప, మండైకాడు భగవతి అమ్మాన్ ఆలయాలను కుల, మతాలకు అతీతంగా భక్తులు సందర్శిస్తారు. శబరిమలలో నిర్ణీత వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు ప్రవేశం లేదు కాబట్టి, ఎక్కువ మంది మహిళలు ఉపవాసం తర్వాత మండైకాడు భగవతి అమ్మన్ ఆలయానికి 'ఇరుముడి కెట్టు'తో పవిత్ర యాత్రకు వెళుతున్నారు, ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఆచారం కొనసాగుతోంది.
Published by:Veera Babu
First published:

Tags: Trending, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు