మనం తినే ఆహారాన్ని బట్టీ... మన జీర్ణాశయంలో కొన్ని రకాల ద్రవాలు, యాసిడ్లూ రిలీజ్ అవుతాయి. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అయ్యేదా, లేక ఎక్కువ సమయం పట్టేదా అన్నదాన్ని బట్టీ అందుకు తగిన ఆమ్లాలు జీర్ణాశయంలో విడుదల అవుతాయి. ఐతే చాలా సందర్భాల్లో మనం రకరకాల ఆహార పదార్థాల్ని మిక్స్ చేసి తింటాం. అన్నం, కూర కలిపి తింటాం. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి యాసిడ్లు రిలీజ్ చెయ్యాలన్నదానిపై జీర్ణాశయంలో కొంత సందిగ్ధత ఉంటుంది. ఐతే, కాంబినేషన్‌తో తినే ఆహార పదార్థాలూ... అన్నీ దాదాపు ఒకే సమయంలో జీర్ణం అయ్యేవి అయితే ఏ సమస్యా ఉండదు... అదే కొన్ని త్వరగా జీర్ణం అయ్యేవి, కొన్ని ఎక్కువ సమయం పట్టేవి అయితే, సమస్య తలెత్తుతుంది. రిలీజైన యాసిడ్లు ఆహారంతో సరిగా సెట్ కాక... యాసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.
కోడిగుడ్డు అలా కాదు. ఇందులో నీటి శాతం తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ. అందువల్ల ఇది వెంటనే అరగదు. దీన్ని అరిగించేందుకు ప్రత్యేక యాసిడ్లను విడుదల చెయ్యాల్సి ఉంటుంది. అవి ఎక్కువ సేపు పోరాడి గుడ్డును కరిగేలా చేసి, అరిగిస్తాయి. అంటే పొట్లకాయ, గుడ్డూ రెండింటికీ ఒకే రకమైన యాసిడ్లు పనిచెయ్యవు. వేర్వేరు యాసిడ్లను రిలీజ్ చెయ్యాల్సిందే. రెండింటినీ కలిపితింటే... గ్యాస్, కడుపులో మంట, ఏసీడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు డాక్టర్లు.
ఇవే కాదు... మనం తీసుకునే ఏ ఆహారం విషయంలోనైనా ఈ రూల్స్ పాటించాల్సిందే. లేదంటే... జీర్ణాశయంతోపాటూ... పేగులకు కూడా అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్లు.
Pics : క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న హిప్పీ బ్యూటీ దిగంగన
ఇవి కూడా చదవండి :
Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి
Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు
Health Tips : బరువు తగ్గాలా... అలోవెరాతో ఇలా చెయ్యండి...
Health Tips : భారతీయుల్లో లోపిస్తున్న పోషకాలు ఇవీ... ఏం చెయ్యాలంటే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.