హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Explained: నొయిడా ట్విన్ టవర్లను ఎందుకు కూల్చివేస్తున్నారు..? తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే..

Explained: నొయిడా ట్విన్ టవర్లను ఎందుకు కూల్చివేస్తున్నారు..? తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే..

నోయిడా ట్విన్ టవర్స్

నోయిడా ట్విన్ టవర్స్

Noida Twin Towers Demolish : ఉత్తర్‌ప్రదేశ్‌(UttarPradesh)లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ ట్విన్ టవర్లను(Noida Twin Towers) ఆగస్టు 28న కూల్చివేయనున్నారు. ఏళ్ల తరబడి నిర్మించిన ఈ ట్విన్ టవర్స్ ఆదివారం మధ్యాహ్నాం కేవలం సెకన్ల వ్యవధిలో నేలమట్టం కానున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Noida Twin Towers Demolish : ఉత్తర్‌ప్రదేశ్‌(UttarPradesh)లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ ట్విన్ టవర్లను(Noida Twin Towers) ఆగస్టు 28న కూల్చివేయనున్నారు. ఏళ్ల తరబడి నిర్మించిన ఈ ట్విన్ టవర్స్ ఆదివారం మధ్యాహ్నాం కేవలం సెకన్ల వ్యవధిలో నేలమట్టం కానున్నాయి. ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌ కంటే ఈ టవర్లు ఎత్తైనవి కావడం విశేషం. ఇలాంటి ఎత్తైన కట్టడాలను కూల్చివేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ కూల్చివేత ప్రపంచంలోనే ఒక భారీ సివిల్ ఇంజనీరింగ్ ఫీట్‌ కూడా కానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బిల్డర్లు తమ సొంత ఖర్చులతో 32-అంతస్తుల అపెక్స్, 29-అంతస్తుల సెయాన్నే ధ్వంసం చేస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన సూపర్‌టెక్ ట్విన్ టవర్లను ఎందుకు కూల్చేస్తున్నారో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.


* ట్విన్ టవర్లను ఎందుకు కూల్చేస్తున్నారు?
ట్విన్ టవర్ల నిర్మాణంలో అనేక బిల్డింగ్ కోడ్‌లను ఉల్లంఘించిన్నట్లు తేల్చిన సుప్రీం కోర్టు, వాటి కూల్చివేతకు ఆదేశించింది. ఈ చట్టవిరుద్ధమైన బిల్డింగ్ ప్లాన్‌ను మంజూరు చేయడంలో నోయిడా అథారిటీ అధికారులు సహకరించారు. మొదట 9 అంతస్తులలో 14 టవర్లను నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ తర్వాత 2012లో వేసిన కొత్త ప్లాన్ ప్రకారం 40 అంతస్తుల ఎత్తుతో ట్విన్ టవర్లను నిర్మించారు. అయితే సొసైటీకి చెందిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) నిర్మాణంలో సమస్యలను ఉన్నాయని ఆరోపిస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. 2014లో అలహాబాద్ హైకోర్టు ట్విన్ టవర్లను కూల్చివేసి ఫ్లాట్ కొనుగోలుదారుల చెల్లింపులను తిరిగి చెల్లించాలని బిల్డర్లను ఆదేశించింది. ఈ ఉత్తర్వును 2021లో సుప్రీంకోర్టు నిలిపివేసింది.


* ఫ్లాట్ కొనుగోలుదారులకు తిరిగి చెల్లిస్తారా?

ఫ్లాట్ కొనుగోలుదారులు బిల్డర్‌కు ఇచ్చిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందుతారని సుప్రీంకోర్టు భరోసా ఇచ్చింది. కొనుగోలుదారుల తక్షణ అవసరాల కోసం రూ.1 కోటి తమ రిజిస్ట్రీలో జమ చేయాలని సుప్రీంకోర్టు నిర్మాణ సంస్థను ఆదేశించింది.


Noida Twin Towers : నోయిడా జంట టవర్ల కూల్చివేతకు అంతా రెడీ..బటన్ నొక్కేది అతడే


* ఇల్లీగల్ ట్విన్ టవర్ల నుంచి సూపర్‌టెక్ నేర్చుకున్న పాఠాలు

సూపర్‌టెక్ ట్విన్ టవర్ల కూల్చివేత బిల్డర్లకు, అధికారులకు అనేక గుణపాఠాలను నేర్పించింది. ప్రభుత్వం, కోర్టులు నిర్దేశించిన నిబంధనలను అనుసరించడం తప్పనిసరి అన్నారు నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు ఫేస్ చేయక తప్పదన్నారు. సూపర్‌టెక్ కూల్చివేత నోయిడా అథారిటీ నిబంధనలను సవరించడానికి దారితీసిందని, డెవలపర్లకు ఫ్లోర్ ఏరియా రేషియో (FAR) పంపిణీలో వాటిని మరింత కఠినతరం చేయడానికి దారితీసిందన్నారు.* ఎలా కూల్చివేస్తారు?

3,700 కిలోల పేలుడు పదార్థాలతో కంట్రోల్డ్‌ ఇంప్లోషన్ టెక్నిక్ ద్వారా ఈ కూల్చివేత పూర్తవుతుంది. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ తన దక్షిణాఫ్రికా భాగస్వామి సంస్థ జెట్ డెమోలిషన్స్‌తో కలిసి దీనిని కూల్చివేస్తోంది.


ఏం మాయ చేశాడో : నావాడంటే నావాడంటూ ప్రియుడి కోసం బస్టాండ్ లోనే కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు


* సమీపంలోని ప్రజల భద్రత ఏంటి?

ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30 గంటలకు ట్విన్ టవర్స్ కుప్పకూలనున్నాయి. దీనివల్ల 55,000 టన్నుల చెత్త పోగు కానుంది. అయితే కూల్చివేత సమయంలో సమీపంలోని రెండు రెసిడెన్షియల్ సొసైటీలలోని దాదాపు 5,000 మంది నివాసితులను అధికారులు ఖాళీ చేయించనున్నారు. మళ్లీ అధికారుల నుంచి భద్రతా క్లియరెన్స్ వచ్చాక సాయంత్రం 4 గంటల తర్వాత వారిని ఇంటికి పంపిస్తారు.


* ఆరోగ్యపరమైన జాగ్రత్తలు

ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడడానికి ప్రభుత్వ సౌకర్యాలతో పాటు, మూడు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సిద్ధంగా ఉంటాయి. ట్విన్ టవర్లకు సమీపంలోని ఎమరాల్డ్ కోర్ట్, ATS విలేజ్‌ సొసైటీలలో నివసిస్తున్న 5,000 మందిని ఆదివారం ఉదయం 7 గంటలకు ఖాళీ చేయిస్తారు. వారికి చెందిన 2,700 వాహనాలు, 150-200 పెంపుడు జంతువులను కూడా దూరంగా తీసుకెళ్తారు. బ్లాస్టర్ల బృందం మినహా ట్విన్ టవర్ల చుట్టూ 500 మీటర్ల మేర మానవులు/జంతువులు రానివ్వకుండా చూసుకుంటారు. వైద్య బృందం, మందులు, ఆరు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతారు. కూల్చివేత వల్ల ఏర్పడే ధూళి వల్ల సమీపంలోని నివాసితులలో 7-90 రోజుల వరకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.


Published by:Venkaiah Naidu
First published:

Tags: Noida, Uttar pradesh

ఉత్తమ కథలు