హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Helmet : ఇకపై ఆ హెల్మెట్ మాత్రమే ధరించాలి..కొత్త గైడ్ లైన్స్ జారీ

Helmet : ఇకపై ఆ హెల్మెట్ మాత్రమే ధరించాలి..కొత్త గైడ్ లైన్స్ జారీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Who New Guidelines On Helmet : హెల్మెట్ (Helmet) ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Who New Guidelines On Helmet : హెల్మెట్ (Helmet) ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవటం కోసమో హెల్మెట్‌ను ధరించడం కాకుండా మన భద్రత కోసం, మనపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపేవాళ్లు కొన్నిసార్లు పాదచారుల మరణాలకు(Pedestrain Deaths) కూడా కారకులవుతున్నాయి. కొన్నిసార్లు హెల్మెట్ ధరించినప్పటికీ యాక్సిడెంట్ లో బండి నడుపుతున్న వ్యక్తితో పాటు కొన్నిసార్లు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లే పాదచారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)రోడ్డు ట్రాఫిక్ మరణాలు, గాయాలని అరికట్టడంలో సహాయపడేలా హెల్మెట్ వాడకం, పాదచారుల భద్రతపై దేశాలకు రెండు మార్గదర్శకాలను అందించింది వీటి ఆధారంగా దేశాలు చట్టాలు చేయాలని సూచించింది.

ముఖాన్ని పూర్తిగా కప్పేసే హెల్మెట్ లను ధరించడం వలన ప్రాణాంతక గాయాలను 64శాతం వరకు,తలకు తగిలే గాయాలను 74శాతం మేర నిరోధించవచ్చని వీరు తెలిపారు. టూ, త్రీ వీలర్స్ రైడర్స్ హెల్మెట్‌ల వాడకంపై, పాదచారుల భద్రతపై ఈ గైడ్ లైన్స్ రూపకల్పనలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)నిపుణులు కూడా పాలుపంచుకున్నారు. పాదచారుల మరణాలు తగ్గించడానికి రోడ్డు వాతావరణం మెరుగుపరచడం,చట్టాలను బలోపేతం చేయడం,రోడ్డు వినియోగదారులకు అవగాహన కల్పించి వారి ప్రవర్తనలో మార్పు తేవడం గురించి కూడా ఐఐటీ నిపుణలు సిఫార్సు చేశారు.

Liz Truss : బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ప్రకారం...రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు ప్రతి నిమిషానికి రెండు కంటే ఎక్కువగా జరుగుతన్నాయి. వీటి వల్ల ప్రతి సంవత్సరం 13 లక్షల మంది మరణిస్తున్నారు. ఎక్కువగా తక్కువ- మధ్య ఆదాయ దేశాలలో రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5- 29 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు, యువకుల మరణాలకు రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణమని WHO అధికారులు తెలిపారు.

"2030 నాటికి రహదారి ప్రమాద మరణాలను సగానికి తగ్గించడానికి దేశాలకు సురక్షితమైన వ్యవస్థలను రూపొందించడంలో సహాయపడటానికి ఈ కొత్త మార్గర్శకాలు కీలకమైన సాధనాలు" అని WHO సేఫ్టీ అండ్ మొబిలిటీ హెడ్ డాక్టర్ నాన్ ట్రాన్ అన్నారు. పేలవమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా పాదచారులు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారనొ ట్రాన్ తెలిపారు.

IIT ఢిల్లీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పాదచారుల మరణాలు 2013-2016 మధ్య అన్ని ఇతర రోడ్డు ప్రమాద మరణాల రేటు కంటే దాదాపు రెండు రెట్లు పెరిగాయి. భారతదేశంలో రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల వల్ల సంభవించే మొత్తం మరణాలలో 30 శాతం పాదచారుల మరణాలు. కొన్ని పెద్ద భారతీయ నగరాల్లో, రోడ్డు ట్రాఫిక్ మరణాలలో 60 శాతం వరకు పాదచారుల మరణాలు సంభవిస్తున్నాయి అని IIT ఢిల్లీ ప్రొఫెసర్ గీతం తివారీ అన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Helmet, Road accidents, Road safety, Two wheelers, WHO

ఉత్తమ కథలు