Viral | ప్రధాని మోదీ, షారుఖ్, ఆమిర్.. మధ్యలో ఆ వెయిటర్ ఎవరు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కింగ్ ఖాన్ షారుఖ్, ఆమిర్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే, వారితోపాటు మధ్యలో ఓ వెయిటర్ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాడు.

news18-telugu
Updated: October 20, 2019, 4:58 PM IST
Viral | ప్రధాని మోదీ, షారుఖ్, ఆమిర్.. మధ్యలో ఆ వెయిటర్ ఎవరు?
ప్రధాని మోదీ, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ (మధ్యలో వెయిటర్ డ్రెస్సులో మరో వ్యక్తి)
news18-telugu
Updated: October 20, 2019, 4:58 PM IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా తీసిన ఓ ఫొటో ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. #ChangeWithin పేరుతో ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ... గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాలనూ వివరించారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ప్రధాని మోదీతో సెల్ఫీలు దిగారు. ఆ సెల్ఫీల్లో ఒకటే మీరు పైన చూస్తున్నది. ఈ ఫొటోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కింగ్ ఖాన్ షారుఖ్, ఆమిర్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే, వారితోపాటు మధ్యలో ఓ వెయిటర్ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాడు. ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోలు, ఏకంగా ప్రధాని మోదీ కూడా ఉన్న ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆ నాలుగో వ్యక్తి (వెయిటర్ డ్రెస్) ఎవరై ఉంటారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

Video బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ



First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...