హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

South Sudan Mystery disease: మరో భయంకరమైన వ్యాధి... సౌత్ సూడాన్‌లో పిట్టల్లా రాలుతున్న జనం

South Sudan Mystery disease: మరో భయంకరమైన వ్యాధి... సౌత్ సూడాన్‌లో పిట్టల్లా రాలుతున్న జనం

South Sudan Mystery disease: సూడాన్‌లో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. జోంగ్లీ రాష్ట్రంలో వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించి.. నివేదిక తయారు చేసేందుకు WHO తమ బృందాన్ని సౌత్ సూడాన్‌కు పంపించింది

ఇంకా చదవండి ...

  కరోనా వైరస్‌ (Coronavirus)తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ.. తాజాగా ఒమిక్రాన్ వేరియెంట్ (Omicron Variant) విరుచుకుపడుతోంది. సౌతాఫ్రికాతో బయటపడిన ఈ వ్యాధి.. ఇప్పుడు 90 దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా యూకే, డెన్మార్క్ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఐతే ఇది చాలదన్నట్లు తాజాగా మరో కొత్త వ్యాధి ఆఫ్రికాలో బయటపడింది. సౌత్ సూడాన్ దేశంలో వింత వ్యాధితో జనం పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా మరణించారు. జోంగ్లీ స్టేట్‌లోని ఫంగాక్ పట్టణంలోనే ఈ మరణాలు నమోదయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ఏ వ్యాధి వచ్చిందో తెలియడం లేదు. కానీ జనాలు మాత్రం చచ్చిపోతున్నారు.

  Omicron: 77 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు.. వ్యాప్తి వేగంగా ఉంది: డ‌బ్ల్యూహెచ్ఓ

  వింత వ్యాధితో దక్షిణ సూడాన్‌లో దాదాపు 100 మంది మరణించారని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేపట్టిన పరిశోధన ప్రకటించింది. ఈ నేపథ్యంలో సూడాన్‌లో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. జోంగ్లీ రాష్ట్రంలో వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించి.. నివేదిక తయారు చేసేందుకు WHO తమ బృందాన్ని సౌత్ సూడాన్‌కు పంపించింది. దక్షిణ సూడాన్‌ను ఇటీవల వరదలు ముంచెత్తాయి. ఎన్నో గ్రామాలు రోజుల తరబడి వరద ముంపులోనే ఉన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోజుల తరబడి నీళ్లు నిలిచిపోవడంతో మలేరియాతో పాటు పలు వ్యాధులు ప్రబలాయి. సౌత్ సూడాన్‌లో ఇప్పటికే తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. సరైన పోషకాహారం లేక జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనే వరద రూపంలో మరో పిడుగు పడింది. తాగే నీళ్లు కలుషితమయ్యాయి. ఒక్క ఫంగాక్‌లోనే 100 మంది మరణించారని సౌత్ సుడాన్ మంత్రి కుగ్వాంగ్ వెల్లడించారు.

  Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. మ్యూజిక్ ప్రొడ్యూసర్ సహా 9 మంది మృతి

  అసలు వీరంతా ఎలా మరణించారు? వరద ముంపు కారణంగా విష జ్వరాలు వచ్చాయా? లేదంటే మరేదైనా వింత వ్యాధి విజృంభిస్తోందా? అనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. కేవలం కొన్ని రోజుల్లోనే ఇంతమంది మరణించటంతో అధికారులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఏం జరుగుతుందోనని ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా, గత నెలలో జోంగ్లీ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. దాదాపు 2లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. గత 60 ఏళ్లలో ఇలాంటి వరదలను ఎప్పుడూ చూడలేదని.. తాము సర్వం కోల్పోయామని అక్కడి వాపోతున్నారు. ఇప్పుడు వింత వ్యాధి ప్రబలి వంద మందికి పైగా మరణించడంతో గజగజా వణికిపోతున్నారు.

  First published:

  ఉత్తమ కథలు