భారత్‌లో 'కరోనా'పై తప్పు దిద్దుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

భారత్‌లో కోవిడ్‌-19 సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.

news18-telugu
Updated: April 10, 2020, 3:53 PM IST
భారత్‌లో 'కరోనా'పై తప్పు దిద్దుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పబ్లిక్ ట్రాన్సిమిషన్ స్టేజ్‌కు చేరుకుందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)... తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది. తాము చేసిన ప్రకటన పొరపాటు అని మరో ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కోవిడ్‌-19 సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. దేశంలో క్లస్టర్‌ కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొంది. సమూహ వ్యాప్తి జాబితాలో భారత్‌ను పేర్కొంటూ తమ నివేదికలో పొరపాటు జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. అంతకుముందు ఈ సంస్థ వెల్లడించిన నివేదికలో భారత్‌కు సంబంధించిన కాలమ్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అని పేర్కొనగా, చైనాలో క్లస్టర్‌ కేసులు నమోదవుతున్నట్టు వెల్లడించింది.

అయితే దీనిపై వెంటనే వివరణ ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ... నివేదికలో చోటు చేసుకున్న పొరపాటును సరి చేసింది. కాగా... భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశ లేదా సమూహ వ్యాప్తి దశలో ఉందనే వార్తలను కేంద్రం కూడా ఖండించింది. దేశంలో ఇప్పటివరకూ 6412 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా... 199 మంది మరణించినట్టు కేంద్రం ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 33గా నమోదైంది. దేశంలో మూడువారాల పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... మరో రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను కొనసాగించాలని భావిస్తున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

First published: April 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading