హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Second marriage: మొదటి భార్య పిల్లలు.. తండ్రి రెండో పెళ్లి చెల్లకుండా కేసు వేయొచ్చా? సుప్రీం కోర్టు ఏమంటోందంటే..

Second marriage: మొదటి భార్య పిల్లలు.. తండ్రి రెండో పెళ్లి చెల్లకుండా కేసు వేయొచ్చా? సుప్రీం కోర్టు ఏమంటోందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హిందూ అయిన ఓ వ్యక్తి ముస్లిం మహిళను 2003 లో వివాహం చేసుకున్నాడు. వివాహమైన పన్నెండు సంవత్సరాలకు అంటే 2015లో ఆ వ్యక్తి మరణించాడు. దీంతో అతడి మొదటి భార్య పిల్లలు.. తమ తండ్రి ఆస్తికి కేవలం తాము మాత్రమే వారసులమని.. తండ్రి రెండో పెళ్లి చెల్లదని ప్రకటించమని కోర్టులో దావా వేశారు.

ఇంకా చదవండి ...

సాధారణంగా మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు లేదా మొదటి భాగస్వామి మరణం తర్వాత మాత్రమే రెండో వివాహం చేసుకునే వీలుంటుంది. అయితే రెండో వివాహం చేసుకున్న తర్వాత.. దాన్ని ప్రశ్నించేందుకు మొదటి భార్య లేదా వారి పిల్లలకు మాత్రమే హక్కు ఉంటుంది. సాధారణ వివాహం అయితే వీళ్లు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్న భాగస్వాముల్లో ఎవరో ఒకరు మాత్రమే ఆ వివాహాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ కేసు కోర్టు ముందుకు వచ్చింది. దీనికి సుప్రీం కోర్టు ఏం చెప్పిందో తెలుసుకునే ముందు అసలు కేసు గురించి తెలుసుకోండి.

హిందూ అయిన ఓ వ్యక్తి ముస్లిం మహిళను 2003 లో వివాహం చేసుకున్నాడు. వివాహమైన పన్నెండు సంవత్సరాలకు అంటే 2015లో ఆ వ్యక్తి మరణించాడు. దీంతో అతడి మొదటి భార్య పిల్లలు.. తమ తండ్రి ఆస్తికి కేవలం తాము మాత్రమే వారసులమని.. తండ్రి రెండో పెళ్లి చెల్లదని ప్రకటించమని కోర్టులో దావా వేశారు. అంతేకాదు.. సదరు మహిళ తన మొదటి భర్తతో సరైన పద్ధతిలో విడాకులు తీసుకోలేదు కాబట్టి ఈ పెళ్లి చెల్లదని వారు ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు.

అయితే చనిపోయిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్న మహిళకు.. అంతకుముందు ఓ ముస్లిం వ్యక్తితో వివాహమైంది. కానీ 1982లో వారిద్దరికీ విడాకులు కూడా అయిపోయాయి. దీంతో పిల్లలపై ఈ మహిళ సుప్రీం కోర్టులో దావా వేసింది. దీనిపై తన వాదనలు వినిపిస్తూ సీనియర్ అడ్వకేట్ హుజేఫా అహ్మదీ వారిద్దరిదీ ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ అయిన వివాహం అని దాన్ని ఎవరూ ప్రశ్నించే వీలుండదని.. సమాజం నుంచి వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకే ఈ తరహా వివాహ చట్టం అమల్లోకి వచ్చిందని వాదించారు. అంతే కాదు.. వివాహం జరిగిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత దీన్ని ప్రశ్నిస్తున్నందువల్ల ఈ కేసును కొట్టివేయాల్సిందిగా ఆయన కోరారు.

మరోవైపు పిల్లల వైపు నుంచి వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రహ్తోగీ వారసత్వంగా వస్తున్న ఆస్తులు కేవలం తన క్లైంట్లకు మాత్రమే చెల్లాల్సి ఉంటుందని అందుకే ఫ్యామిలీ కోర్టులో దావా వేయాల్సి వచ్చిందని వాదించారు. ఆ మహిళ తన భర్తకు సరైన రీతిలో విడాకులు ఇవ్వలేదు కాబట్టి ఈ పిల్లల తండ్రితో జరిగిన ఆమె వివాహం చెల్లదని ప్రకటించాలని కూడా కోరారు.

దీనిపై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి రామసుబ్రమణ్యంలతో కూడిన ధర్మాసనం తమ అభిప్రాయాలను వెలిబుచ్చింది. ప్రత్యేక వివాహ చట్టం గురించి సరైన సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. రెండో వివాహం చెల్లుతుందా? లేదా? అన్నదానిపైనే ఆస్తుల పంపకం ఆధారపడి ఉంది కాబట్టి వారికి ఇంకో మార్గమేమీ లేదా? అని కోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 24, 25 రెండూ ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని చెబుతూ ఆరు వారాల పాటు కేసును వాయిదా వేసింది.

Published by:Sambasiva Reddy
First published:

Tags: Marriage, Supreme Court

ఉత్తమ కథలు