Home /News /national /

WHO BENEFITS IF THE REPUTATION OF INDIA LARGEST BUSINESS HOUSES ARE DELIBERATELY DAMAGED NS

OPINION: ప్రముఖ సంస్థల ఆస్థులను ధ్వంసం చేయడం వల్ల లాభమెవరికీ? ఇలాంటి చర్యలతో దేశం అభివృద్ధి చెందుతుందా?

ఆందోళన చేస్తున్న రైతులు (Image: PTI)

ఆందోళన చేస్తున్న రైతులు (Image: PTI)

Agriculture Reform Laws: వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన పేరుతో కొన్ని చోట్ల కొందరు టెలికాం టవర్స్ ను ధ్వసం చేస్తున్నారు. అయితే ఇలాంటి దుశ్చర్యల ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతారు? ఇటీవల ఓ ఐఫోన్ ఫ్యాక్టరీలో చెలరేగిన హింస దేనికి దారి తీస్తుంది? ఇలాంటి అంశాలపై ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.

ఇంకా చదవండి ...
  (PATHIKRIT PAYNE, https://www.news18.com/ కోసం రాసిన వ్యాసం)
  వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన పేరుతో కొన్ని చోట్ల కొందరు టెలికాం టవర్స్ ను ధ్వసం చేస్తున్నారు. అయితే ఇలాంటి దుశ్చర్యల ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతారు? ఇటీవల ఓ ఐఫోన్ ఫ్యాక్టరీలో చెల రేగిన హింస దేనికి దారి తీస్తుంది? అనేక కంపెనీలను చైనా నుంచి మన భారతదేశానికి తీసుకురావడానికి మన ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలను పూర్తిగా దెబ్బతీస్తే ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు? 2030-32 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థను 10 డాలర్ల ట్రిలియన్ మార్కు వైపునకు తీసుకెళ్లేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేలా చేసే దుర్మార్గపు ప్రచారం ద్వారా భారతదేశంలోని అతి పెద్ద వ్యాపార సంస్థల ఖ్యాతిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తే ఎవరికి ప్రయోజనం? ఇలాంటి ఆందోళనలు, అశాంతి ద్వారా వ్యాపార సంస్థల ఆస్తులను నాశనం చేయడం ద్వారా పెట్టుబడి దారులు భారత్ పై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం చెందనుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనపై దాడి చేయడానికి ఎల్లప్పుడు కాచుకుని చూసే మన శత్రుదేశం చైనా.

  2020 అక్టోబర్‌లో రిలయన్స్ ప్రముఖ చిప్‌ తయారీదారు క్వాల్‌కామ్‌తో కలిసి పని చేయనున్నట్లు ప్రకటించింది. ఇదే నెల ప్రారంభంలో ముఖేష్ అంబానీ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో రిలయన్స్ JIO 2021 ద్వితీయార్థంలో భారతదేశంలో 5 జి నెట్‌వర్క్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చైనా టెలికాం మౌలిక సదుపాయాలపై ఆధార పడకుండా కొత్త శకాన్ని ఆవిశ్కరించిన ఈ ముందడుగు మన దేశానికి గర్వకారణం. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న సమయంలో రిలయన్స్ JIO తన 25 శాతం వాటాను సుమారు 1.18 లక్షల కోట్ల రూపాయలకు విక్రయించి రికార్డులు సృష్టించింది. తద్వారా సంస్థ విలువ రూ.5.16 లక్షల కోట్లకు చేరింది.

  మన దేశంలోని టెలికాం రంగంలో రిలియన్స్ జీయో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. JIO రాక ముందే డేటా మన దేశంలో అత్యంత ఖరీదు. జియో అడుగు పెట్టిన తర్వాత దేశంలో డేటా విప్లవం వచ్చింది. మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతీ ఒక్కరూ నేడు చాలా తక్కువ ధరకు డేటాను వినియోగిస్తున్నారు. బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా అత్యంత సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. అదే జీయో నేడు కొంత మంది విష ప్రచారాలకు గురి కావడం ఆందోళన కలిగించే అంశం. జియో 5G ఆస్పిరేషన్స్ ను దెబ్బతీసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది.

  వందలాది సెల్ ఫోన్ టవర్లను ధ్వసం చేయడం, ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలో విధ్వంసం సృష్టించడం లాంటి ఘటనలను యాధృచ్ఛికంగా జరిగాయా? లేక ఎవరైనా ఈ ఘటనల వెనుక ఉన్నారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. భారత దేశ ఆర్థిక సంపదను భారీగా పెంచాలన్న లక్ష్యంతో కేంద్రం పని చేస్తుంది. ఈలాంటి లక్ష్యాలు చేరాలంటే ప్రభుత్వంతో పాటు ఇన్వెస్టర్ల సహకారం కూడా చాలా అవసరం. అయితే ఇలాంటి విధ్వంసాల ద్వారా వారు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది.

  ఈ నూతన వ్యవసాయ చట్టాల ద్వారా అత్యధికంగా నష్టం రైతులను దోచుకునే దళారులు, మద్యవర్తులకే ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి వ్యవస్థలు తొలగించాలని డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు సైతం ఇప్పుడు ఆ అంశంపై మాట్లాడకపోవడం గమనార్హం. దీంతో మొత్తం ఆందోళన అంతా కార్పొరేట్ అనే అంశానికి వ్యతిరేకంగా తిప్పడం గమనార్హం. ఈ ఆందోళన వెనుక అనేక రాజకీయ వ్యూహాలు, కుట్రలు ఉన్నాయని తెలుస్తోంది

  The author is a geopolitical analyst. Views expressed are personal.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: China, Delhi, Farmers Protest, Jio, Jio 5G

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు