హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Facebook: వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!

Facebook: వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!

 వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!

వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!

టిక్‌టాక్‌(Tok-tok) తరహాలో యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రణాళిక రూపొందించింది సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌(Facebook). కంటెంట్‌ క్రియేటర్‌లు ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో పోస్ట్‌ల రూపంలో కంటెంట్‌ షేర్‌ చేసుకునేలా ఫేస్‌బుక్‌ డిజైన్‌లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...

టిక్‌టాక్‌(Tok-tok) తరహాలో యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రణాళిక రూపొందించింది సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌(Facebook). కంటెంట్‌ క్రియేటర్‌లు ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో పోస్ట్‌ల రూపంలో కంటెంట్‌ షేర్‌ చేసుకునేలా ఫేస్‌బుక్‌ డిజైన్‌లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో.. ‘యూజర్ల డీఫాల్ట్‌ స్క్రీన్‌ హోమ్ పేజ్‌లో అవుట్ సైడ్‌ క్రియేటర్స్‌ నుంచి మోస్ట్‌ ఎంటర్‌ట్రైనింగ్‌ పోస్ట్‌లు కనిపిస్తాయి. షార్ట్‌ వీడియో సర్వీస్‌ రీల్స్‌, స్టోరీస్‌కి ఈజీ యాక్సెస్‌ ఉంటుంది.’ అని పేర్కొంది. న్యూ ఫీడ్స్‌ ట్యాబ్‌(Tab) కింద ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, ఫేవరెట్‌ పేజెస్‌ నుంచి రీసెంట్‌ పోస్ట్‌లు చూడవచ్చని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఎక్కువగా పోస్ట్‌లు చూడాలనుకునే ఫ్రెండ్స్‌, ఫేవరెట్‌ పేజ్‌లతో ‘ఫేవరెట్స్‌ లిస్ట్‌’ క్రియేట్‌ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

దానికే మొదటి ప్రాధాన్యం

కొత్త అప్‌డేట్ల గురించి ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) ఓ పోస్ట్‌లో తెలిపారు. ‘యాప్‌లో ఇప్పటికీ హోమ్ ట్యాబ్‌లో పర్సనలైజ్డ్‌ కంటెంట్‌ కనిపిస్తుంది. సంబంధిత యూజర్‌కి ఇష్టమైన కంటెంట్‌ను డిస్కవరీ ఇంజిన్ సిఫార్స్‌ చేస్తుంది. కానీ ఫీడ్స్‌ ట్యాబ్ బెస్ట్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి కస్టమైజ్‌, కంట్రోల్‌ చేసే అవకాశం కల్పిస్తుంది.’ అని తెలిపారు.

గత సంవత్సరం ఫేస్‌బుక్‌ పేరు మెటా(Meta)గా మారింది. ప్రస్తుతం ByteDance వీడియో-షేరింగ్ యాప్, TikTokకి పోటీగా నిలిచేందుకు వీడియో ప్రొడక్ట్స్‌పై పెద్ద మొత్తంలో ఫేస్‌బుక్‌ నిధులు వెచ్చిస్తోంది. పర్సనలైజ్డ్‌ షార్ట్‌, ఎంగేజింగ్‌ వీడియో ఫీచర్‌లతో టిక్‌టాక్‌ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంగా నిలిచింది. ఇదే తరహా రీల్స్‌పై ఖర్చు చేయడం, యూజర్లను ఆకట్టుకోవడం, ఆదాయాలను పెంచుకోవడం కంపెనీ ప్రధాన లక్ష్యమని, దానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని జుకర్‌బర్గ్ వివరించారు.

సోషల్‌ మీడియా మార్కెట్‌లో పెద్ద మార్పు

ప్రజలు తమ సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో నిర్ణయించుకునే దానికి చాలా ఆప్షన్స్‌ ఉన్నాయని, టిక్‌టాక్‌ వంటి యాప్స్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందాయని జుకర్‌బర్గ్ ఇటీవల చెప్పారు. దీర్ఘకాలికంగా రీల్స్‌పై దృష్టి పెట్టడం ఎందుకు అవసరమో ఆయన వివరించారు.

ఆర్థిక సేవల సంస్థ గ్లోబల్ ఎక్స్ ఇటిఎఫ్‌లలో రీసెర్చ్‌ అనలిస్ట్‌ తేజస్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘ఫేస్‌బుక్ తీసుకురానున్న మార్పు సోషల్‌ మీడియా మార్కెట్‌లో లార్జర్‌ షిఫ్ట్‌ అవుతుంది. వినియోగదారులు చిన్న చిన్న ఇన్‌ఫర్మేషన్‌ చూసేందుకు, ప్రైవేట్‌గా ఛాట్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. యూజర్‌లు కోరుకుంటున్న దానికి ఫేస్‌బుక్‌ ప్రతిస్పందిస్తోందని భావిస్తున్నా. ప్రపంచం గురించి మరింత అర్థం చేసుకోవడానికి యూజర్‌లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వైపు చూస్తున్నారు. ఈ మార్పులతో పాటు యూజర్‌లు తమ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో డైరక్ట్‌ మెసేజస్‌ ద్వారా నేరుగా మాట్లాడటం లేదా కంపెనీ వాట్సాప్‌ కోసం కంపెనీ సేవలను ఇప్పటికీ ఆశ్రయిస్తారు.’ అని చెప్పారు.

110 మిలియన్‌లు దాటిన యూఎస్‌ టిక్‌టాక్‌ వినియోగదారులు

గత ఏడాది చివరి మూడు నెలల్లో, ఫేస్‌బుక్ తన 18 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా రోజువారీ వినియోగదారులను కోల్పోయిందని, దాని స్టాక్ ధర పతనమైందని నివేదికలు వచ్చాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో సోషల్ మీడియా అవుట్‌లెట్ వినియోగదారుల వృద్ధి సంఖ్యలు స్థిరంగా ఉన్నప్పటికీ, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు యువత దృష్టిని గెలుచుకోవడంపై తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ చెప్పింది. మరో వైపు యూఎస్‌ టిక్‌టాక్‌ వినియోగదారుల సంఖ్య 110 మిలియన్లకు పైగా పెరిగింది.

ఇదీ చదవండి: Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !


ఫీడ్‌ అందించేందుకు అప్‌డేట్స్‌

ఫేస్‌బుక్ తన వ్యాపారానికి అనేక బెదిరింపులను ఎదుర్కొంటూనే ఉంది, డిజిటల్ అడ్వర్టైజింగ్ బడ్జెట్‌లను తగ్గించడానికి విక్రయదారులను ప్రేరేపించే పొటెన్షియల్‌ రెసిషన్‌ కూడా ఉంది. యాపిల్ కొత్త గోప్యతా పరిమితులను కూడా విధిస్తోంది.

Facebook

వినియోగదారులు తమ న్యూస్‌ ఫీడ్‌లలో ఏ కంటెంట్ ఎక్కువగా చూడాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఫేస్‌బుక్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతోంది. 2010ల మధ్యలో, సైట్‌లో వినియోగదారులు గడిపిన సమయాన్ని పెంచడంపై కంపెనీ దృష్టి సారించింది. తరచుగా క్లిక్‌బైట్ కథనాలను, వృత్తిపరంగా ఉత్పత్తి చేసిన వీడియోలను వినియోగదారుల ఫీడ్‌లుగా పెంచింది.

2018లో ఎంగేజ్‌మెంట్‌ ప్రోత్సహించే పోస్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడానికి అల్గారిథమ్‌ను మార్చింది. దీని అర్థం స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కంటెంట్‌ను ఎలివేట్ చేసింది. అప్పటి నుండి, వినియోగదారులు కొత్త కంటెంట్‌ను కనుగొనే విధానాన్ని కంపెనీ సవరిస్తూనే ఉంది. ఈ సంవత్సరం దాని ఫోటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులకు కంటెంట్‌ను వీక్షించడానికి రెండు కొత్త మార్గాలను అందించింది. ఇష్టమైన స్నేహితులు, క్రియేటర్స్‌ నుంచి లేదా అనుసరించే ఖాతాల నుంచి కంటెంట్‌ను తెలుసుకోవచ్చు.

Published by:Mahesh
First published:

Tags: Facebook, Meta, Social Media, Tik tok

ఉత్తమ కథలు