హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Deep Sidhu: సిద్ధు, సిధానా ఎవరు వీరు? రైతులను హీరో ఎందుకు రెచ్చగొట్టారు.. సిద్ధు బీజేపీ వ్యక్తా..?

Deep Sidhu: సిద్ధు, సిధానా ఎవరు వీరు? రైతులను హీరో ఎందుకు రెచ్చగొట్టారు.. సిద్ధు బీజేపీ వ్యక్తా..?

దీప్ సిద్ధు (ఫైల్ ఫొటో)

దీప్ సిద్ధు (ఫైల్ ఫొటో)

అసలు ఎవరు ఈ సిద్ధు? అనే ప్రశ్నను గూగుల్ లో వెతుకుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం మంగళవారం ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయటం వెనుకున్నది ఈ హీరోనే అంటూ రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...

ఎర్రకోట వైపు రైతులంతా వెళ్లేలా రైతులను రెచ్చగొట్టినది పంజాబీ హీరో దీప్ సిద్ధు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ నిలుస్తున్నారు దీప్ సిద్ధు. అసలు ఎవరు ఈ సిద్ధు? అనే ప్రశ్నను గూగుల్ లో వెతుకుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం మంగళవారం ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయటం వెనుకున్నది ఈ హీరోనే అంటూ రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫేస్ బుక్ లైవ్ వీడియోలో.. నిషాన్ సాహిబ్ ను ఎర్రకోట వద్ద ఎగురవేసి, త్రివర్ణ పతాకాన్ని తొలగించాలంటూ ఆయన ప్రసంగించటం రిపబ్లిక్ డే (Republic Day) ట్రాక్టర్ పెరేడ్ లో క్షణాల్లో వైరల్ అయింది. ఇది నిరసనకారులైన రైతులను మరింత ప్రేరేపించిందంటూ రైతు సంఘ నాయకులు తాజాగా వివరణ ఇస్తున్నారు.

ఓ దశలో కిసాన్ ర్యాలీకి దిశానిర్దేశం చేసిన సిద్ధూ ఇందుకు గ్యాంగ్ స్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అయిన లఖా సిధానా (Lakha Sidhana) కూడా తోడయ్యారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టంబరు 25న ఢిల్లీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నసిద్ధు, సోషల్ మీడియా బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సిద్ధు ప్రమేయాన్ని మొదటి రైతు సంఖాలు వ్యతిరేకించాయి కూడా. "బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఏజెంట్" అంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తగా ఆయన వాటిని ఖండించారు కూడా. బాలీవుడ్ హీరో సన్నీడియోల్ కు (Sunny Deol) మద్దతుగా గురుదాస్ పూర్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసిన సిద్ధు ఫొటో ఒకటి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తనకు సిద్ధుతో ఎటువంటి సంబంధాలు లేవని తాజాగా సన్నీడియోల్ ట్విట్టర్లో ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమంలో పాల్గొంటున్న రైతు సంఘాలన్నీ తమకు సిద్ధుతో ఎటువంటి సంబంధాలు లేవని తెగేసి చెప్పాయి.

సమర్థించుకున్న సిద్ధు

అయితే తాము "ఏ తప్పు చేయలేదని, జాతీయ జెండాను తొలగించలేదని, కేవలం రెడ్ ఫోర్ట్ పై నిరసనకు గుర్తుగా నిషాన్ సాహిబ్ ను ఎగురవేశామని" తమ చేష్టలను సిద్ధు సమర్థించుకోవటం విశేషం. 1984 లో పంజాబ్ లో జన్మించిన సిద్ధు, లా చదువుకున్నారు. కెరీర్ మొదట్లో.. కొంతకాలం పాటు బార్ లో పనిచేసిన ఈయన ఆతరువాతి కాలంలో కింగ్ ఫిషర్ మోడల్ హంట్ అవార్డు గెలుపొందారు. ఆతరువాత 2015లో రిలీజ్ అయిన పంజాబీ సినిమా "రమ్తా జోగి" తో ఆయన తెరంగేట్రం చేశారు. 2018లో ఈయన నటించిన "జోరా దాస్ నంబ్రియా" సినిమా హిట్ అయ్యాక పాపులర్ నటుడిగా సిద్ధు గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఆయన పోషించిన గ్యాంగ్ స్టర్ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

లైవ్ లో ప్రసారం..

రెడ్ ఫోర్ట్ పై జెండా ఎగురవేయటం అన్నది పకడ్బందీ ప్రణాళిక ప్రకారం జరిగిందన్నదానికి ఆలస్యంగా సాక్షాధారాలు లభిస్తున్నాయి. శింఘు బోర్డర్ లోని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) వేదికపై సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు 6 గంటల పాటు ట్రాక్టర్ ర్యాలీ రూటు మార్పుపై చర్చోపచర్చలు సాగాయి. SKM, ఢిల్లీ పోలీసుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయంను కొందరు వ్యతిరేకించటం వంటివి సోషల్ మీడియా అకౌంట్లలో, పంజాబీ వెబ్ చానెల్స్ లైవ్ టెలికాస్ట్ సైతం అయ్యాయి. అయితే ఇందులో గుర్తు తెలియని వ్యక్తులు మొదట ప్రసంగించగా ఆతరువాత లక్భీర్ సింగ్ సిధానా అలియాస్ లఖా సిధానా, సిద్ధు వంటి వారు రైతులను ఉద్దేశించిన వారిలో ఉన్నారు. సిధానా మాల్వా యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిధానాకు 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని కేసుల నుంచి బయటపడగా, మన్ ప్రీత్ సింగ్ బాదల్ ప్రారంభించిన ప్యూపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ టికెట్టుపై పోటీ చేశారు.

ఇక శింఘు బోర్డర్ కి చేరుకునే ముందు కూడా సిద్ధు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇందుకు పంజాబ్-హర్యానాల మధ్య ఉన్న శింబు బోర్డర్ ను వేదికగా చేసుకున్నారు కూడా. నిజానికి శంభు వద్ద ఖలిస్తాన్ శక్తులు రైతుల ముసుగులో ఈ ఉద్యమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. గతేడాది నవంబరులో శంభు బోర్డర్ లో జరిగిన ఘటనలో కూడా సిద్ధు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు చేసిన ప్రయత్నాన్ని హర్యానా పోలీసులు వాటర్ కానన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించి సమర్థవంతంగా తిప్పికొట్టారు. “Sikhs For Justice” కు సంబంధించిన వ్యవహారాల్లో గతేడాది జనవరిలో NIA సమన్లు అందుకున్న వారిలో సిద్ధు కూడా ఉన్నట్టు, ఆయనతో పాటు ఆయన సోదరుడు మన్ దీప్ సింఘ్ కూడా ఉన్నట్టు తేలింది.

బీజేపీతో సంబంధం లేదు..

కాగా గతంలోనే ఓ ఇంటరవ్యూలో స్పష్టంగా చెప్పిన సిద్ధు.. తనకు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు కూడా. “నేను బీజేపీని సపోర్ట్ చేయటం లేదు.. బీజేపీతో పాటు ఏ పొలిటికల్ పార్టీని నేను సపోర్ట్ చేయటం లేదు” అంటూ సిద్ధూ చెప్పారు. కాగా జర్నైల్ సింఘ్ బింద్రన్ వాలే (Jarnail Singh Bhindranwale) ప్రస్తావనను మాత్రం పదేపదే తెచ్చిన సిద్ధుకు సిఖ్స్ ఫర్ జస్టిస్ తో సంబంధాలున్నట్టు ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది.

First published:

Tags: Bjp, Delhi Violence, Farmers Protest, Farmers suicide, New Agriculture Acts

ఉత్తమ కథలు