హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Unemployment Rate : దేశంలో నిరుద్యోగ రేటుపై రిపోర్ట్ రిలీజ్..ఏపీ,తెలంగాణాలో ఇలా!

Unemployment Rate : దేశంలో నిరుద్యోగ రేటుపై రిపోర్ట్ రిలీజ్..ఏపీ,తెలంగాణాలో ఇలా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Unemployment Rate : దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం(Unemployment )ఒకటి. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీల మేనిఫెస్టోలో ఉద్యోగ కల్పన గురించి, నిరుద్యోగ ప్రస్తావన గురించి ఖచ్చితంగా ఉంటుందన్న విషయం తెలెసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Unemployment Rate : దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం(Unemployment )ఒకటి. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీల మేనిఫెస్టోలో ఉద్యోగ కల్పన గురించి, నిరుద్యోగ ప్రస్తావన గురించి ఖచ్చితంగా ఉంటుందన్న విషయం తెలెసిందే. అయితే దేశంలో నిరుద్యోగం గురించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ఒక డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో నిరుద్యోగిత రేటు(Unemployment Rate )6.8శాతం ఉందట. అయితే ఈ రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నట్లు లేటెస్ట్ డేటా చెబుతోంది. గ్రామీణ ప్రాంతంలో 6.3 శాతం నిరుద్యోగం ఉండగా, పట్టణ ప్రాంతంలో 7.8 శాతం ఉంది. వాస్తవానికి గత నెలలో 8.28 శాతం ఉన్న దేశ నిరుద్యోగ రేటు ఒకే నెలలో 6.3 శాతానికి తగ్గినట్లు డేటాలో తెలిపారు.

కాగా,రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల వారీగా చూస్తే దేశంలో అత్యధికంగా హర్యానాలో 37.3 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ (32.8), రాజస్తాన్ (31.4), జార్ఖండ్ (17.3), త్రిపుర (16.3),గోవా(13.7),బీహార్(12.8) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగం చత్తీస్ ఘడ్ లో ఉన్నట్లు డేటా వెల్లడించింది. చత్తీస్ ఘడ్ లో నిరుద్యోగ రేటు 0.4 శాతమని డేటా వెల్లడించింది.  మేఘాలయ(2),మహారాష్ట్ర(2.2),ఒడిషా(2.6),మధ్యప్రదేశ్(2.6) తర్వాత స్థానంలో ఉన్నాయి.

Covid Update : గుడ్ న్యూస్..తగ్గిపోతున్న కోవిడ్ యాక్టివ్ కేసులు

అయితే దక్షిణాదిలో కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నట్లు డేటా చెబుతోంది. దక్షిణాదిలో అత్యంత తక్కువ నిరుగ్యోగం ఉన్న రాష్ట్రంగా కర్ణాటక(3.5గా ఉంది. దక్షణాదిలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు(7.2)నిలిచింది. తెలంగాణలో నిరుగ్యోగ రేటు(6.9)గా ఉండగా,ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ రేటు(6),కేరళలో6.1గా ఉన్నట్లు సీఎంఐఈ డేటా తెలిపింది. నిరుద్యోగ రేటు అంటే ప్రధానంగా పనిచేసే వయస్సు జనాభా(15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ)పని కోసం ఎదురుచూస్తూ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నవారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Unemployement people, Unemployment

ఉత్తమ కథలు