హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rahul Gandhi : ఆ రూ.20 వేల కోట్లు ఎవరివి? ప్రెస్‌మీట్‌లో రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

Rahul Gandhi : ఆ రూ.20 వేల కోట్లు ఎవరివి? ప్రెస్‌మీట్‌లో రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

రాహుల్ గాంధీ (image credit - ANI)

రాహుల్ గాంధీ (image credit - ANI)

Rahul Gandhi : పార్లమెంట్‌లో అనర్హత వేటు తర్వాత.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌లో 2 ప్రధాన ప్రశ్నలు వేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రెస్‌మీట్‌లో 2 సూటి ప్రశ్నలు వేశారు. పారిశ్రామిక వేత్త అదానీకి చెందిన షెల్ కంపెనీలలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎవరు పెట్టారు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆ మనీ ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండో ప్రశ్నగా.. అధానీకీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ మధ్య ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆ డబ్బు... అదానీ సంపాదించడం ద్వారా రాలేదన్న రాహుల్.. అందుకే ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని రాహుల్ అన్నారు.

అదానీకీ, మోదీకీ మధ్య స్నేహం గురించి తాను పార్లమెంట్‌లో మాట్లాడానన్న రాహుల్... నిబంధనలు మార్చేసి.. అదానీకి కేంద్రం ఎయిర్ పోర్టులు అప్పగించిందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దీనిపై కేంద్ర మంత్రులు పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పారన్న రాహుల్.. దీనిపై తాను రెండు లేఖలు రాస్తే వాటికి సమాధానం ఇవ్వలేదని అన్నారు. స్పీకర్‌ని కలిసి ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారని రాహుల్ చెప్పారు.

అదానీ, మోదీ మధ్య సంబంధం ఇప్పటిది కాదన్న రాహుల్.. ఎప్పటి నుంచో ఇది ఉందన్నారు. తాను ఎవరికీ భయపడనన్న రాహుల్.. తాను నిజం చెబుతున్నానని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్న రాహుల్... ప్రజాస్వామ్యం కోసం తాను పోరాడుతున్నానని అన్నారు. తనపై అనర్హత వేటు వేసినా, తనను జైలుకు పంపినా భయపడేది లేదని రాహుల్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

ఆ 20 వేల కోట్ల రూపాయలు ఎవరివో తెలుసుకొని.. వారిని జైలుకు పంపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న అదానీని కాపాడేందుకు ప్రధాని మోదీ ఎందుకు ప్రయత్నిస్తున్నారని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారని రాహుల్ అన్నారు. దేశమే అదానీ, అదానీయే దేశం అని మోదీ భావిస్తున్నారని రాహుల్ అన్నారు.

First published:

ఉత్తమ కథలు