Home /News /national /

WHERE ARE 2 CRORE JOBS AND RS 15 LAKH PROMISED ASKS PRIYANKA GANDHI IN MAIDEN RALLY AFTER JOINING POLITICS SK

2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? మోదీపై రాహుల్, ప్రియాంక గాంధీ విమర్శలు

ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ

దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని..గుజరాతీలకు ఆ రెండు సిద్ధాంతాల గురించి తెలుసన్నారు రాహుల్ గాంధీ. అందుకే ఇన్నేళ్ల తర్వాత గుజరాత్‌లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. మరోవైపు పటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ గూటికి చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇంకా చదవండి ...
    లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో...కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి దిగింది. మోదీ ఇలాఖా గుజరాత్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. 56 ఏళ్ల తర్వాత గుజరాత్‌లో cwc సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హోదాలో ప్రియాంక గాంధీ తొలిసారి cwc సమావేశానికి హాజరయ్యారు. అనంతరం గాంధీ నగర్‌లో జరిగిన జనసంకల్ప్ సభలో ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు అన్నాచెల్లెళ్లు. రైతులు,మహిళలు, యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ మోదీపై విరుచుకుపడ్డారు.

    దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. మేకిన్ ఇండియా అంటున్న ప్రధాని మోదీ నిరుద్యోగ సమస్యపై దృష్టిపెట్టలేదు. వ్యాపారవేత్తలకు వేలకోట్ల రుణాలను మాఫీచేసి పేద రైతులను పట్టించుకోలేదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే రైతు రుణాలను మాఫీ చేశాం. నోట్ల రద్దుతో కోట్లాది మంది చిన్న వ్యాపారులను రోడ్డుపాలు చేశారు. నల్లధనం వెనక్కి తెచ్చి అందరి అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు. మరీ ఎవరికైనా వచ్చాయా? జీఎస్టీ అంటే ఏంటో చిన్న, సన్నాకారు వ్యాపారులకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తాము అధికారంలోకి వస్తే అన్ని వస్తువులపై ఒకే శ్లాబు అమలు చేస్తాం. దేశంలోని రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు.
    రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్
    2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? ప్రజలకు ఇస్తామన్న 15 లక్షలు ఏమయ్యాయి.? మహిళల భద్రత ఏమైంది? రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రేమ, సామరస్యం, సోదరభావం పునాదుల మీద భారత దేశం ఏర్పడింది. కానీ ప్రస్తుతం దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతున్నారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళల భద్రత అంశాలపైనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటే మీ ఆయుధం. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి.
    ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
    దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని..గుజరాతీలకు ఆ రెండు సిద్ధాంతాల గురించి తెలుసన్నారు రాహుల్ గాంధీ. అందుకే ఇన్నేళ్ల తర్వాత గుజరాత్‌లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. మరోవైపు పటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ గూటికి చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశానికి రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల అనసరించిన వ్యూహంపై చర్చలు జరిపారు.
    First published:

    Tags: Congress, Lok Sabha Election 2019, Priyanka Gandhi, Rahul Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు