హోమ్ /వార్తలు /జాతీయం /

యుద్ధంలో పట్టుబడిన పైలట్‌ను ఎలా విడిపిస్తారు... కార్గిల్ యుద్ధంలో పైలట్ నచికేత ఎలా రిలీజ్ అయ్యారు?

యుద్ధంలో పట్టుబడిన పైలట్‌ను ఎలా విడిపిస్తారు... కార్గిల్ యుద్ధంలో పైలట్ నచికేత ఎలా రిలీజ్ అయ్యారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Vs Pakistan : భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ ఆందోళనలు కొనసాగుతున్నాయి. యుద్ధంలో యుద్ధ ఖైదీగా పట్టుబడే పైలట్లను ఎలా విడిపిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది.

భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్‌నీ, భారత్ విజయాన్నీ ఎప్పటికీ మర్చిపోలేం. 1999లో ఆ యుద్ధం జరిగే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన పైలట్ నచికేత పాక్ సరిహద్దుల్లోకి వెళ్లారు. ఆయన నడిపిన విమానం ఇంజిన్ ఫెయిలై... పాకిస్థాన్ సరిహద్దుల్లో కూలిపోయింది. ప్రాణాలతో బయటపటిన నచికేత తాను పాకిస్థాన్‌ సరిహద్దులో ఉన్నట్లు గుర్తించారు. కాస్త దూరంలో పాకిస్థాన్ సైనికులు తనవైపు రావడం చూసి... తప్పించుకోలేనని గ్రహించి... తన దగ్గర ఉన్న రహస్య డాక్యుమెంట్లు, మిలిటరీ సీక్రెట్ సమాచారాన్ని తగలబెట్టేశారు. ఆ వెంటనే పాక్ ఆర్మీ రేంజర్లు... నచికేతను పట్టుకొని తమతో తీసుకుపోయారు.


చిత్రహింసలు పెట్టిన పాకిస్థాన్ : భారత సైనిక రహస్యాలు చెప్పమంటూ నచికేతకు నరకం చూపించారు పాక్ సైనికులు. వాళ్లు ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఒక్క రహస్యమూ బయటపెట్టలేదు నచికేత. పాకిస్థాన్ ఉన్నతాధికారి ఒకరు ఇలా చిత్ర హింసలు పెట్టడం కరెక్టు కాదని చెప్పడంతో... పైక్ సైనికులు వెనక్కి తగ్గారు. జూన్ 3, 1999 వరకు నచికేత యుద్ధ ఖైదీగా ఉన్నారు. అప్పటి భారత ప్రభుత్వం... అంతర్జాతీయంగా వివిధ దేశాల ద్వారా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దాంతో తలొగ్గిన పాకిస్థాన్, నచికేతను విడిచిపెట్టింది. సైనిక రహస్యాలు చెప్పకుండా ధైర్యం ప్రదర్శించిన నచికేత అప్పట్లో ఎయిర్ ఫోర్స్ మెడల్‌ పొందారు.


ఫలించిన దౌత్యం : నచికేతను రిలీజ్ చెయ్యడానికి ఇస్లామాబాద్‌లోని అప్పటి భారత హై కమిషనర్‌ పార్థసారథి ఎంతో కృషి చేశారు. జెనీవా కన్వెషన్ ఒప్పందం ప్రకారం సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకుంటే... తిరిగి వారిని భారత్‌కు అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జెనీవా కన్వెన్షన్‌లో అంతర్జాతీయ న్యాయసూత్రాలున్నాయి. ఈ దిశగా పార్థసారథి దౌత్య చర్యలు చేపట్టారు. తనకు అప్పగించిన నచికేతను... వాఘా సరిహద్దు నుంచీ భారత్‌కి తీసుకొచ్చారు.


ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో నచికేత వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉగ్రవాద శిబిరాల తొలగింపుపై అంతర్జాతీయ దేశాలతో పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.


 

ఇవి కూడా చదవండి :


మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి


వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?


ట్రూకాలర్ నుంచీ మన నంబర్ తీసేయడం ఎలా? సింపుల్ ట్రిక్... ఫాలో అవ్వండి మరి

First published:

Tags: India VS Pakistan, Indian Army, National News, Pulwama Terror Attack, Surgical Strike 2

ఉత్తమ కథలు