Home /News /national /

WHEAT EXPORT GOVT ORDERS PHYSICAL VERIFICATION OF DOCUMENTS TO ENSURE COMPLIANCE PVN

Wheat Export: కేంద్రం కీలక నిర్ణయం..గోధుమల ఎగుమతికి ఫిజికల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ తప్పనిసరి

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Physical verification for wheat export: భారత్‌ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించిన విషయం తెలసిందే. దేశీయ మార్కెట్‌లో(Domestic Market)ఆహార పదార్థాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం గోధుమల ఎగుమతిని(Wheat Export) నిషేధించింది

Physical verification for wheat export: భారత్‌ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించిన విషయం తెలసిందే. దేశీయ మార్కెట్‌లో(Domestic Market)ఆహార పదార్థాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం గోధుమల ఎగుమతిని(Wheat Export) నిషేధించింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గోధుమల ఎగుమతులపై నియంత్రణ నిర్ణయం ఆహార ధరలను అదుపు చేస్తుంది. భారతదేశం, లోటును ఎదుర్కొంటున్న దేశాల ఆహార భద్రతను బలోపేతం చేస్తుంది. రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ ఎగుమతులు పడిపోయాయి. అదీగాక ఇతర దేశాలలో పంటలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంతో యావత్‌ ప్రపంచం గోధుమల కోసం భారత్‌వైపే చూసింది. అందుకు అనుగుణంగా భారత్‌ కూడా సుమారు 10 మిలయన్ల వరకు గోధులమలను ఎగుమతి చేయాలని అనుకుంది గానీ జాతీయ ఆహార భద్రతా దృష్ట్యా నిలిపేసింది.

గోదుముల నిషేధం అమలులోకి రాక మునుపే కస్టమ్స్‌ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను మాత్రమే అనుమతించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. గోధుమల కన్‌సైన్‌మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్‌కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్లయితే, అటువంటి కన్‌సైన్‌మెంట్లను ఎగుమతి చేయడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రైవేట్‌ ఎగుతిదారులు ఈ నిబంధను క్యాష్‌ చేసుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా కఠినతరమైన నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గోధుమలు ఎగుమతి చేసే ముందు ఫిజికల్‌ వెరిఫికేషన్‌ నిర్వహించాలని తెలిపింది. అంతేకాదు అర్హత ఉన్న ఎగుమతిదారుల విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ల జారీకి ప్రాంతీయ అధికారులు డ్యూ డిలిజెన్స్ పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలామటుకు నిషేధాన్ని తప్పించుకునే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ని మే 13కి ముందు తేదిని ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేలా తనిఖీలు తప్పనసరి అని స్పష్టం చేసింది. ప్రాంతీయ అధికారులు ఆమెదించిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌సీ) తేదికి సంబంధిత బ్యాంకులకు సంబంధించిన స్విఫ్ట్‌ లావాదేవీల తేదితో సరిపోల్చాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ ఎగుమతిదారులు సీబీఐ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేసే ప్రయత్నాలలో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్లు ఆమోదం కోసం ఇద్దరు సభ్యుల ఉన్న కమిటీకి పంపబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ క్లియరన్స్‌ ఇచ్చిన తర్వాతే ప్రాంతీయ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేస్తారని వెల్లడించింది.

ALSO READ India Help To Sri Lanka : మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ ను శ్రీలంకకు పంపిన భారత్

మరోవైపు, కేంద్రం గతవారం చక్కెర ఎగుమతులపై(Sugar Export) కూడా పరిమితులు విధించింది. ద్ర‌వోల్బ‌ణం పెరుగుతోన్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మంగళవారం కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించింది. విదేశాలకు ఎగుమతి చేయడంతోనే దేశీయంగా చక్కెర ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌తో ముగియనున్న ప్రస్తుత మార్కెటింగ్‌ ఏడాదిలో చక్కెర ఎగుమతులను కోటి టన్నుల వరకు మాత్రమే పరిమితం చేస్తామని కేంద్రం పేర్కొంది. చక్కెర సీజన్ 2021-22 (అక్టోబర్-సెప్టెంబర్)లో దేశంలో చక్కెర దేశీయ లభ్యత మరియు ధర స్థిరత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో జూన్ 1 నుండి చక్కెర ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. చక్కెర ఎగుమతిపై ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయని సమాచారం. చక్కెర (ముడి, శుద్ధి చేసిన మరియు తెలుపు చక్కెర) ఎగుమతి జూన్ 1 నుండి పరిమితం చేయబడిన కేటగిరీ కింద ఉంచబడుతుంది అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, కొన్ని స‌డ‌లింపుల మ‌ధ్య EU మరియు USలకు చక్కెర ఎగుమతి చేయబడుతోంది. CLX మరియు TRQ కింద ఈ ప్రాంతాలకు నిర్దిష్ట మొత్తంలో చక్కెర ఎగుమతి జ‌రుగుతోంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Exports, Wheat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు