హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vice President of India: భారత ఉపరాష్ట్రపతి జీవితం ఎలా ఉంటుంది? జీతం ఎంత? సౌకర్యాలేంటి?

Vice President of India: భారత ఉపరాష్ట్రపతి జీవితం ఎలా ఉంటుంది? జీతం ఎంత? సౌకర్యాలేంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vice President of India: ఉపరాష్ట్రపతి పదవి ఎలా ఉంటుంది, ఎవరు అర్హులు, జీత భత్యాలు, ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనే అంశాల గురించి తెలుసుకుందాం

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Vice President of India:  ప్రస్తుత ఉపరాష్ట్రపతి(Vice President) వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా, ఎన్‌డీఏ(NDA) అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్ మధ్య పోటీ నెలకొంది. ఈ సమయంలో ఎవరు తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అదే సమయంలో ఉపరాష్ట్రపతి పదవి ఎలా ఉంటుంది, ఎవరు అర్హులు, జీత భత్యాలు, ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనే అంశాల గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. అందుకే భారత ఉపరాష్ట్రపతిగా జీవితం ఎలా ఉంటుందని, వారికి అందే బెనిఫిట్స్‌ ఎలా ఉంటాయనే అంశాలపై న్యూస్18 వివరాలు తెలుసుకోండి.

* ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు అర్హులు?

ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి కచ్చితంగా భారతదేశ పౌరుడు అయి ఉండాలి. తప్పకుండా 35 ఏళ్ల వయసు పూర్తయి ఉండాలి. రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉన్న వారు మాత్రమే ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా స్థానిక సంస్థలలో లాభదాయకమైన పదవులు అనుభవిస్తున్న వారు అనర్హులు. పోటీ చేసే ముందు అలాంటి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.


* జీతభత్యాలు ఇలా..

పార్లమెంటు అధికారుల జీతాలు, అలవెన్సుల చట్టం, 1953 మేరకు దేశ ఉపరాష్ట్రపతి జీతాన్ని నిర్ణయిస్తారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. కాబట్టి స్పీకర్ జీతం, ప్రయోజనాలను అందుకుంటారు. నివేదికల ప్రకారం.. ఉపరాష్ట్రపతికి నెలకు రూ.4 లక్షలు చెల్లిస్తారు. అంతే కాకుండా వారికి వివిధ అలవెన్సులు అందజేస్తారు.


* ఉపరాష్ట్రపతి నివాసం ఎక్కడ?

భారతదేశంలోని న్యూ ఢిల్లీలోని మౌలానా ఆజాద్ రోడ్‌లో ఉన్న భారత ఉపరాష్ట్రపతి అధికారిక నివాసంలో ఉపరాష్ట్రపతి బస చేస్తారు.

మే 1962 నుంచి, న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ రోడ్ నెం.6లోని బంగ్లా భారత ఉపరాష్ట్రపతికి అధికారిక నివాసంగా ఉంటోంది. మొత్తం విస్తీర్ణం 6.48 ఎకరాలు(26,223.41 చ.మీ.). ఈ భవనానికి దక్షిణాన మౌలానా ఆజాద్ రోడ్, తూర్పున మాన్ సింగ్ రోడ్, పశ్చిమాన రాజ్‌పథ్‌కు ఆనుకుని ఉన్న పచ్చని ప్రాంతం సరిహద్దులుగా ఉన్నాయి. విజ్ఞాన్ భవన్‌తో ఉమ్మడి సరిహద్దు గోడ ఉంటుంది.

* ప్రయోజనాలు, అలవెన్సులు

ఉపరాష్ట్రపతి జీతంతో పాటు, వివిధ రకాల రోజువారీ అలవెన్సులకు అర్హులు. ఉచిత వైద్య సంరక్షణ, ఉచిత రైలు, విమాన ప్రయాణం, ల్యాండ్‌లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సేవ వంటి ఇతర ప్రయోజనాలు ఉంటాయి. వారికి వ్యక్తిగత భద్రతతో పాటు సిబ్బంది కూడా ఉంటారు. రాష్ట్రపతి అందుబాటులో లేని సమయంలో.. ఉపరాష్ట్రపతి, అధ్యక్షుడి బాధ్యతలను స్వీకరిస్తే, అధ్యక్షుడి జీతం, ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనంగా రాష్ట్రపతి అన్ని సౌకర్యాలకు పొందేందుకు అవకాశం ఉంటుంది.

First published:

Tags: Vice President Elections 2022, Vice President of India

ఉత్తమ కథలు