Union Budget 2021: వంట గ్యాస్, బంగారంపై గుడ్ న్యూస్ ఫిక్స్.. నిర్మలమ్మ బడ్జెట్ లో ఇంకా ఏమేం ఉన్నాయంటే..

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ (Union Budget 2021) అన్ని రంగాలను ఊరిస్తోంది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో నిర్మలమ్మ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్ లో ఏమేం అంశాలు ఉన్నాయన్న దానిపై పలు విశ్లేషణలు జరగుతున్నాయి.

 • Share this:
  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది గంటల్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత అంచనాలు ఈ బడ్జెట్ పై ఉన్నాయి. కరోనా మహమ్మారి వలన దాదాపుగా అన్ని రంగాలు కూడా కకావిలకం అయ్యాయి. లక్షలాది మంది పౌరులు ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం పెరిగిపోయింది. పారిశ్రామిక రంగాలన్నీ షట్ డౌన్ అయ్యి, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ తరుణంలో వస్తున్న కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలను ఊరిస్తోంది. తమకు బడ్జెట్ లో ఏమేం మేలు జరగబోతోందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో నిర్మలమ్మ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్ లో ఏమేం అంశాలు ఉన్నాయన్న దానిపై పలు విశ్లేషణలు జరగుతున్నాయి.

  నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో వంటగ్యాస్ పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న సంబ్సిడీని ఇంకాస్త పెంచేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. అదే సమయంలో బంగారం దిగుమతులపై ఉన్న పన్నుల శాతాన్ని కూడా తగ్గించనున్నట్టు సమాచారం. పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు ప్రోత్సాహాన్ని అందించడం వల్ల కొండెక్కిన ఆ ఉత్పత్తుల ధరలను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి ఎనిమిది వేల నుంచి పది వేల రూపాయలకు పెంచబోతున్నారు. కిసాన్ రైలు, విమాన సేవల విస్తృతిని ఇంకాస్త పెంచడం వంటివి చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా వైద్య, విద్యుత్ సంబంధిత వస్తువులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను, రక్షణ శాఖ పరికరాలను దేశంలోనే తయారు చేసేలా నిర్ణయాలు ఉండబోతున్నాయి. రైలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.

  పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్మలమ్మ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ లో ఈ మేరకు ప్రతిపాదనలు చేశారట. కొత్తగా కరోనా సుంకాన్ని విధించబోతున్నారు. ఆదాయ పన్ను మినహాయింపుపై కూడా ప్రకటన చేయబోతున్నారు. ఉద్యోగులకు ఈ మేరకు శుభవార్తనే వినిపిస్తారని తెలుస్తోంది. దేశంలో కొత్తగా ఎయిమ్స్, ఐఐటీల ఏర్పాటుతో పాటు టెలికాం లైసెన్స్ ఫీజులు, స్ప్రెక్ట్రం వినియోగ చార్జీల హేతుబద్దీకరణ చేస్తారు. ఇంకా మరెన్నో అంశాలను బడ్జెట్ లో స్థానం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
  Published by:Hasaan Kandula
  First published: