Modi Defines India@100 : దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు(Independence Day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. దాదాపు 83 నిమిషాల మోదీ సుదీర్ఘ ప్రసంగంలో.. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఐదు ప్రతిజ్ఞలతో రాబోయే 25 సంవత్సరాలకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం, మహిళలను గౌరవించడం కోసం స్పష్టమైన పిలుపు ఇవ్వడం, అవినీతి-బంధుప్రీతికి చెక్ పెట్టడం, ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టడం వంటి కీలక అంశాలను ప్రస్తావించారు.
ఈ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కొత్త ప్రభుత్వ పథకం లేదా ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించబడనప్పటికీ...'భారతదేశం@100'ని దృష్టిలో ఉంచుకుని రాబోయే 25 ఏళ్లపాటు దూరదృష్టితో కూడిన ఎజెండాను రూపొందించడంపై మోదీ దృష్టి సారించారు. అందరూ కలిసి ముందుకొచ్చి అభివృద్ధి చెందిన భారత్(Developed India)అనే పెద్ద లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. రాబోయే 25 సంవత్సరాలకు ఐదు ప్రతిజ్ఞలను వివరించారు. 1. భారతదేశం వలసవాద మనస్తత్వాన్ని తొలగించాలని,2. మన మూలాలపై గర్వపడాలని, 3.అభివృద్ధి చెందిన భారతదేశం మాత్రమే లక్ష్యంగా ఉండాలని, 4.దేశప్రజల మధ్య ఐక్యత- కర్తవ్య భావం ఉండాలని, 5.పౌరుల బాధ్యత. భారతదేశం యొక్క వైవిధ్యం దాని బలం అని మోదీ అన్నారు. భారతదేశం "ప్రజాస్వామ్య తల్లి" అని ప్రధాని అన్నారు.
Swamiji Missing : పెళ్లైన మహిళతో స్వామీజీ పరార్..సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు!
నారీ శక్తి ప్రధానమంత్రి ప్రసంగంలో కీలకాంశంగా మారింది. మహిళా ఓటర్లపై బీజేపీ స్పష్టమైన దృష్టి సారించడంతో పాటు గత ఎనిమిదేళ్లుగా మహిళల కోసం మోదీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే, దేశంలో మహిళల పట్ల చూపుతున్న అగౌరవం తనకు చాలా బాధ కలిగించిందని, లింగ సమానత్వం తప్పనిసరి అని ప్రధాని మోదీ లన పంద్రాగస్టు ప్రసంగంలో అన్నారు. "మాట్లాడటం, ప్రవర్తనలోమహిళల గౌరవాన్ని తగ్గించే ఏదీ మనం చేయకపోవడం ముఖ్యం అని ప్రధాని అన్నారు.
అవినీతి, బంధుప్రీతి దేశంలోని అతిపెద్ద సమస్యలని మోదీ అభివర్ణిస్తూ, ప్రజల్లో వీటిపై ద్వేషం పెంచుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడి జైలుకెళ్లిన వారిపై సానుభూతి ఎందుకు ఉంటుందని మోదీ ప్రశ్నించారు. కొందరికి ఇళ్లు లేవని, మరికొందరికి అక్రమంగా సంపాదించిన ఆస్తులను నిల్వ చేసుకునేందుకు స్థలం సరిపోదని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో మనం నిర్ణయాత్మక దశలోకి ప్రవేశిస్తున్నామని.. ఇప్పుడు అవినీతికి పాల్పడిన ఉన్నతమైన లేదా శక్తిమంతులెవరూ తప్పించుకోలేరు అని ప్రధాన మంత్రి అన్నారు. మోదీ వ్యాఖ్యలు....రాజకీయంగా కాంగ్రెస్, RJD మరియు తృణమూల్ కాంగ్రెస్ వంటి వారిపై ప్రధాన దాడిగా పరిగణించబడుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు వేడిని ఎదుర్కొంటుండగా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పలు అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో పాటు ఇటీవల టీఎంసీ నేత పార్థ ఛటర్జీ సహాయకుల నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు
భాయ్-భతిజవాద్ (బంధుప్రీతి) మరియు పరివార్ వాద్ (రాజవంశం) ఇతర పెద్ద సమస్యలని, ఇవి రాజకీయాల నుండి జీవితంలోని ఇతర రంగాలకు విస్తరించాయని, ప్రతిభను దెబ్బతీస్తున్నాయని ప్రధాని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో వంశపారంపర్య రాజకీయాలపై బీజేపీ దాడి చేస్తోంది. దేశంలోని అన్ని సంస్థలలో బంధుప్రీతికి వ్యతిరేకంగా ప్రజలు ధిక్కారస్వరం వినిపించాలని కోరిన మోడీ, రాజవంశ రాజకీయాలను కూడా ప్రజలు తిరస్కరించాలని కోరారు.
దేశం,దాని విజయాల గురించి గర్వపడాలని, ధ్రువీకరణ లేదా విదేశీ సర్టిఫికేట్‌ల అవసరాన్ని తిరస్కరించడం, ముందుకు వెళ్లే మార్గంగా స్వయం సమృద్ధిపై మోదీ మళ్లీ నొక్కిచెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.