ఈ రోజుల్లో కాన్సర్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దురదృష్టమేంటంటే... చాలా మందికి కాన్సర్ సోకినట్లు వెంటనే తెలియదు. అలా తెలియకపోవడం వల్ల దాన్ని నయం చెయ్యడంలో డాక్టర్లు ఫెయిలవుతున్నారు. గోవా సీఎం మనోహర్ పారికర్ విషయంలోనూ అదే జరిగింది. 63 ఏళ్ల ఆయనకు వచ్చినది క్లోమ గ్రంథి కాన్సర్. అది సోకిందన్న విషయం ఆయనకు ఆలస్యంగా తెలిసింది. వెంటనే అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు ఇండియా వచ్చి ఢిల్లీ ఎయిమ్స్, గోవా, ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కంటిన్యూగా అనారోగ్యంతో పోరాడారు. చివరకు నోటితో కాకుండా... ముక్కు నుంచీ లోపలికి అమర్చిన పైప్ తోనే ఆహారం తీసుకున్నారు. అలా కాన్సర్‌తో పోరాడుతూ... ప్రభుత్వ కార్యక్రమాల్ని కొనసాగించడం గొప్ప విషయం. మహమ్మారి కాన్సర్ ఆయన్ని పట్టుకుపోయింది.
పాంక్రియాటిక్ కాన్సర్ అంటే : క్లోమ గ్రంథిలోని మృదుజాలంపై కాన్సర్ కణాలు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ క్లోమ గ్రంథి అనేది... పొట్ట వెనక భాగంలో... వెన్నెముకకు ముందు భాగంలో ఉంటుంది. మనోహర్ పారికర్ ఏడాది పాటూ కాన్సర్‌తో పోరాడారు. ప్రపంచంలో ఇలాంటి కేన్సర్ వచ్చి, దానితో పోరాడి గెలిచిన వారు 3 నుంచీ 5 శాతమే ఉన్నారు. కాన్సర్పై గెలిచినా, ఆ తర్వాత మహా అయితే ఐదేళ్లకు మించి ఎవరూ బతకలేదు.
క్లోమ గ్రంథిలోని బ్యాక్టీరియా ఓ కణతి (పుండు లాంటిది)ని ఏర్పాటు చేస్తాయి. అది ఎంత ఎక్కువగా ఉంటే, కాన్సర్ వ్యాధి అంతలా ముదురుతుందని IANS జరిపిన పరిశోధనలో తేలింది. దురదృష్టం ఏంటంటే... ఆ బ్యాక్టీరియాను చంపేందుకు వాడే మందులను కూడా ఆ బ్యాక్టీరియా తట్టుకొని మరింత శక్తిమంతం అవుతోంది. ఐతే... ఇప్పటికీ పాంక్రియాటిక్ కేన్సర్ ఎలా పుడుతోందన్నది డాక్టర్లకు అంతుచిక్కలేదు. అధికబరువు, స్మోకింగ్, షుగర్ వ్యాధి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
పాంక్రియాటిక్ కాన్సర్ లక్షణాలు :
* ఈ తరహా కాన్సర్ వచ్చినవారికి పొట్ట మధ్యలో, వెన్నెముక మధ్యలో నొప్పి వస్తూ ఉంటుంది.
* పచ్చ కామెర్లు (కళ్లు రంగు మారడం)
* ఒత్తిడి
* విపరీతంగా బరువు తగ్గుట
పాంక్రియాటిక్ కాన్సర్‌ను ఎలా గుర్తిస్తారు :
* MRI
* CT scan
* లాప్రోస్కోపీ (Laparoscopy)
* ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ (ERCP)
* బయాప్సీ (Biopsy)
చూశారా... ఆరోగ్యమే మహా భాగ్యం అన్నది అందుకే. ఎంత డబ్బున్నా... ఇలాంటి వ్యాధులు వస్తే... పోరాడి గెలవడం అతి పెద్ద సవాల్. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారం తినాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Goa, Manohar parrikar