హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Toycathon 2021: టాయ్‌కథాన్‌లో చేరారా? రూ.50 లక్షలు గెలిచే ఛాన్స్.. పూర్తి వివరాలివే

Toycathon 2021: టాయ్‌కథాన్‌లో చేరారా? రూ.50 లక్షలు గెలిచే ఛాన్స్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Toycathon 2021: అసలు టాయ్‌కథాన్ అంటే ఏంటి? అది ఎందుకు? కేంద్ర ప్రభుత్వంలోని ఏయే శాఖలు అందులో పాల్గొంటున్నాయి? అన్ని విషయాలూ ఇప్పుడు తెలుసుకుందాం.

  Toycathon 2021: టాయ్‌కథాన్... ఈ పేరు ఏదో హ్యాకథాన్, మారథాన్ లాగా అనిపిస్తోంది కదూ. ఇది అలాంటిది కాదు. మరో రకం. ఇది టాయ్ హ్యాకథాన్. విద్యార్థులు, బొమ్మల తయారీ దారులు, డిజైన్ నిపుణులు, స్టార్టప్స్ అందరూ కలిసి తమ తమ ఆలోచనలను పంచుకుంటూ... బొమ్మలు, గేమ్స్ తయారుచేయడమే ఇది. ఇందులో చేసే బొమ్మలు, సృష్టించే గేమ్స్ అన్నీ మన ఇండియన్ కల్చర్‌, మన సంప్రదాయాలు, ఆచారాలు, మన ఆటలకు తగ్గట్టుగా ఉంటాయి. మన భారతీయ మూలాలను అందరికీ పరిచయం చేసేలా ఉంటాయి. దీన్ని కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ కలిసి ప్రారంభించారు. దీని వల్ల ఇక మనం విదేశాల నుంచి అర్థం పర్థం లేని బొమ్మలను దిగుమతి చేయించుకొని... వాటిని పిల్లలు వాడి, వాటిలోని హానికరమైన కెమికల్స్ వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం తప్పుతుంది. అంతేకాదు... దేశీయంగా పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. దేశీయ బొమ్మల పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే... ఆత్మ నిర్భర భారత్, వోకల్ ఫర్ లోకల్ సందేశాలకు అర్థం ఏర్పడనుంది.

  Toycathon 2021 లక్ష్యాలు:

  - దీని ప్రధాన ఉద్దేశం బొమ్మలు, గేమ్స్‌కి ఇండియాని ప్రపంచ కేంద్రంగా మార్చడం. దేశంలో వాడే బొమ్మలన్నీ దేశంలోనే తయారయ్యేలా చెయ్యడం. స్థానికంగా బొమ్మలు తయారయ్యేలా చేయడం.

  Toycathon ఏం చేస్తుంది:

  - భారతీయ విలువలు, సంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా అందుకు తగిన బొమ్మలు తయారుచేస్తారు. తద్వారా పిల్లల్లో సత్ప్రవర్తనను తీసుకొస్తారు.

  - భారత 100 కోట్ల డాలర్ల బొమ్మల మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లడం.

  - 33 కోట్ల మంది విద్యార్థుల సరికొత్త ఆలోచనలను అందిపుచ్చుకోవడం.

  - స్కూల్ పిల్లలు సరికొత్తగా బొమ్మలు తయారుచేయడం, వాళ్లే డిజైన్లు సృష్టించడం, సరికొత్త బొమ్మల తయారీలో వాళ్లు కీలకం కావడం.

  ఇందులో చేరాలనుకునే పిల్లలు, టీచర్లు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్కనున్న లింక్ క్లిక్ చెయ్యాలి. https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1686270


  Toycathonలో పాలుపంచుకునే కేంద్ర శాఖలు:

  - మహిళా శిశు సంక్షేమ శాఖ

  - సమాచార ప్రసార శాఖ

  - విద్యా శాఖ

  - వాణిజ్య పరిశ్రమల శాఖ

  - చిన్న, మధ్యతర పరిశ్రమల శాఖ

  - టెక్స్‌టైల్ శాఖ

  - విద్యాశాఖలోని ఇన్నోవేషన్ సెల్

  - DIPP

  Toycathonలో పాల్గొనే దశలు:

  ఇందులో 3 దశల్లో పాల్గొనేందుకు వీలుంది. అవి

  + జూనియర్ లెవెల్ (Junior Level)

  + సీనియర్ లెవెల్ (Senior Level)

  + స్టార్టప్ లెవెల్ (Start-up Level)

  ఇందులో కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లు పాల్గొనవచ్చు. స్టార్టప్ కంపెనీలు, టాయ్ ఎగుమతిదారులు పాల్గొంటారు. పాల్గొనేవారికి రెండు ఆప్షన్లు ఉంటాయి. వారు పబ్లిష్ చేసిన సమస్యలకు ఐడియాలు ఇవ్వొచ్చు. లేదా టాయ్ కాన్సెప్టుల కేటగిరీలో చేరవచ్చు.

  Toycathon ధీమ్స్: ఇందులో ప్రత్యేక 9 థీమ్స్ ఉన్నాయి. అవి

  1. భారతీయ సంస్కృతి

  2. చరిత్ర

  3. భారత దేశంపై నాలెడ్జ్, నీతి, నియమాలు

  4. నేర్చుకోవడం, నేర్పించడం, స్కూలింగ్ చేయడం

  5. సామాజిక, మానవత్వ విలువలు

  6. వృత్తులు, ప్రత్యేక రంగాలు

  7. పర్యావరణం, దివ్యాంగులు

  8. ఫిట్‌నెస్, క్రీడలు

  9. వాటితోపాటూ క్రియేటివ్, లాజికల్ ఆలోచనలు, భారతీయ పాత బొమ్మలను తిరిగి కనిపెట్టుట, తిరిగి తయారుచేయుట.


  Registration and Idea Submission:

  - ఇందులో పాల్గొనేవారు వెబ్‌సైట్ హోమ్ పేజీకి వెళ్లి థీమ్స్‌లో ఉన్న ప్లాబ్లం స్టేట్‌మెంట్స్‌లో చేరవచ్చు.

  - ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ తనకు సరైనది అని అనిపిస్తే, దానికి తగిన ఐడియా ఉంది అనిపిస్తే, వారు అందులో చేరుతూ... ఇంకా ఏం చెయ్యాలో, అక్కడున్న వివరాలు తెలుసుకోవాలి. వారి ఐడియాను సబ్‌మిట్ చెయ్యాలి.

  - ఇలా ఐడియా సబ్‌మిట్ చేయడానికి చివరి తేదీ జనవరి 20, 2021

  Prizes:

  సరైన ఐడియాలు పంపిన వారు రూ.50 లక్షల దాకా గెలుచుకుంటారు. వారిని విన్నర్లుగా ప్రకటిస్తారు.

  Important Dates & Timelines: ముఖ్యమైన తేదీలు

  - ప్రారంభమైన తేదీ జనవరి 5

  - ఆన్‌లైన్‌లో ప్రపోజల్స్ అడిగిన తేదీ - 5-20 జనవరి

  - ఐడియాలను ప్రాసెస్ చేసే తేదీలు - జనవరి 21 నుంచి ఫిబ్రవరి 8 వరకు

  - ఐడియాలను ప్రకటించే తేదీ - ఫిబ్రవరి 12

  - గ్రాండ్ ఫినాలే జరిగే తేదీ - ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు.

  Weblink:

  ఇది అధికారిక టాయ్‌కథాన్ ఈవెంట్ వెబ్ లింక్ - https://toycathon.mic.gov.in.

  ఇది కూడా చదవండి: Green Peas Health Benefits: బఠాణీలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

  Social Media Handle: సోషల్ మీడియాలో మీరు చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి. https://instagram.com/mhrd.innovationcell?igshid=1le3mya0lrlrp సమయం ఎక్కువ లేదు. త్వరగా రిజిస్టర్ అవ్వండి.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: National News, VIRAL NEWS

  ఉత్తమ కథలు