Home /News /national /

WHAT IS NANO UREA KNOW MORE ABOUT IMPORTANCE OF IFFCO NANO LIQUID UREA IN AGRICULTURE SK

Nano Urea: ఈ ఒక్క బాటిల్‌లోనే 50 కేజీల యూరియా.. పంటకు బలం.. రైతులకు వరం.. ఆ కష్టాలుండవు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nano Urea: సాధారణంగా 50 కేజీల యూరియా బస్తాలను పొలాలకు తీసుకెళ్లాలంటే రైతులు ఎంతో కష్టపడాలి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోల్లో తీసుకెళ్లడం వల్ల శ్రమతో పాటు అదనపు భారం పడేది. కాని నానో యూరియా వల్ల ఇలాంటివేమీ ఉండవు.

    వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు.. రైతులు (Farmers) విత్తనాలు, ఎరువుల కోసం ఫర్టిలైజర్స్ షాప్‌ (Fertilizers Shops)ల చుట్టూ తిరుగుతుంటారు. ముఖ్యంగా యూరియా కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. బస్తాలకు బస్తాలు యూరియా సేకరించి.. ఇంట్లో భద్రపరిచి.. వాటిని పొలానికి తీసుకెళ్లి.. పంటకు చల్లుతుంటారు. యూరియా రూపంలో పంటకు పోషకాలను అందించి.. మంచి దిగుబడి వచ్చేందుకు.. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే పంటకు పోషకాలకు సంబంధించి కొత్త టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.  ఇకపై రైతులు పెద్ద పెద్ద బస్తాలను మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. యూరియాకు కొత్త రూపం తీసుకొచ్చారు. దానిని నానో యూరియా (Nano Urea)గా పిలుస్తున్నారు. Indian Farmers Fertiliser Cooperative (IFFCO) దీనిని అభిృద్ధి చేసింది.  ఇది పంట దిగుబడికి పెంచడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు రైతుకు శ్రమను కూడా తగ్గిస్తుంది.

     President Salary: రాష్ట్రపతి శాలరీ ఎంత? రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి సౌకర్యాలుంటాయి?

    ఈ నానోటెక్నాలజీ యుగంలో ఒక బస్తా యూరియా..  ఒక్క  బాటిల్‌లోనే ఉంటుంది.  రైతులు ప్రస్తుతం వాడుతున్న 50 కేజీల యూరియాకు బదులు ఒక్క బాటిల్‌ వాడితే సరిపోతుందన్న మాట.   500 మి.లీ. నానో యూరియా బాటిల్ రూ.250కే  లభిస్తోంది.  ఇది సాధారణ యూరియా కంటే పంటలకు ఎక్కువ పోషకాలను అందిస్తుంది.



    నానో యూరియాను తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని ఇచ్చే పోషకమని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు.  నానో యూరియా వినియోగం  చాలా సులభంగా ఉంటుంది. సాధారణంగా 50 కేజీల యూరియా బస్తాలను పొలాలకు తీసుకెళ్లాలంటే రైతులు ఎంతో కష్టపడాలి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోల్లో తీసుకెళ్లడం వల్ల శ్రమతో పాటు అదనపు భారం పడేది. కాని నానో యూరియా వల్ల ఇలాంటివేమీ ఉండవు. బాటిల్‌ను జేబులో పెట్టుకొని తీసుకెళ్లొచ్చు.   2-4 మి.లీ. నానో యూరియా లిక్విడ్‌ను లీటరు నీటికి కరిగించి స్ప్రేయర్ సహాయంతో పంటలపై పిచికారీ చేయాలి. నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల పంట, నేల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా నేలలో నీటి నాణ్యత కూడా మెరుగుపడుతుంది.



    నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఎకో ఫ్రెండ్లీ యూరియా. పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.  నానో యూరియాను పంటలపై పిచికారీ చేయడం.. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో చాలా సహాయపడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నానో యూరియాను మొక్కజొన్న, పత్తితో పాటు  94 పంటలకు వినియోగించవచ్చు. సాధారణ యూరియాతో పోల్చితే.. ఈ నానో యూరియా వాడడం వల్ల పంటల దిగుబడిలో 8శాతం పెరుగుదల ఉంటుంది.  దీని వల్ల రైతులకు శ్రమ, ఖర్చులు తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా పెరుగుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agriculture, Farmers

    తదుపరి వార్తలు