కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్, 2020 తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు ఏడాది పాటు నిరసనలు చేపట్టారు. గణతంత్రడుకల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పలు రాష్ట్రాలు బీజేపీ, బీజేపీ ఏతర పార్టీ ముఖ్యమంత్రులు సైతం ఈ చట్టాలను సమర్థించారు. కానీ ఏడాది ఢిల్లీ పరిసర రాష్ట్రాల రైతులు మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మొదట్లో ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాక ఇటు ప్రభుత్వం, ఆటు రైతుల సంఘాలు చట్టలపై మొండిగా వ్యవహరించాయి. అనూహ్యంగా నవంబర్ 19, 2021న ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులను ఒప్పించ లేకపోయామని అందుకోసం వాటిని రద్దు చేస్తున్నామని అన్నారు. అసలు ప్రభుత్వం తెచ్చిన చట్టాలు ఏంటీ.. వాటిని రైతులు ఎందుకు వద్దాన్నారు?
చట్టాలు.. ప్రభుత్వ వాదన
మొదటి చట్టం నిత్యవసర సరకుల చట్టం (ది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 2020. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం- 1955కి కొన్ని సవరణలు చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. రెండో చట్టం 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార చట్టం. మూడోది రైతులకు ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020 అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ - 2020.
Online Course: కంప్యూటర్ సైన్స్ టీచింగ్ స్కిల్స్‌పై ఆన్‌లైన్ కోర్స్.. ఫీజు, దరఖాస్తు విధానం
ఈ మూడు చట్టాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు రాష్ట్రాల మధ్య ఎలాంటి అవరోధాలులేని వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చుననీ, మొదటిసారిగా రైతులు వారి ఉత్పత్తులను వారికి ఇష్టమైన చోట అమ్ముకునే స్వేచ్ఛ వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా రైతులు ఎవరితో అయిన కాంట్రాక్టు ఒప్పందం మీద వ్యవసాయ చేయవచ్చు. ఒప్పందానికి చట్ట బద్దతను కల్పిస్తామని తెలిపింది. దీని ద్వారా రైతులు ఎక్కువ లాభం వస్తుందని తెలిపింది.
రైతులు వ్యతిరేకతకు కారణం..
ప్రభుత్వం చెబుతున్న స్వేచ్ఛ వాణిజ్యంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. కారణం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (Agricultural produce market committee) నుంచి వైదొలగడం ప్రధాన కారణం. దీని ద్వారా ఉత్పత్తులు ఎవరు కొనకుంటే కనీస ధర దొరకదు అనే భయాన్ని కలిగించింది. తాము నష్టపోతామే భావన ఏర్పడింది. కారణం బీహార్‌లో ప్రభుత్వం చాలా కాలంగా ఏపీయంసీలో నుంచి వైదొలిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మినిమమ్ సపోర్ట్ ప్రైజ్ ఉండదు. రైతులే ఎవరో ఒకరికి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రలతో పోలిస్తే బీహార్ రైతులు తక్కువ ధరకు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తుంది.
ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయోత్పత్తులు, వాణిజ్యం, వ్యాపార సవరణ చట్టం-2020, నిత్యావసర వస్తువుల సవరణ చట్టం-2020, ఒప్పంద సాగు కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టం-2020లు ఫెడరల్ సూత్రాలను వ్యతిరేకించడమే కాక, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత నుంచి తప్పుకొనేలా ఉన్నట్టు రైతుల్లో భయం నెలకొంది.
రైతులకు మార్కెట్ స్థాయి లేకపోవడం..
కార్పొరేట్ సూత్రాల ప్రకారం వ్యవసాయ చట్టం లాభదాయకం.. కానీ ఒక మారు మూల పల్లె రైతు తన పంటను మార్కెట్ చేసుకొనే సామర్థ్యాన్ని ఎలా పొందుగలుగుతాడు. అతని భయాల్ని ఎవరు పరిష్కరించాలి. ఒక వేళ పంట సాగుకు ముందు ఎవరూ కొనడానికి రాకుంటే ఇక పంట వేయకూడదా.. ? పంట వేశాక ఎవరూ కొనకుంటే.. ఎవరు దిక్కు? వీటికి సమాధానాలు రైతులకు దొరక లేదు.
దళారుల వ్యవస్థ.. మార్కెట్ వర్గాల దోపిడీ నుంచి వ్యవసాయ చట్టాలు కాపాడుతాయని ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తమే అనుకున్నా.. రైతులు తమను ప్రభుత్వాలు పట్టించుకోవు అనే భయాన్ని కలిగించింది. రైతులు తమ పంట ఖచ్చితంగా కొనడానికి ఒకరు ఉండాలి.. లేకుంటే తాము అన్యాయం అయిపోతాం అని భావనలోకి వచ్చారు.
అనంతరం కేంద్రం ఎంఎన్‌సీ ఇస్తానని చెబుతున్నా.. అది కచ్చితంగా తక్కువ ధర ఉంటుంది అని రైతులు భావించారు. ఈ చట్టాల ద్వారా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా కార్పొరేట్ వ్యాపారులు, వ్యవసాయ వ్యాపారులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తులను కొని, అత్యవసర సమయాల్లో వాటిని దాచిపెట్టగలిగే అవకాశాన్ని కల్పిస్తుందని.. అంతే కాకుండా రైతు చట్టాలు.. వ్యవసాయాన్ని వ్యాపారంగా మారుస్తున్నాయని చాలా మంది వాదించారు.
దీంతో రైతులు ప్రభుత్వం ఎన్ని చెప్పినా వారి భయాలకు సమాధానం దొరకలేదు. ఇప్పటికే ఏడాదిగా రైతులు ఆందోళన చేస్తుండడంతో ప్రధాని ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై సంస్కరణ వాదులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయినే ప్రజాస్వామ్యంలో ఇలాంటి అవసరం అని.. ప్రజలు పోరాడితే ప్రభుత్వాలు దిగి వస్తాయనే అభిప్రాయం పెరగడం మంచిదని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farm Laws