ఆ నల్ల ట్రంకు పెట్టెలో ఏముంది... నరేంద్ర మోదీపై కర్ణాటక ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్....

Narendra Modi Black Box : చిత్రదుర్గలో మోదీ హెలికాప్టర్‌ నుంచీ అనుమానాస్పదంగా ఉన్న ఒక పెట్టెను దించి, ఆ ప్రైవేటు ఇన్నోవాలోకి చేర్చాక అది అక్కడి నుండీ వేగంగా వెళ్ళిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 6:54 AM IST
ఆ నల్ల ట్రంకు పెట్టెలో ఏముంది... నరేంద్ర మోదీపై కర్ణాటక ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్....
బ్లాక్ బాక్స్ వీడియోలో దృశ్యాలు (Image : Twitter)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీపై కర్ణాటక కాంగ్రెస్‌ శాఖ ఆదివారం ఎలక్షన్ కమిషన్‌కు కంప్లైంట్ ఇచ్చింది. నరేంద్ర మోదీ గత వారం ఒక ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి కర్ణాటకలోని చిత్ర దుర్గకు వెళ్ళారు. మోదీ తన హెలీకాప్టర్‌లో ఓ నల్ల ట్రంకు పెట్టెను తీసుకెళ్ళారు. ఆ పెట్టలో ఏముంది... దాన్ని ఎందుకు తీసుకెళ్లారో తేల్చాలంటూ... కాంగ్రెస్ తన కంప్లైంట్‌లో కోరింది. దీనిపై కంప్లీట్ ఎంక్వైరీ జరిపించాలని కాంగ్రెస్ నేత ఆనంద్‌ శర్మ ఎలక్షన్ కమిషన్‌ను డిమాండ్‌ చేశారు. దీనిపై మోదీ వివరణ ఇవ్వాలని కూడా అడిగారు. చిత్రదుర్గకు వెళ్లినప్పుడు మోదీ హెలికాప్టర్‌కు రక్షణగా మరో మూడు విమానాలు వెళ్ళాయి. అవి కిందకు దిగగానే... నల్లటి ట్రంకు పెట్టెను... బయటకు తీసి ఓ ప్రైవేట్‌ కారులోకి చేర్చారు. ఆ తర్వాత ఆ కారు అక్కడి నుంచీ వేగంగా దూరంగా వెళ్ళిపోయింది. అది కాన్వాయిలో ఉన్న కారు కాదని ఆనంద్ శర్మ అంటున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన 14 సెకండ్ల డ్యూరేషన్ ఉన్న ఒక వీడియోను కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు శనివారం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. మోదీ భద్రతా సిబ్బందిలోని ఇద్దరు వ్యక్తులు ఆ ట్రంకు పెట్టెను హెలికాప్టర్‌ నుంచీ కిందకు దించి SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) కారులో చేర్చిన దృశ్యం ఆ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది.

central election commission,election commission of india,evm,priyanka gandhi,lok sabha election 2019,lok sabha elections 2019,lok sabha elections,lok sabha election,india lok sabha election 2019,lok sabha,lok sabha election 2019 opinion poll,2019 lok sabha elections,loksabha election 2019,lok sabha elections live,lok sabha 2019 elections,election 2019,lok sabha election news,lok sabha elections live news,2019 lok sabha election,andhra pradesh lok sabha election 2019,andhra pradesh lok sabha elections 2019,andhra pradesh lok sabha elections,ap lok sabha election,ap india lok sabha election 2019,ap lok sabha,lok sabha election 2019 opinion poll,andhra pradesh 2019 lok sabha elections,andhra pradesh loksabha election 2019,ap lok sabha elections live,andhra pradesh lok sabha 2019 elections,ap election 2019,ap lok sabha election news,ap lok sabha elections live news,andhra pradesh 2019 lok sabha election,లోక్ సభ ఎన్నికలు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,ఏపీ ఎన్నికలు,స్ట్రాంగ్ రూం,చంద్రబాబు,ఈవీఎం,వీవీప్యాట్లు,కేంద్ర ఎన్నికల సంఘం,
బ్లాక్ బాక్స్ వీడియోలో దృశ్యాలు (Image : Twitter)

చిత్రదుర్గలో మోదీ హెలికాప్టర్‌ నుంచీ అనుమానాస్పదంగా ఉన్న ఒక పెట్టెను దించి, ఆ ప్రైవేటు ఇన్నోవాలోకి చేర్చాక అది అక్కడి నుండీ వేగంగా వెళ్ళిపోయింది. ఆ పెట్టెలో ఏముంది, దానిని తీసుకెళ్ళిన వాహనం ఎవరిది అనే విషయాలను ఎన్నికల కమిషన్‌ విచారణ జరపాలి అని గుండూరావు కర్ణాటక చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను కోరుతూ ట్వీట్‌ చేశారు.

central election commission,election commission of india,evm,priyanka gandhi,lok sabha election 2019,lok sabha elections 2019,lok sabha elections,lok sabha election,india lok sabha election 2019,lok sabha,lok sabha election 2019 opinion poll,2019 lok sabha elections,loksabha election 2019,lok sabha elections live,lok sabha 2019 elections,election 2019,lok sabha election news,lok sabha elections live news,2019 lok sabha election,andhra pradesh lok sabha election 2019,andhra pradesh lok sabha elections 2019,andhra pradesh lok sabha elections,ap lok sabha election,ap india lok sabha election 2019,ap lok sabha,lok sabha election 2019 opinion poll,andhra pradesh 2019 lok sabha elections,andhra pradesh loksabha election 2019,ap lok sabha elections live,andhra pradesh lok sabha 2019 elections,ap election 2019,ap lok sabha election news,ap lok sabha elections live news,andhra pradesh 2019 lok sabha election,లోక్ సభ ఎన్నికలు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,ఏపీ ఎన్నికలు,స్ట్రాంగ్ రూం,చంద్రబాబు,ఈవీఎం,వీవీప్యాట్లు,కేంద్ర ఎన్నికల సంఘం,
బ్లాక్ బాక్స్ వీడియోలో దృశ్యం (Image : Twitter)

ఇప్పుడీ అంశం కలకలం రేపుతోంది. మరి ఈసీ ఈ మిస్టరీని ఛేదిస్తుందో లేదో రెండ్రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

నేడు సీఈసీ ముందుకు టీడీపీ టెక్నికల్ టీం... EVMల ట్యాంపరింగ్ నిరూపిస్తారా...

ఏపీ లోక్ సభ ఓట్లను ఎక్కడ లెక్కిస్తారంటే... ఇవిగో ఈసీ వివరాలు...
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>