హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

DigiYatra: డిజియాత్ర అంటే ఏమిటి? ఫేస్‌, బోర్డింగ్ పాస్‌లా ఎలా పనిచేస్తుంది?  ఈ సర్వీస్‌ ఫుల్‌ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి.

DigiYatra: డిజియాత్ర అంటే ఏమిటి? ఫేస్‌, బోర్డింగ్ పాస్‌లా ఎలా పనిచేస్తుంది?  ఈ సర్వీస్‌ ఫుల్‌ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని రోజుల క్రితమే పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా డిజియాత్ర సేవలను లాంచ్‌ చేశారు.  విమాన ప్రయాణికులకు బెస్ట్‌ ట్రావెలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు ఈ ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నానలజీ బేస్డ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

DigiYatra : త్వరగా గమ్యాన్ని చేరుకునేందుకు ఎక్కువ మంది ఫ్లైట్‌ జర్నీ సెలక్ట్ చేసుకుంటారు. అయితే డొమెస్టిక్‌ ఫ్లైట్‌ల విషయంలో జర్నీ కంటే ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ, సెక్యూరిటీ చెక్‌, బోర్డింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంటుంది. ఈ క్రమంలోనే ఫ్లైట్‌ ప్యాసింజర్‌లకు సమయాన్ని ఆదా చేయడానికి కేంద్రం డిజిటల్‌ సర్వీస్‌ డిజియాత్ర(DigiYatra)ను లాంచ్‌ చేసింది. కొన్ని రోజుల క్రితమే పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా డిజియాత్ర సేవలను లాంచ్‌ చేశారు. విమాన ప్రయాణికులకు బెస్ట్‌ ట్రావెలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు ఈ ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నానలజీ బేస్డ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కొత్త డిజిటల్ సర్వీస్‌ వల్ల విమాన ప్రయాణికులు ఎలాంటి ఐడీకార్డ్‌ అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. ఫేస్‌ ఐడీ ప్రూఫ్, వ్యాక్సిన్ ప్రూఫ్, బోర్డింగ్ పాస్ వంటి డాక్యుమెంట్‌గా ఇది పని చేస్తుంది. డిజియాత్ర గురించి మనీకంట్రోల్‌ అందించిన పూర్తి వివరాలు ఇలా..

డిజియాత్ర సర్వీస్‌ అంటే ఏంటి?

డిజియాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ లేదా ఎఫ్‌ఆర్‌టీ సిస్టమ్. ఇది ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండానే ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. ఎంట్రీ, సెక్యూరిటీ చెక్-ఇన్, బోర్డింగ్ గేట్‌ వద్ద ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా ప్రయాణీకుల డేటా ఆటోమేటిక్‌గా ప్రాసెస్‌ అవుతుంది. డొమెస్టిక్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి, ప్రయాణీకులు తప్పనిసరిగా డిజియాత్ర యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆధార్ బేస్డ్ వ్యాలిడేషన్‌, సెల్ఫ్‌ ఇమేజ్‌ క్యాప్చర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఈ యాప్‌ Android, iOS వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది.

ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి?

ముందుగా ప్రయాణికులు ఆధార్ బేస్డ్‌ వ్యాలిడేషన్‌, సెల్ఫీ ఇమేజ్‌ క్యాప్చర్‌ ఉపయోగించి డిజియాత్ర యాప్‌లో తమ సమాచారాన్ని రిజిస్టర్‌ చేసుకోవాలి. పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఐడెంటిఫికేషన్‌ వివరాలు (ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ మొదలైనవి) ఎంటర్‌ చేయడం ద్వారా సెంట్రల్‌ సిస్టమ్‌లో డిజియాత్ర ఐడీని క్రియేట్‌ చేసుకోవచ్చు.

* ప్రాసెస్‌ ఇలా..

1. మొదట Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లో Google Play Store లేదా Apple App Store నుంచి DigiYatra యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఆ తర్వాత ‘గెట్‌ స్టార్డెట్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

3. అనంతరం మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్‌ చేసి, రిజిస్టర్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.

4. ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్‌ చేయాలి.

5. తర్వాత స్క్రీన్ దిగువన ఉన్న ‘వ్యాలెట్’ ఆప్షన్‌పై ప్రెస్‌ చేయాలి.

6. ఐడెంటిటీ క్రెడెన్షియల్ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి.. టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ను యాక్సెప్ట్‌ చేయాలి. అనంతరం ఓకే బటన్‌ ప్రెస్‌ చేయాలి.

7. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ మొదలైన డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్‌ను డిజిలాకర్ అకౌంట్‌ ద్వారా కూడా అప్‌లోడ్‌ చేసే అవకాం ఉంది.

8. అప్‌లోడ్ చేసిన తర్వాత, డిజియాత్ర ID జనరేట్ అవుతుంది.

ఎయిర్‌పోర్ట్‌ ఎంట్రీ వద్ద ఎలా ఉపయోగించాలి?

ప్రయాణీకులు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు డిజియాత్ర ఐడీని మెన్షన్‌ చేయవచ్చు. డిజి యాత్ర ఐడీ సహా ప్రయాణీకుల డేటాను విమానయాన సంస్థలు బయలుదేరే విమానాశ్రయానికి పంపుతాయి.మొదటి సారి ప్రయాణిస్తున్న సమయంలో.. ప్రయాణీకులు IDని ధృవీకరించడానికి విమానాశ్రయంలోని రిజిస్ట్రేషన్ కియోస్క్‌కి వెళ్లాలి. ఆధార్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అయితే ఇతర ధృవీకరణ IDలను CISF మాన్యువల్‌గా ధృవీకరిస్తుంది.

 విమానాశ్రయంలో DigiYatra ID ఎలా పని పనిచేస్తుంది?

ప్రయాణీకులు టికెట్ లేదా బోర్డింగ్ పాస్ (డిజిటల్, ఫిజికల్ రెండూ పని చేస్తాయి) అవసరమైనప్పుడు ఎంట్రీ పాయింట్ వద్ద సమర్పించవలసి ఉంటుంది. ఇ-టికెట్ లేదా బోర్డింగ్ పాస్ స్కాన్ అవుతుంది. బార్‌కోడ్ లేదా QR కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత సిస్టమ్ ప్రయాణీకుల సమాచారం, విమాన సమాచారాన్ని ధృవీకరిస్తుంది. అప్పుడు గుర్తింపును ధృవీకరించడానికి DigiYatra ID ఫేషియల్‌ రికగ్నిషన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ప్రాసెస్‌ కంప్లీట్‌ అయ్యాక ఇ-గేట్ ఓపెన్‌ అవుతుంది. అలాగే ఫేస్ ID, టిక్కెట్ PNR ఒకే టోకెన్‌గా కంబైన్డ్‌ అయి ఉంటాయి. ప్రయాణీకులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించే ఇ-గేట్‌ ద్వారా సెక్యూరిటీ ఏరియాలోకి ప్రవేశించి, విమానం ఎక్కవచ్చు.

డిజిట్‌యాత్ర యాప్‌ సురక్షితమేనా?

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. డిజియాత్ర మొబైల్ యాప్ సురక్షితంగా ఉంది. ప్రయాణీకుల బయోమెట్రిక్ వివరాలు ప్రయాణీకుల స్మార్ట్‌ఫోన్‌లోనే స్టోర్‌ అవుతాయి. ఎవరితోనూ షేర్‌ చేయరు. డిజియాత్రను ఉపయోగించడం పూర్తిగా ఆప్షనల్‌. సాధారణ నాన్-బయోమెట్రిక్ ప్రక్రియ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

AAP : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆప్ .. గుజరాత్‌లో ప్రధాన ప్రతిపక్షం అవుతుందా?

డిజియాత్ర సర్వీస్‌ ఎక్కడ అందుబాటులో ఉంది?

డిజియాత్ర సర్వీస్‌ ప్రస్తుతం ఢిల్లీ , బెంగళూరు, వారణాసి విమానాశ్రయాలలో డొమెస్టిక్‌ విమాన ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంది.

మరో నాలుగు విమానాశ్రయాలు .. హైదరాబాద్ , కోల్‌కతా, పూణే, విజయవాడలో 2023 మార్చి నాటికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు.

డిజియాత్ర సర్వీస్‌ ప్రయోజనాలు

ప్రయాణీకులు బోర్డింగ్ పాస్ లేదా IDని మల్టిపుల్‌ చెక్‌పోస్టుల వద్ద చూపించాల్సిన అవసరం లేదు. క్యూలో ఎక్కువ సమయం నిల్చోవాల్సిన పని లేదు. సిస్టమ్ ప్రయాణీకులను PNRతో మ్యాప్ చేస్తుంది కాబట్టి మెరుగైన సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి చెక్‌పాయింట్ వద్ద అర్హత ఉన్న ప్రయాణీకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లకు ప్రయాణీకుల సంఖ్యపై రియల్‌టైం డేటా ఉంటుంది. రిసోర్సెస్‌ ప్లానింగ్‌ బావుంటుంది.

First published:

Tags: Technolgy

ఉత్తమ కథలు