Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యంపై కేజ్రీవాల్ రాజీ లేని పోరాటం.. దేశం నేర్చుకోవాల్సిన విషయాలివే..

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీని కలుష్యభూతం వణికిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దుమ్ము సమస్య అక్కడి ప్రజలకు బాగా ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమ్యల పరిష్కారానికి సీఎం కేజ్రీవాల్ అనేక కీలక చర్యలు చేపట్టారు.

news18-telugu
Updated: October 22, 2020, 11:39 AM IST
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యంపై కేజ్రీవాల్ రాజీ లేని పోరాటం.. దేశం నేర్చుకోవాల్సిన విషయాలివే..
పంట వ్యర్థాలను నాశనం చేసేందుకు బయో డికంపోసర్ స్ప్రే చేస్తున్న దృశ్యం
  • Share this:
దేశ రాజధాని ఢిల్లీని కలుష్య భూతం వణికిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దుమ్ము సమస్య అక్కడి ప్రజలకు బాగా ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనేక కీలక చర్యలు చేపట్టారు. 'Yuddh. Pradushan ke Viruddh' అనే కార్యక్రమం చేపట్టి కాలుష్యానికి వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దుమ్ము వ్యతిరేక ప్రచారం, బయో డికంపోసర్ విధానం, ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ విధానం, ఎలక్ట్రికల్ వాహనాల పాలసీని తీసుకువచ్చారు. ప్రతీ ఏటా ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో రైతులు అనేక ఎకరాల్లో పంట వ్యర్థాలను కాల్చుతారు. ఈ చర్య అక్కడ కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. ఈ సమస్య పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.

డీ కంపోసింగ్ విధానం..

ఢిల్లీకి చెందిన పూసా ఇనిస్ట్యూట్ పంటను కాల్చడానికి బదులుగా బయో డికంపోసర్ విధానాన్ని అభివృద్ధి చేసి పరీక్షించింది. పెద్ద పెద్ద మంటలకు బదులుగా చాలా సులువుగా పంట వ్యర్థాలను ఈ విధానంతో నాశనం చేయవచ్చు. ఈ విధానాన్ని ఉచితంగా రైతులకు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సమీప రాష్ట్రాల ప్రభుత్వాలను సైతం ఇలా చేయాలని కోరుతోంది.

Smog Towers and Anti-smog Guns..
కానాట్ ప్లేస్ వంటి అధికంగా కాలుష్య సాంద్రత ఉన్న ప్రాంతాల్లో "స్మోగ్ టవర్స్" ను స్థాపించడానికి ఢిల్లీ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం రూ. 20 కోట్లను ఇందుకోసం మంజూరు చేసింది. ఇది స్వచ్ఛమైన గాలిని అందించేందుకు సహాయపతుతోంది. చైనా తర్వాత ఇక్కడ రెండో సారిగా టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. దుమ్మును తగ్గించడానికి Anti-smog Gunsను సైతం ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దుమ్మును తగ్గించడానికి ఈ గన్ లు నీటి బింధువులను స్ప్రే చేయనున్నాయి.

థర్మల్ ప్లాంట్ల మూసివేత..
ఢిల్లోలో కాలుష్యానికి మరో ప్రధాన కారణం థర్మల్ ప్లాంట్లు. ఇవి భారీ మొత్తంలో కాలుష్యాన్ని పర్యావరణంలోకి విడుదల చేస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నగరంలోని రెండు థర్మల్ ప్లాంట్లను ఢిల్లీ ప్రభుత్వం మూసివేసింది. నగరానికి సమీపంలోని మరో 11 ప్లాంట్లను మూసివేయాలని ఆయా రాష్ట్రాలను కోరింది.



అటవీ ప్రాంత పరిరక్షణ..

ఢిల్లీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏదైనా నిర్మాణ సమయంలో తొలగించిన మొక్కల్లో 80 శాతం తిరిగి నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తోంది.

అధిక జరిమానాలు..
దుమ్ము నివారణకు ఢిల్లీ ప్రభుత్వం అందుకు కారణమైన వారిపై భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ఇందు కోసం యాంటీ పొల్యూషన్ వార్ రూమ్ సైతం ఏర్పాటు చేసింది. వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాల పాలసీని సైతం ప్రవేశపెట్టింది. పర్యావరణ రూల్స్ ను పాటించని వారికి భారీ ఫైన్లు వేసేందుకు నిర్ణయించారు. డస్ట్ కంట్రోల్ నిబంధనలు పాటించకుంటే రూ. 20 లక్షల వరకు ఫైన్ విధించనున్నారు. ఇప్పటి వరకు చెత్తను నిబంధనలు పాటించకుండా కాల్చిన వారికి రూ. కోటి వరకు ఫైన్ విధించారు.
Published by: Nikhil Kumar S
First published: October 22, 2020, 11:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading