ఢిల్లీ మంత్రి నివాసంలో సీబీఐ సోదాలు, కేజ్రీ ఫైర్

ఢిల్లీలోని ఆప్ సర్కారు, కేంద్రంలోని మోదీ సర్కారు మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో సీబీఐ తనిఖీలు చేయడంపై ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు.

Janardhan V | news18
Updated: May 30, 2018, 6:15 AM IST
ఢిల్లీ మంత్రి నివాసంలో సీబీఐ సోదాలు, కేజ్రీ ఫైర్
Arvind Kejriwal: File Photo
  • News18
  • Last Updated: May 30, 2018, 6:15 AM IST
  • Share this:
CBI Raids Delhi Minister Satyendar Jain's Residence
Arvind Kejriwal: File Photo


ఢిల్లీలోని ఆప్ సర్కార్, కేంద్రంలోని మోదీ సర్కార్ మధ్య కోల్డ్ వార్ మరింత ముదురుతోంది. పీడబ్ల్యూడీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. పీడబ్ల్యూడీ శాఖలో నిబంధనలను ఉల్లంఘించి అర్కిటెక్ట్స్‌ను తీసుకున్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీబీఐ...ఇందులో భాగంగా మంత్రి నివాసంలో తనిఖీలు చేపట్టారు.

మంత్రి నివాసంతో పాటు పీడబ్ల్యూడీలో పనిచేస్తున్న నలుగురు అధికారులు, మరో ప్రైవేటు వ్యక్తి ఇంటిలోనూ తనిఖీలు చేపట్టి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ఇంటిలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టినట్లు సత్యేందర్ జైన్ ట్వి్ట్టర్‌లో ధృవీకరించారు. ఇప్పటికే మంత్రి సత్యేందర్ జైన్ ఓ మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తన కేబినెట్ సహచరుడి ఇంటిలో సీబీఐ తనిఖీలు చేయడంపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏమి కావాలంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

పీడబ్ల్యూడీ శాఖలో 24 మంది ఆర్కిటెక్ట్స్‌ను తీసుకోవడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. తగిన అనుభవం లేని వారిని అర్కిటెక్ట్స్‌గా తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Published by: Janardhan V
First published: May 30, 2018, 6:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading