హోమ్ /వార్తలు /జాతీయం /

ఈసారి ఎన్నికల్లో కొత్తదనం ఏముంది? కొత్తగా ఏ రూల్స్ తెచ్చారు?

ఈసారి ఎన్నికల్లో కొత్తదనం ఏముంది? కొత్తగా ఏ రూల్స్ తెచ్చారు?

ప్రతీకాత్మక చిత్రం (Image : Twitter)

ప్రతీకాత్మక చిత్రం (Image : Twitter)

Lok Sabha Elections 2019 : ఈసీ కొత్తగా తెచ్చిన రూల్స్ ఏంటో తెలుసుకుందాం. తద్వారా మనమూ వాటిని ఫాలో అవుతూ అప్‌డేటెడ్‌గా ఉండొచ్చు.

    ఓవైపు టెక్నాలజీ అప్ డేట్స్, మరోవైపు సోషల్ మీడియా విశ్వరూపం... అదే సమయంలో అదుపు తప్పే అభ్యర్థులు... ఈ పరిస్థితులన్నీ సెట్ చేసుకుంటూ... ఎన్నికల సంఘం... సజావుగా ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. అందువల్ల ఈసారి సరికొత్త టెక్నాలజీతోపాటూ... కొన్న కొత్త రూల్స్ కూడా తెచ్చింది. వాటిని ఫాలో అవ్వాల్సిన బాధ్యత అభ్యర్థులతోపాటూ... మనందరిపైనా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇకపై అసత్య ప్రచారాలు చెయ్యకూడదు. వివాదాస్పద పోస్టులకు మనం లైకులు, షేర్లూ కొట్ట కూడదు. అలా చేస్తే... మున్ముందు అవి లేనిపోని సమస్యలు తేవొచ్చు. అభ్యర్థులు కూడా ఇదివరకట్లా ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసేయకుండా మంచి వాతావరణంలో విమర్శించుకుంటే చక్కటి ఎన్నికల్ని మనం చూసినట్లవుతుంది.


    కొత్త రూల్స్ ఏంటో చకచకా తెలుసుకుందాం :

    * ఈవీఎంలపై పార్టీ గుర్తుతోపాటూ అభ్యర్థుల ఫొటోలను కూడా ముద్రిస్తారు.

    * తొలిసారిగా లోక్‌ సభ ఎన్నికల్లో వీవీ ప్యాట్‌లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంను వాడబోతున్నారు.

    * 2014లో కంటే ఈసారి 8కోట్ల 43 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు వేయబోతున్నారు.

    * అభ్యర్థులు తమ ఐదేళ్ల ఐటీ రిటర్నులతోపాటూ, పాన్ వివరాలు ఇవ్వాలి. భార్య లేదా భర్తతోపాటూ కుటుంబ సభ్యుల ఆస్తులు వెల్లడించాలి.

    * నోటిఫికేషన్‌లో కొత్తగా తెచ్చిన రూల్ ప్రకారం విదేశాల్లో ఆస్తుల్ని కూడా ప్రకటించాలి.

    * ఫొటో ఓటర్ చీటీలను గుర్తింపు కార్డులుగా అనుమతించరు.

    * ఓటర్ ఐడీతోపాటూ పోల్ ప్యానెల్ చెప్పిన ఇతర 11 రకాల ఐడీ కార్డుల్ని గుర్తించి, ఓటు వేసేందుకు అనుమతిస్తారు. అవి పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఫొటోతో ఉన్న పాస్ బుక్, పాన్ కార్డు, రిజిస్టార్ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ లేదా జీవిత భీమా కార్డు, పెన్షన్ పత్రం, ప్రజాప్రతినిధులు ధ్రువీకరించిన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు.

    * ఎన్నికల్లో వ్యయాల్ని గుర్తించడానికి ఈసీ ప్రత్యేకమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. క్యాష్ సీజ్ విషయంలో సామాన్య ప్రజలకు ఆటంకం కలగకుండా, ముగ్గురు సభ్యులతో కమిటీని వేయబోతోంది. ఈ కమిటీ ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా వ్యవహరిస్తుంది. రాజకీయ పార్టీలు, నాయకులతో సంబంధం లేని వ్యక్తుల నుంచీ సీజ్ చేసిన డబ్బును పరిశీలన తర్వాత తిరిగి ఇస్తారు.

    * అభ్యర్థులు ఉపయోగించే వాహనాలు, మీడియాలో చేయించే ప్రకటనలు, ప్రచారం, పేపర్లలో యాడ్స్, వ్యయాల్ని అభ్యర్థుల సొంత ఖర్చులుగా పరిగణిస్తారు.

    * అభ్యర్థులు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారానికి చేసిన ఖర్చును కూడా ఎన్నికల ఖర్చుల లిస్టులో రాయాలి.

    * ఒక ఎంపీ అభ్యర్థి మాగ్జిమం రూ.70 లక్షలే ఖర్చు పెట్టాలి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో మాత్రం అభ్యర్థి మాగ్జిమరం రూ.54లక్షలే ఖర్చు పెట్టాలి.

    * ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలుంచాలి.

    * ఆన్‌లైన్‌లో కనిపించే పొలిటికల్ యాడ్స్‌కి ఇకపై ముందుగా చెకింగ్ తప్పనిసరి. గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలు... ముందుగా రాజకీయ ప్రకటనను పూర్తిగా చూసి, రూల్స్ ప్రకారం ఉందని అనిపిస్తేనే.... అనుమతించాలి.

    * రాజకీయ ప్రకటనలకు సంబంధించిన కంప్లైట్స్ కోసం ఈసీ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తోంది.


     


    ఇవి కూడా చదవండి :


    హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యమంటే... ఏకంగా చంపేశారు...


    CWC జాబ్ రిక్రూట్‌మెంట్... 571 పోస్టులు... అకౌంటెంట్లు, ట్రాన్స్‌లేటర్లు...


    టీడీపీ - వైసీపీ ... ఏ పార్టీ పథకాలు గొప్పవి ... విజయం ఎవరిది?


    UPSSSC చక్బందీ లెక్పాల్ రిక్రూట్‌మెంట్ : 1,364 జాబ్స్... ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్స్... ఇలా అప్లై చేసుకోండి

    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Election Commission of India, Lok Sabha Election 2019, National News

    ఉత్తమ కథలు