• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • WHAT ABOUT THE PAIN OF 130 BJP FAMILIES AMIT SHAH QUESTIONS MAMATA BANERJEE IN WEST BENGAL CAMPAIGN HSN

West Bengal Assembly Elections 2021: నందిగ్రామ్ ఘటన.. మమతా బెనర్జీకి సూటి ప్రశ్నను సంధించిన హోంమంత్రి అమిత్ షా

West Bengal Assembly Elections 2021: నందిగ్రామ్ ఘటన.. మమతా బెనర్జీకి సూటి ప్రశ్నను సంధించిన హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఆన్ లైన్ ద్వారానే పాల్గొన్న ఆయన సీఎం మమతా బెనర్జీకి సూటి ప్రశ్నలు సంధించారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఎన్నికలు మినీ కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. ఈసారి కూడా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని అధికార టీఎంసీ పార్టీ భావిస్తోండగా, ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పంతం మీద ఉంది. ఈ క్రమంలోనే రాజకీయంగా ఇరు పార్టీల మధ్య ఎత్తులకు పై ఎత్తులతో ఆ రాష్ట్రంలో ప్రచారం హోరెత్తుతోంది. నందిగ్రామ్ లో తనపై దాడి జరిగిందంటూ మమతాబెనర్జీ ఆసుపత్రి పాలయి, రెండు మూడ్రోజుల పాటు చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఆతర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వీల్ చైర్లో కూర్చునే ప్రచారం చేస్తున్నారు. ఆమె ప్రచార తీరుపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఆన్ లైన్ ద్వారానే పాల్గొన్న ఆయన సీఎం మమతా బెనర్జీకి సూటి ప్రశ్నలు సంధించారు.

    ’మీపై దాడి జరిగిందంటూ బాధపడిపోతున్నారు. మరి మీ హయాంలో, మీ పాలనలో దాడులకు గురయి మరణించిన 130 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాల కన్నీటి బాధను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఆ కార్యకర్తలను నమ్ముకుని వాళ్ల కుటుంబాలు ఉన్నాయని మీరెప్పుడైనా గుర్తించారా‘ అంటూ మమతాబెనర్జీని అమిత్ షా నిలదీశారు. వారి మరణాలకు మమతాబెనర్జీయే కారణమని ఆరోపించారు. వాస్తవానికి ఝర్గ్రామ్ సభకు అమిత్ షా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హెలికాఫ్టర్ లో టెక్నికల్ కారణాల వల్ల సభకు హాజరుకాలేకపోయారు. దీంతో ఆన్ లైన్ ద్వారా ఆయన ప్రసంగానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల సంక్షేమానికి వంద కోట్లతో రాబోయే బీజేపీ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెడుతుందని ఈ సందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు.
    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

    కాగా, సోమవారం పూరులియా సభలో మాట్లాడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.. ఈ ఎన్నికల్లో కూడా టీఎంసీయే గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ పథకాన్ని కొనసాగించి తీరుతుందన్నారు. పలు కొత్త సంక్షేమ పథకాలను కూడా ప్రవేశ పెడుతందని ఆమె హామీ ఇచ్చారు. నందిగ్రామ్ ఘటన తర్వాత ఆమె పాల్గొన్న రెండో సభ ఇదే కావడం గమనార్హం.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు