హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Success Story: కేవలం 6 వేల పెట్టుబడితో 2 లక్షల ఆదాయం.. 76 ఏళ్ల రైతు విజయం

Success Story: కేవలం 6 వేల పెట్టుబడితో 2 లక్షల ఆదాయం.. 76 ఏళ్ల రైతు విజయం

పుట్టగొడుగుల పెంపకం

పుట్టగొడుగుల పెంపకం

Mushroom Cultivation: పది రోజుల్లోనే పుట్టగొడుగులు కోతకు వస్తాయి. దుకాణాదారులకు విక్రయిస్తే కిలో రూ.70 నుంచి 80 వరకు పలుకుతుంది. కానీ నేరుగా రిటైల్‌లో విక్రయిస్తే కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు ధర వస్తుంది.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

మన దేశంలో కొందరు రైతులు పెట్టుబడి కూడా రాకుండా ఇబ్బంది పడుతుంటే.. ఇంకొందరు అన్నదాతలు మాత్రం అద్భుతాలు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే అధిక ఆదాయం పొందుతున్నారు. బీహార్‌ (Bihar)కు చెందిన ఓ రైతు కేవలం 6వేల రూపాయల పెట్టుబడితో.. మూడు నెలల్లో రెండు లక్షల వరకు సంపాదించారు. వెస్ట్ చంపారన్ జిల్లా మఝౌలియా మండలం భర్వాలియా గ్రామానికి చెందిన 72 ఏళ్ల రైతు.. రామచంద్ర బీహార్ ప్రభుత్వ సహకారంతో.. పుట్టగొడుగులను (Mushroom Cultivation)   సాగుచేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలు కాకుండా.. వాణిజ్య పంటను సాగుచేసి.. ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

బీహార్ ప్రభుత్వం హార్టికల్చర్ మిషన్ పథకం కింద పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తోంది.  ప్రభుత్వమే మొలకెత్తిన పుట్టగొడుగులను బ్యాగ్‌ల రూపంలో విక్రయిస్తుంది. ఒక్కో బ్యాగ్ ధర రూ.70 వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వం 90శాతం సబ్సిడితో 6 రూపాయలకే విక్రయిస్తుంది. ఆ రెడీమేడ్ పుట్టుగొడుగుల మొక్కలను తీసుకొచ్చి.. చీకటి గదిలో ఓ పది రోజుల పాటు సాగు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పుట్టగొడుగులను కట్ చేసి.. మార్కెట్‌లో విక్రయించవచ్చు.

PM Kusum Yojana: కేంద్రం అదిరే స్కీమ్.. రైతులు ఒక్కో ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందొచ్చు!

రామచంద్ర ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పుట్టు గొడుల పెంపకం చేపట్టారు. ఒక్కో  బస్తాకు రూ.6 చొప్పున సుమారు 200 బస్తాల మొలకెత్తిన పుట్టగొడుగుల  కొనుగోలు చేశారు. వీటి కోసం చీకటిగా ఉండి ఒక పాక లాంటింది సిద్దం చేసి.. అందులో పుట్టగొడుల సాగును చేపట్టారు. అందులో పుట్టగొడుగుల మొలకలకు రోజుకు రెండుసార్లు నీళ్లు ఇవ్వాలి. దాదాపు 8 నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక్కో సంచి నుంచి 3 నుంచి 4 కిలోల పుట్టగొడుగులు తయారయ్యాయి. మూడు నెలల్లో పుట్టగొడుగుల కొనుగోలుకు మొత్తం రూ.6వేలు వెచ్చించారు. వాటి నుంచి ఏకంగా రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించారు.

Business Ideas: రాబోయే రోజుల్లో ఈ వ్యాపారానికి ఫుల్ డిమాండ్.. లక్షల్లో లాభాలు

2 సంవత్సరాల క్రితం తాను తొలిసారిగా పుట్టగొడుగుల ఉత్పత్తిని ప్రారంభించానని రామచంద్ర చెప్పారు. హార్టికల్చర్ మిషన్ కింద పుట్టగొడుగుల ఉత్పత్తిపై ప్రభుత్వం నుండి 90 శాతం సబ్సిడీ పొందారు. మొదటిసారిగా 200 బస్తాల వరకు పుట్టగొడుగులను కొనుగోలు చేశాడు. రూ.12 వేలు విలువ చేసే పుట్టగొడుగు మొక్కలను పంట రూ.1200లకే కొన్నాడు. పది రోజుల్లోనే పుట్టగొడుగులు కోతకు వస్తాయి. దుకాణాదారులకు విక్రయిస్తే కిలో రూ.70 నుంచి 80 వరకు పలుకుతుంది. కానీ నేరుగా రిటైల్‌లో విక్రయిస్తే కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు ధర వస్తుంది. రామచంద్ర కూడా మార్కెట్‌లో కాకుండా.. రిటైల్‌గా విక్రయించి.. భారీగా లాభాలను పొందారు.

బీహార్ ప్రభుత్వ హార్టికల్చర్ మిషన్‌ను ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చని రామచంద్ర చెప్పారు. http://horticulture.bihar.gov.in/లో పుట్టగొడుగుల సాగును ఎంచుకొని..దరఖాస్తు చేయాలి. ఇందుకోసం ఆధార్ కార్డు, మీ ఫొటో, మష్రూమ్ ట్రైనింగ్ సర్టిఫికెట్, లేఅవుట్ ప్లాన్, ఎస్టిమేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అధికారులు తనిఖీ చేస్తారు. అప్పుడు వ్యవసాయ కేంద్రం నుండి 90 శాతం సబ్సిడీపై గరిష్టంగా 200 బస్తాల పుట్టగొడుగుల మొక్కలను మీకు అందిస్తారు.

First published:

Tags: Agriculture, Bihar, Business, Farmers

ఉత్తమ కథలు