హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

West Bengal: సీబీఐకి షాక్.. నారద స్కామ్‌లో అరెస్టైన మంత్రులకు బెయిల్ మంజూరు..

West Bengal: సీబీఐకి షాక్.. నారద స్కామ్‌లో అరెస్టైన మంత్రులకు బెయిల్ మంజూరు..

ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఐతే వారికి బెయిల్ ఇవ్వడంపై సీబీఐ అఢికారులు కోల్‌కతా హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు.

  పశ్చిమ బెంగాల్లో నారదా స్కామ్ మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. ఇద్దరు మంత్రులు సహా మొత్తం నలుగురు టీఎంసీ నేతలను సీబీఐ అరెస్ట్ చేయడం.. సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయానికి వెళ్లి గొడవ పెట్టుకోవడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఐతే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిందితుల బెయిల్ పిటిషన్‌పై సుమారు గంటల పాటు వాదోపవాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి అనుపమ్ ముఖర్జీ.. రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఐతే వారికి బెయిల్ ఇవ్వడంపై సీబీఐ అఢికారులు కోల్‌కతా హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు.

  2017లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసుల పశ్చిమ బెంగాల్‌లో సంచలనం రేపింది. లంచం తీసుకుంటున్నట్టు పలువురు ప్రజా ప్రతినిధులు అంగీకించిన వీడియోలు అక్కడి రాజకీయాలను ఊపేశాయి. ఈ కేసులో మంత్రులు. ఫీర్హాద్ హకీమ్, సుబ్రత ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీలను ప్రాసిక్యూషన్ చేసేందుకు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ ఈ నెల 7వ తేదీన అనుమతి మంజూరు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు నిందితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నేతల అరెస్ట్ విషయం తెలుసుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వెంటనే నిజామ్ ప్యాలెస్‌లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. ఆమెతో పాటు పలు టీఎంసీ నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. నిబంధలనలకు విరుద్దంగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. దమ్ముంటే తనను తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  మంత్రుల అరెస్ట్ అక్రమమని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బీమన్ బెనర్జీ ఖండించారు. సీబీఐ అధికారులు తన అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఇది బీజేపీ బెంగాల్ ప్రజల మీద చేస్తున్న అతి పెద్ద కుట్ర అని హకీమ్ కూతురు ప్రియదర్శిని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించినందుకు కోసంతో ఇలా చేస్తున్నారని విమర్శించారు. తృణమూల్ ఆరోపణలపై స్పందించిన బీజేపీ నేత రాహుల్ సిన్హా సీబీఐ అరెస్ట్‌లతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. మరోవైపు బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో టీఎంసీలో పార్టీలో ఉన్న ఆయనకు నారదా కుంభకోణంతో సంబంధాలున్నాయని.. మరి ఆయనపై ఎందుకు విచారణ చేయడం లేదని టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీలో ఉన్నందునే ఆయన్ను వెనకేసుకొస్తున్నారని..టీఎంసీ నేతలపై మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.

  First published:

  Tags: Mamata Banerjee, TMC, Trinamool congress, West Bengal

  ఉత్తమ కథలు