Partha Chatterjee Arrest : వెస్ట్ బెంగాల్(West Bengal)వాణిజ్యశాఖ మంత్రి,తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థా ఛటర్జీ(Partha Chatterjee)ని శనివారం ఉదయం ఈడీ(Enforcement Directorate)అరెస్టు చేసింది. శనివారం ఉదయం కోల్‌కతాలోని పార్థా చటర్జీ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో మంత్రి పార్ధాను అరెస్టు చేశారు. మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి పార్ధా సన్నిహితురాలు మంత్రి పార్ధా సహాయకురాలు ఇంట్లో శుక్రవారం ఈడీ సుమారు రూ. 21 కోట్ల నగదును సీజ్ చేసిన విషయం తెలిసిందే.
స్కూల్ సర్వీస్ కమిషన్(SSC), ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో అవకతవకలకు సంబంధించిన కేసులో సోదాలకు వెళ్లిన అధికారులకు ఈ డబ్బు దొరికింది. ఈడీ అధికారులు శుక్రవారం మంత్రి పార్థా ఛటర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఏక కాలంలో దాడులు నిర్వహించారు. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.
Students Kissing : అపార్ట్ మెంట్ లో కాలేజీ విద్యార్థుల ముద్దుల పోటీ
అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన రూ.21 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవేనని భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. నగదుతో పాటు అర్పిత ముఖర్జీ ఇంట్లో 20కిపైగా ఫోన్లను రికవరీ చేసుకున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ స్కాంతో సంబంధమున్న రికార్డులు, నేరానికి పాల్పడ్డ డ్యాక్యుమెంట్లు, కంపెనీల నకిలీ వివరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ నగదు, బంగారాన్ని వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నామని అధికారులు వివరించారు. పార్థా ఛటర్జీ గతంలో విద్యాశాఖ మంంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arrested, Enforcement Directorate, TMC, West Bengal