Home /News /national /

WEST BENGAL SPECIAL COURT ISSUE NOTICE TO HOME MINISTER AMIT SHAH BA

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు షాక్.. స్పెషల్ కోర్టు నోటీసు

అమిత్ షా (ఫైల్)

అమిత్ షా (ఫైల్)

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోర్టు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో కోల్‌కతాలోని ఓ స్పెషల్ కోర్టు ఈ మేరకు సమన్లు జారీచేసింది.

    కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోర్టు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో కోల్‌కతాలోని ఓ స్పెషల్ కోర్టు ఈ మేరకు సమన్లు జారీచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 22న తమ ఎదుట హాజరుకావాలని ఆ సమన్లలో ఆదేశించింది. అమిత్ షా వ్యక్తిగతంగా కానీ, లేదా న్యాయవాది ద్వారా 22వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించింది. అమిత్ షాపై పరువునష్టం దావా ఫైల్ చేశారు టీఎంసీ ఎంపీ తృణమూల్ బెనర్జీ. దీనికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 500 కింద చార్జ్ నమోదైంది. దీనిపై ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ నోటీసుకు సంబంధించి అభిషేక్ బెనర్జీ తరఫు న్యయవాది సంజయ్ బసు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం అమిత్ షా 2018 ఆగస్టు 11న పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతాలో పర్యటించినప్పుడు మాయో రోడ్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మీద అభ్యంతరకర ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

    ఇక తాజాగా అమిత్ షా బెంగాల్‌ వెళ్లారు. అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బెంగాల్‌లో బీజేపీ గెలవడం ఖాయమని అన్నారు కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీనే గెలవబోతోందని, ప్రజలు తమకే బ్రహ్మరథం పడతారని అమిత్ షా అన్నారు. బెంగాల్‌లో మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదని ఆయన ఆరోపించారు. మహిళా ముఖ్యమంత్రే ఉన్నప్పటికీ మహిళలు వెనుకబడే ఉన్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు 33 శాతం కంటే అధికారంగా రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్ మార్పును కోరుకుంటోందని అన్నారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పర్గనాల జిల్లాలో గురువారం జరిగిన ఐదవ పరివర్తన ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.

    మరోవైపు దక్షిణ 24 పరగణాల జిల్లాలో గురువారం దాదాపు ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇద్దరు వేర్వేరు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. కొద్ది దూరంలోనే ఇద్దరు ముఖ్యనేతల కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు టెన్షన్ పడ్డారు. అయితే అమిత్ షా, మమతా బెనర్జీ సభలు ప్రశాంతంగా జరగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అమిత్ షా ఒకే జిల్లాలో దాదాపు ఒకే సమయంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ఇదే తొలిసారి.

    2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లోని 42 లోక్‌సభ స్థానాల్లో 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది. టీఎంసీ 22 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని గద్దె దింపి.. అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ భావిస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Amit Shah, Kolkata, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు